Latest Updates
-
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు!
పెద్దలు సెట్ చేసినా.. ప్రేమతో అల్లుకున్న బంధం ఈ హీరోలది...!
మన సెలబ్రెటీలలో ప్రేమించి, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకున్న వారెవరో తెలుసుకోవడానికి ఓ లుక్కేయండి.
ప్రేమ పెళ్లి అంటేనే ప్రేమికులిద్దరూ తమ గురించి తాము పూర్తిగా అర్థం చేసుకోవాలి. వారు అర్థం చేసుకున్న తర్వాత వారిద్దరి కుటుంబాలను, పెద్దలను పెళ్లికి ఒప్పించాలి. ఇలా అనుకున్నవన్నీ సాఫీగా సాగిపోతే ఏ సమస్యా ఉండదు. ఎందుకంటే ప్రేమ వివాహం చేసుకునే జంటలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు రావని చాలా మంది భావిస్తారు.

కానీ అందరి జీవితంలో అలా కుదరదు. కానీ ప్రేమించే లక్షణం ఉంటే చాలు ప్రేమ పెళ్లిళ్లే కాదు.. పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్లోనూ ప్రేమ నిండి ఉంటుందని కొన్ని జంటలు నిరూపిస్తున్నాయి. వీరిలో ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఉన్నారు. ఇలా పెద్దలు కుదర్చిన పెళ్లితో ఒక్కటై.. ఆ తర్వాత ప్రేమ బంధంతో ఎంతో హాయిగా జీవితాన్ని మూడు పువ్వులు.. ఆరుకాయలుగా సాగిస్తున్న జంటల గురించి ఇప్పుడు తెలుసుకుందామా...

ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి
జూనియర్ ఎన్టీఆర్. ఆ పేరులోనే ఏదో ఒక వైబ్రేషన్. అందుకే ఆయనకు అనేకమంది అభిమానులు ఉన్నారు. ఈ జూనియర్ మనసును దోచుకున్న అమ్మాయి లక్ష్మీప్రణతి. వీరిద్దరిదీ పెద్దలు కుదర్చిన వివాహమే. 2011 సంవత్సరంలో మే 5వ తేదీన వీరి వివాహం జరగ్గా.. అప్పటికీ తన వయసు కేవలం 19 సంవత్సరాలే. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. టాలీవుడ్ లో ఇప్పటికీ ఆదర్శ దంపతులలో వీరు ఒకరని చెప్పొచ్చు. వీరి పదేళ్ల వివాహం, ప్రేమ బంధానికి చిహ్నంగా ఇద్దరు క్యూట్ కిడ్స్ అభయ్ రామ్.. భార్గవ్ రామ్ కూడా ఉన్నారు.

అల్లు అర్జున్-స్నేహరెడ్డి..
వరుడు సినిమాలో నటించిన స్నేహారెడ్డిని అల్లుఅర్జున్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అంతేకాదు ఒక్కరూపాయి కూడా కట్నం తీసుకోలేదట. అల్లు అరవింద్ అమ్మాయి ఒక చిన్న సూట్ కేసుతో మా ఇంటికి వస్తే చాలు అన్నారని సమాచారం. 2011లో మార్చి 6వ తేదీన వీరిద్దరి వివాహం జరిగింది. స్టైలీష్ స్టార్ అల్లుఅర్జున్, స్నేహారెడ్డి ఫస్ట్ మీట్ ఇప్పటివరకు ఎందరినో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా అయాన్, అర్హలు ఉన్నారు. వీరు కూడా సోషల్ మీడియాలో భలే సందడి చేస్తున్నారు.

రామ్ చరణ్-ఉపాసన..
అల్లుఅర్జున్, ఎన్టీఆర్ తో ఎంతో క్లోజ్ గా ఉండే రామ్ చరణ్ వారిద్దరి పెళ్లి తర్వాత 2012 సంవత్సరంలో జూన్ 14వ తేదీ తన ప్రేయసి ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఈ జోడీ సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఉపాసన పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. అంతేకాదు తను అపోలో హాస్పిటల్ మేనేజ్ మెంట్ బాధ్యతలు చూస్తూ.. మహిళల ప్రాధాన్యత, హక్కుల తదితర అంశాలపైనే స్పందిస్తోంది. మరోవైపు చెర్రీ కూడా నటుడిగా, నిర్మాతగా బిజీగా గడుపుతున్నారు. అయితే వీరికి ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. ఇటీవలే చిరంజీవి కూడా వారసుల విషయంలో తన కోరికను బయటపెట్టేశారు. సో చూడాలి వీరు గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారో అని.

రానా -మిహీకా..
భళ్లాలదేవునిగా బాగా పాపులర్ అయిన దగ్గుబాటి రానా కూడా కరోనా కాలంలో ఓ ఇంటివాడయ్యాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ రానా దగ్గుబాటి.. తన సింగిల్ లైఫ్ కి ఎండ్ కార్డ్ వేసేశారు. గత ఏడాది డిసెంబర్ నెలలో 26వ తేదీన కేవలం అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో మిహీకా బజాజ్ మెడలో మూడు ముళ్లు వేసేశాడు. అయితే మిహికా ఎవరో కాదు. తన నెచ్చెలి. రానా తన పెళ్లి వివరాలన్నీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. తమ ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయని.. పెద్దల సమక్షంలో తమ వివాహం జరుగుతుందని చెప్పాడు. అనుకున్న సమయానికే పెళ్లి చేసుకొని ఆనందంగా జీవిస్తున్నాడు.

