Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
డేటింగులో ఉన్నప్పుడు అలా చేస్తే మీ డబ్బు ఆదా... మీ పార్ట్ నర్ మీకు కచ్చితంగా ఫిదా...!
మీ దగ్గర తక్కువ బడ్జెట్ ఉంటే ఖరీదైన ప్రయాణాల గురించి ఆలోచించకండి. అయితే మీరిద్దరూ కలిసి ట్రెక్కింగుకు వెళ్లొచ్చు.
మీరు మీ భాగస్వామితో కలిసి డేటింగ్ వెళ్లాలని అనుకుంటున్నారా? ఇందు కోసం ఖరీదైన బహుమతులను ఇచ్చి వారితో సరదాగా గడపాలనుకుంటున్నారా? అయితే మీకు బడ్జెట్ సమస్యలు ఎదురవుతున్నాయా? అయితే మీరు మీ పార్ట్ నర్ ని పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటళ్లు..

జెట్ ట్రావెల్స్ లో గడపడం వంటివే కాకుండా.. మీ దగ్గర ఉన్న బడ్జెట్ లోనే మీ భాగస్వామితో మీరు నాణ్యమైన సమయాన్ని గడపవచ్చు.

అయితే డేటింగుకు వెళ్లే సమయంలో ఈ టిప్స్ ఫాలో అయితే మీరు ఎక్కువ ప్రేమను మీ భాగస్వామికి అందించొచ్చు. అలాగే తక్కువ ఖర్చుతో మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఈ చిట్కాలేంటో మీరు చూసేయండి మరి...

మూవీస్ తో మింగిల్..
మీ ఇద్దరు కలిసి డేటింగులో బాగా ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు మూవీస్ చూడటం ప్రారంభించాలి. ఇందుకోసం మీరు సినిమా థియేటర్లకు వెళ్లాల్సిన పని లేదు. మీ ఇల్లు లేదా ఓ గదిలో రొమాంటిక్ సినిమాలను చూసేలా ప్లాన్ చేసుకోండి. మీరు మీ భాగస్వామికి ఇష్టమైన సినిమాను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీకు ఇష్టమైనవి చూడాలి. అలా మూవీస్ చూస్తూ మీ భాగస్వామితో క్లోజ్ గా మింగిల్ అవ్వొచ్చు.

నాణ్యమైన సమయం గడిపేందుకు..
మీరు ఇద్దరు అలా బెడ్ రూములో కూర్చుని సినిమాలు చూస్తున్నప్పుడు, మధ్యలో స్నాక్స్ మరియు కూల్ డ్రింక్స్ వంటి వాటిని తీసుకోవచ్చు. అదే సమయంలో మీ పార్ట్ నర్ ను ప్రేమతో కౌగిలించుకోవడం వంటివి చేస్తే.. అది మీకు జీవితాంతం గుర్తుండిపోయే రోజు అవుతుంది. దీనికి కూడా పెద్దగా ఖర్చులు అవ్వవు అని గుర్తించాలి. అంతే కాదు మీరిద్దరూ ఒకరితో ఒకరు నాణ్యమైన సమయాన్ని గడిపేందుకు మంచి అవకాశం లభిస్తుంది.

ట్రెక్కింగుకు వెళ్లండి..
మీ దగ్గర తక్కువ బడ్జెట్ ఉంటే ఖరీదైన ప్రయాణాల గురించి ఆలోచించకండి. అయితే మీరిద్దరూ కలిసి ట్రెక్కింగుకు వెళ్లొచ్చు. అయితే చిన్న ట్రెక్స్ మాత్రమే మంచిదని గుర్తించాలి. అలాగే ట్రెక్కింగ్ వల్ల మీరు మీ భాగస్వామితో ఒకరోజు గడపడానికి మీరు నిశ్శబ్ద స్థలాన్ని ఎంచుకోవాలి.

