For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రేకప్ తర్వాత మళ్లీ లవ్ చేసే ఛాన్సొస్తే... ఈ పొరపాట్లు చేయొద్దు...!

|

ఒక్కసారి మన మనసుకు ఎంతగానో ఇష్టమైన వ్యక్తి నుండి విడిపోవడం అనేది.. మనల్ని ఎల్లప్పుడూ బాధిస్తూనే ఉంటుంది. అయితే బ్రేకప్ తర్వాత కూడా కొన్ని లాభాలున్నాయని మీకు తెలుసా...


బ్రేకప్ తర్వాత వచ్చే పెయిన్ వల్ల మీరు మీ లైఫ్ లో మరింత స్ట్రాంగ్ గా మారేందుకు సహాయపడుతుంది. అంతేకాదు ఎన్నో కొత్త విషయాలను కూడా నేర్పిస్తుంది. జీవితాంతం గుర్తుండే పాఠాలనూ బోధిస్తుంది.
అయితే బ్రేకప్ తర్వాత మళ్లీ ప్రేమ స్టార్టవుతుందా? అంటే కచ్చితంగా అవుననే సమాధానమే వస్తుంది. ఎందుకంటే కేవలం ఒక బంధం మాత్రమే మిమ్మల్ని నిర్వచించలేదు. మీకంటూ మీరు విలువ ఇచ్చుకోవడం ఎంతో అవసరం. మీకు కూడా ఉద్యోగం, విద్య, కుటుంబం, స్నేహితులు ఇలా ఎన్నో ఉన్నాయి.
అన్నింటికంటే ముఖ్యంగా మీకు మీరున్నారు. ఒక బంధం తెంచుకున్న వెంటనే జీవితం ముగిసినట్టు కాదు. ఆ బంధం కంటే మీరు ఎంతో గొప్పవారని గుర్తుంచుకోవాలి. అందుకే కొత్త బంధాన్ని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అంతేకాదు అలాంటి కొత్త బంధం మనలో కొన్ని ఆనందాల్ని కూడా తెస్తుంది. అయితే ఇలాంటి సంబంధంలో కూడా మీ మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో మేము మీకు తెలియేస్తాం... ఇంకెందుకు ఆలస్యం చూసెయ్యండి మరి...

అలా కలిశాడు.. పెళ్లై.. పిల్లలూ ఉన్నారన్నాడు.. కానీ నన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు...!అలా కలిశాడు.. పెళ్లై.. పిల్లలూ ఉన్నారన్నాడు.. కానీ నన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు...!

పోల్చుకోవద్దు..

పోల్చుకోవద్దు..

మీరు బ్రేకప్ తర్వాత కొత్త బంధాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు ప్రస్తుత భాగస్వామితో మీ పాత భాగస్వామితో పోల్చకండి. చాలా మంది కొత్తగా రిలేషన్ స్టార్ చేసిన వెంటనే చేసే పెద్ద పొరపాటు ఇదే. ఇలా చేయడం వల్ల మీ పార్ట్ నర్ మనసులో అసూయ, సందేహాలు కలగడమేకాదు.. ఇంకా తనతో మీరు రిలేషన్ షిప్ లో ముందుకు సాగరనే ఆలోచన తనకు వస్తుంది.

బంధం బలపడాలంటే..

బంధం బలపడాలంటే..

మీ ఇద్దరి మధ్య మధ్య బంధం బలపడాలంటే మీరు కొన్ని విషయాలకు నో చెప్పడం నేర్చుకోవాలి. ముఖ్యంగా మీకు ఇష్టం లేని విషయాలకు నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మీ బంధం బలపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ భాగస్వామికి కూడా మీకు ఏవి ఇష్టం లేదో.. ఏవి ఇష్టమో స్పష్టంగా తెలుస్తుంది. అలా కాకుండా మీరు ప్రతి దానికీ సర్దుకుపోవడం.. అంగీకరించడం వంటివి చేస్తే భవిష్యత్తులో మీ బంధంలో సమస్యలు ఏర్పడతాయి.