నితిన్-షాలిని..
టాలీవుడ్ యంగ్ హీరోగా కొద్దికాలంలో సూపర్ హీరోగా, పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఉన్న హీరో నితిన్ కూడా గత ఏడాది కరోనా కాలంలోనే ఓ ఇంటివాడయ్యాడు. 2020 సంవత్సరంలో జులై 26వ తేదీన హైదరాబాదులోని ఫలక్ నుమా ప్యాలెస్ లో వివాహం చేసుకున్నాడు. అయితే అంతకుముందు కరోనా కారణంగా దుబాయ్ లో పెళ్లి వేడుకలుంటాయని సమాచారం వచ్చింది. కానీ కరోనా క్రమంగా తగ్గిపోవడంతో.. అతి కొద్ది మంది అతిథులు, కుటుంబ సభ్యులతో కలిసి నితిన్ కళ్యాణం చేసుకున్నాడు.

నిఖిల్ -పల్లవి వర్మ..
హ్యాపీడేస్ తర్వాత యంగ్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నిఖిల్ సిద్ధార్థ కూడా కరోనా కాలంలోనే ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మను పెళ్లాడాడు. 2020 సంవత్సరంలో మే 14వ తేదీన అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చాడు. లాక్ డౌన్ కారణంగా తన పెళ్లిని కొన్నిసార్లు వాయిదా వేసుకున్నప్పటికీ.. కరోనా అంతం కాకపోవడంతో.. వారి కుటుంబ సభ్యులు, పెద్దలు శామీర్ పేటలోని ఫారెస్ట్ రిడ్జ్ రిసార్ట్ లో పెళ్లి చేసేశారు. తన పెళ్లిలో సామాజిక దూరాన్ని పాటించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారంటే నిఖిల్ ను అందరూ పొగడ్తలతో ముంచెత్తారు.

అల్లరి నరేష్-విరూప
ఇటీవలే నాంది సినిమాతో మళ్లీ సినిమాలు షురూ చేసిన అల్లరి నరేష్ కామెడీ హీరోగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ అల్లరి పిడుగు చెన్నైకు చెందిన ఆర్కిటెక్ట్ విరూపను 2015 సంవత్సరంలో మే 15వ తేదీన వివాహమాడాడు. తనకేమో సినిమాలంటే అస్సలు అవగాహన లేదట. పెళ్లి నాటికి నరేష్ సినిమాలు కూడా చూడలేదట. వీరిద్దరిదీ కూడా పెద్దలు కుదిర్చిన వివాహమే. వీరికి అయాన ఇవిక అనే చిన్న పాప ఉంది.

ధనుష్-ఐశ్వర్య..
వివాహ జంటల్లో ప్రేమ గురించి చెప్పాలంటే.. ధనుష్, ఐశ్వర్య పేర్ల గురించి చర్చ తప్పకుండా వస్తుంది. ధనుష్ తమిళ హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలోనే తనకు ఐశ్వర్యతో పెళ్లి జరిగింది. వీరిది కూడా పెద్దలు సెట్ చేసిన సంబంధమే. పెళ్లికి ముందు వీరు కామన్ గా కలిసినా.. వారిద్దరి మధ్య ప్రేమ ప్రస్తావన ఎక్కడా రాలేదట. కానీ ఇప్పుడు పెళ్లి జరిగి ఇన్నేళ్లయిన కూడా ‘ఆదర్శ దంపతులు'ఇలానే ఉంటారని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. వీరిద్దరి ప్రేమకు చిహ్నంగా యాత్ర, లింగ అనే ఇద్దరు పిల్లలు పుట్టారు.

గోపించద్ - రేష్మ
టాలీవుడ్ లో ముందుగా విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా నిలదొక్కుకున్న హీరో గోపిచంద్. తన తండ్రి డైరెక్టర్ టి.క్రిష్ణ. తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు సినిమాల్లోకి వచ్చిన ఈ హీరో.. ప్రముఖ నటుడు శ్రీకాంత్ మేనకోడలు రేష్మను 2013 సంవత్సరంలో మే 12వ తేదీన వివాహం చేసుకున్నాడు. తను పెళ్లికి ముందు అమెరికాలో చదువుకుని వచ్చింది. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ దాదాపు ఎనిమిదేళ్లు ఉండటం విశేషం. అయినా కూడా వీరిద్దరి మధ్య ప్రేమ, అన్యోన్యత ఏ మాత్రం తగ్గలేదు. వీరి ప్రేమకు గుర్తుగా విరాట్ అనే బాబు కూడా ఉన్నాడు.

ఆది-అరుణ..
తెలుగు సినిమాల్లో డైలాగ్ స్పెషలిస్ట్ ఎవరంటే.. టక్కున గుర్తుకొచ్చే పేరు సాయి కుమార్. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ తన కుమారుడు ఆది కూడా చాలా సినిమాల్లో నటించాడు. ఈ టాలీవుడ్ కుర్రాడిది కూడా పెద్దలు కుదిర్చిన సంబంధమే. 2014 సంవత్సరం డిసెంబర్ మాసంలో వీరి వివాహం జరిగింది. వీరి జంట కూడా చిలకాగోరింకల్లా ఉంటుందని చాలా మంది కితాబిచ్చారు. వీరిద్దరికీ ఓ చిట్టిపాపాయి కూడా ఉంది. తన పేరు అయాన.



Click it and Unblock the Notifications