పిక్నిక్ ప్లాన్ చేయండి..
మీ దగ్గర ఉన్న బడ్జెట్ లోనే మీ భాగస్వామితో కలిసి పిక్నిక్ ప్లాన్ చేయండి. లేదా విహారయాత్రకు అయినా ప్లాన్ చేయండి. మీరు ఒక పార్కుకో లేదా బీచ్ దగ్గరికో పిక్నిక్ ను ప్లాన్ చేయవచ్చు. అలాగే కొన్ని ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్, చదవడానికి మంచి పుస్తకాలు, ఒక చాప వంటివి తీసుకెళ్లాలి. ముఖ్యంగా మీ భాగస్వామితో ఆ క్షణాలను ఆస్వాదించేందుకు తగినంత సమయాన్ని కేటాయించండి. మీరు మీ భాగస్వామికి తగినంత సమయం ఇవ్వడమే కాకుండా మీరు ఎక్కువగా ఖర్చు చేయకుండా చూసుకోండి.

ఆహారం గురించి మాట్లాడండి..
మీరు మరియు మీ పార్ట్ నర్ మంచి ఆహారం కోసం మాట్లాడుకోవాలి. ముందుగా రుచికరమైన వంటకాలు ఎక్కడ దొరుకుతాయో కనిపెట్టాలి. ఆ తర్వాత మీరు మీ భాగస్వామితో కలిసి రుచికరమైన ఆహారాన్ని వండటం కూడా ప్రయత్నించవచ్చు. అనంతరం మీరు తెచ్చిన ఆహారాన్ని ప్రేమతో మీ భాగస్వామికి వడ్డించండి.

లాంగ్ డ్రైవ్...
మీరు మీ పార్ట్ నర్ తో కలిసి స్టార్ హోటల్ లో లేదా పబ్ లకు వెళ్లే బదులు మీరు మీ భాగస్వామితో కలిసి లాంగ్ డ్రైవ్ కు వెళ్లొచ్చు. ఇలాంటి వాటిని మీ భాగస్వామి కచ్చితంగా ఇష్టపడతారు. మీరు మీ భాగస్వామితో లాంగ్ డ్రైవ్ లో ఉన్న సమయంలో మీ భవిష్యత్తు లేదా మీ జీవిత లక్ష్యాల గురించి కూడా మాట్లాడవచ్చు. ఒకవేళ మీతో సొంత వాహనం లేకపోతే మీరు మీ స్నేహితులన వాహనాలను పొందొచ్చు. లేదా కారును గానీ, బైకును గానీ అద్దెకు తీసుకుని మీ భాగస్వామితో అందమైన రోజును గడపవచ్చు.

కొత్తగా ట్రై చేయడం..
సృజనాత్మకతను తీసుకురావడం అనేది మీ జీవితాన్ని మెరుగుపర్చడానికి అద్భుతమైన ఆలోచన. మీకు మరియు మీ భాగస్వామికి కొంత సృజనాత్మకత ఉన్నప్పుడు, వాటిని వ్యక్తపరచండి. దీని కోసం, మీరు ఒకరికొకరు గ్రీటింగ్ కార్డులను సృష్టించవచ్చు లేదా వాటిని గీయండి లేదా వారు మీ పట్ల తమ ప్రేమను వ్యక్తపరచటానికి ఇష్టపడతారు.

అంతర్గత లక్షణాలే లక్ష్యం..
డేటింగులో ఉన్నప్పుడు మీరు మీ భాగస్వామితో ఏమి చేసినా.. ఎక్కడికి వెళ్లినా.. మీరు మరియు మీ భాగస్వామి అంతర్గత లక్షణాలను అర్థం చేసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఖరీదైన బహుమతులు మీ సంబంధాన్ని బలోపేతం చేయలేవు. ప్రేమలో ఉన్న సమయంలో ఒకరితో ఒకరు నాణ్యమై పంచుకోవడమే నిజమైన బహుమతి అని అందరూ గుర్తుంచుకోవాలి.



Click it and Unblock the Notifications