కలిసి గడపండి..

కలిసి గడపండి..

మీ బంధంలో ఎలాంటి సమస్యలు రాకూడదంటే.. మీరు మీ పార్ట్ నర్ చేసిన ఫోన్ కాల్స్ మరియు వాట్సాప్, ఫేస్ బుక్, మెసెజ్ లను అస్సలు మిస్ అవ్వకండి. మీ భాగస్వామితో కలిసి అప్పుడప్పుడు విందు.. వినోదం.. విహారయాత్ర వంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి.

పెళ్లైనా ఆ ముచ్చట తీరలేదా... అయితే ఈ చిట్కాలను ట్రై చెయ్యండి.. రొమాన్స్ లో రెచ్చిపోండి...!పెళ్లైనా ఆ ముచ్చట తీరలేదా... అయితే ఈ చిట్కాలను ట్రై చెయ్యండి.. రొమాన్స్ లో రెచ్చిపోండి...!

నటించకండి..

నటించకండి..

బ్రేకప్ తర్వాత ఏర్పడిన రిలేషన్ షిప్ లో మీకు నచ్చని పని లేదా వస్తువుల గురించి సీరియల్స్ లో మనషుల్లా ఎప్పుడూ నటించకండి. మీకు ఏదైనా నచ్చకపోతే నాకు ఇది నచ్చలేదు అని సున్నితంగా మీ భాగస్వామికి చెప్పండి. ఉదాహరణకు మీ పార్ట్ నర్ కు నచ్చిన సినిమా లేదా మీ పార్ట్ నర్ కు ఇష్టమైన పెంపుడు జంతువు.. మీ పార్ట్ నర్ కు ఇష్టమైన ఫుడ్ ఇలా దేని గురించి అయినా మీకు ఇష్టం లేకపోతే నచ్చినట్టు నటించకండి. మీకు అలాంటివి నచ్చనపుడు సున్నితంగా చెప్పడం వల్ల మీ బంధం బలపడుతుంది.

అర్థం చేసుకుంటారు..

అర్థం చేసుకుంటారు..

ఇలా మాట్లాడటం వల్ల.. మీ నిర్ణయాలను సున్నితంగా చెప్పడం వల్ల.. మీ భాగస్వామి మెచ్యూర్ అయినట్లయితే, మీ ఇష్టాలను అర్థం చేసుకుని గౌరవిస్తారు.

పర్సనల్ టైమ్..

పర్సనల్ టైమ్..

బ్రేకప్ తర్వాత మీ భాగస్వామిని డామినేట్ చేసే పనులను ఎప్పుడు చేయకండి. మీరు మీ ఇష్టాలను, డిసెషిన్లను వారిపై బలవంతంగా రుద్దకూడదు. మీ భాగస్వామి వారి స్నేహితులు, కుటుంబసభ్యులను కలవకుండా, వారితో సమయం గడపకుండా ఎప్పటికీ ఆపొద్దు. అయితే మీరు మీ భాగస్వామిని మీతో ఎక్కువ సమయం గడపమని అడగొచ్చు. అయితే ఆంక్షలు మాత్రం పెట్టకండి. అలా చేస్తే వారికి మీ మీద త్వరగా చిరాకు వస్తుంది.

నిర్లక్ష్యం చేయకండి..

నిర్లక్ష్యం చేయకండి..

మీ భాగస్వామికి ప్రతి విషయంలోనూ స్వేచ్ఛ ఇవ్వడం.. మీ రిలేషన్ షిప్ మంచిగా ఉండటానికి ఒక గొప్ప మార్గం అయితే, భాగస్వామిని నిర్లక్ష్యం చేయడం కూడా అంతే పెద్ద పొరపాటు అవుతుంది. కాబట్టి మీ బంధం బలంగా ఉండాలంటే మీరు పైన చెప్పిన తప్పులను అస్సలు చేయకండి.

English summary

Can I love Again After A Bad Breakup?

Here we talking about can i love again after a bad breakup. Read on