పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన సెలబ్రెటీలు... నాడు శ్రీదేవి.. నేడు నటాషా...

పెళ్లికి ముందే తల్లి అయిన సెలబ్రెటీలెవరో ఎవరో మీరే చూడండి.

మన భారతదేశంలో పెళ్లి అనే ఘట్టానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే పెళ్లి తర్వాత జరిగే ఆ కార్యాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే సినిమా, స్పోర్ట్స్ స్టార్లకు అలాంటివేమీ పట్టట్లేదని చెప్పాలి.

Celebrities Who Were Pregnant Before They Got Married

సినీ, క్రీడా రంగంలో ఉండే వారికి డేటింగులు, పెళ్లికి ముందే తల్లి కావడం వంటివి సర్వసాధారణమైన విషయాలు. ఇలాంటి సంప్రదాయం మన తెలుగులో కూడా ఉంది. పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ కూడా పెళ్లికి ముందు పవన్ తో సహజీవనం చేసి తల్లి అయ్యింది.

Celebrities Who Were Pregnant Before They Got Married

ఆమె ఒక్కటే కాదు అతిలోక సుందరి శ్రీదేవి, కమల్ హాసన్ భార్య సారిక వంటి ప్రముఖులెందరో పెళ్లికి ముందే గర్భం దాల్చి తల్లి అయ్యారు.
ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలంతా సెక్స్ గురించి ఎంత ఓపెన్ గా మాట్లాడుతున్నారో.. అంతే ఓపెన్ గా సహజీవనం చేస్తున్నారు. ఇక పెళ్లికి ముందే గర్భం దాల్చడం వంటి వాటినైతే చాలా లైట్ తీసుకుంటున్నారు.

Celebrities Who Were Pregnant Before They Got Married

ఇదిలా ఉండగా ఇలాంటి వారినే ఆదర్శంగా తీసుకున్న మరో స్టార్ నటాషా(స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య గర్ల్ ఫ్రెండ్) కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఇదే విషయాన్ని తాజాగా హార్దిక్ పాండ్య సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నాడు. దీంతో నటాషా గర్భంతో ఉన్న ఫొటోలన్నీ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా పెళ్లికి ముందే బాయ్ ఫ్రెండ్స్ తో, ప్రియుడితో సహజీవనం చేసి తల్లి అయిన సెలబ్రెటీలెవరో ఇప్పుడు చూసెద్దాం...

శ్రీదేవి-బోణీ కపూర్..

శ్రీదేవి-బోణీ కపూర్..

వెండి తెరపై అతిలోక సుందరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ శ్రీదేవి, బోణీకపూర్ ను పెళ్లి చేసుకోకముందే తల్లి అయ్యిందంటూ అప్పటి మీడియాలో తెగ వార్తలొచ్చాయి. బోణీ కపూర్ తో పెళ్లి సమయంలో శ్రీదేవి ఏడు నెలల గర్భవతి అంటూ ప్రచారం జరిగింది. ఆ విషయాన్ని అప్పట్లో శ్రీదేవి దంపతులు ఈ విషయాన్ని అధికారికరంగా ప్రకటించకపోయినా... వారిద్దరికి పెళ్లి అయిన మూడు నెలల్లోనే జాన్వీ కపూర్ కు శ్రీదేవి జన్మనిచ్చింది. ప్రస్తుతం శ్రీదేవి మరణించిన సంగతి అందరికీ తెలిసిందే.

పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్..

పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రేణు దేశాయ్ తో వివాహానికి ముందే సహజీవనం చేసి అకీరాకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రేణు ఓ పండంటి పాపకు జన్మనిచ్చింది. అయితే వీరిద్దరూ ప్రస్తుతం విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.

కమల్ హాసన్-సారిక..

కమల్ హాసన్-సారిక..

కమల్ హాసన్ భార్య సారికను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఆమె కూడా అచ్చం అతిలోక సుందరి శ్రీదేవి మాదిరిగానే పెళ్లికి ముందే గర్భవతి అయ్యింది. వీరిద్దరికీ పుట్టిన హీరోయినే ప్రస్తుత శృతి హాసన్.

కల్కి కొచ్లిన్..

కల్కి కొచ్లిన్..

బాలీవుడ్ లో పెళ్లికి ముందు తల్లి కావడం అనేది చాలా కామన్. అయితే బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ను పెళ్లాడింది. ఆ తర్వాత ఆయనతో తెగదెంపులు చేసుకుంది. వెంటనే మరో యువకుడితో ప్రేమలో పడిపోయి గర్భం దాల్చింది.

ఆడపిల్లకు జననం..

ఆడపిల్లకు జననం..

పెళ్లికి ముందే తల్లి కావడంపై నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్ చేసినా.. అవేమీ పట్టించుకోలేదు కల్కి. ఇజ్రాయెల్ లోని జెరూసలెంకు చెందిన పియానిస్ట్ గయ్ తో ప్రేమలో మునిగి తేలి తాను పెళ్లికాకుండానే తల్లి అయ్యాయని ప్రకటించి సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఇటీవల ఓ ఆడపిల్లకు కూడా జన్మనిచ్చింది. ఆ పాపకు ఇంకా పేరు కూడా పెట్టలేదు.

నేహాదూపియా-అంగద్ బేడీ..

నేహాదూపియా-అంగద్ బేడీ..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన నేహా దూపియా, నటుడు అంగద్ బేడీ పెళ్లికి ముందే మంచి స్నేహితులుగా ఉండేవారు. అయితే వీరిద్దరి మధ్య లవ్ అఫైర్ ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అయితే వీరు ఇద్దరూ కలిసి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అప్పటికే నేహా ధూపియా గర్భం దాల్చినట్లు వార్తలొచ్చాయి.

అమృత అరోరా..

అమృత అరోరా..

అమృత అరోరా కూడా షకీల్ లడక్ ను పెళ్లాడింది. అప్పటివరకు గాఢమైన ప్రేమలో ఉన్న వీరిద్దరు హడావుడిగా, ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందే ఆమె ప్రెగ్నెంట్ అయ్యిందని, అందుకే అంత త్వరగా పెళ్లి చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వినిపించాయి.

కొంకన సేన్ శర్మ..

కొంకన సేన్ శర్మ..

మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కొంకన సేన శర్మ పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఈ బాలీవుడ్ భా రన్ వీర్ శౌరీతో రహస్య వ్యహారం సాగించింది. చాలా కాలం పాటు తనతో సాన్నిహిత్యాన్ని కొనసాగించిన సేన్ శర్మ కూడా వివాహానికి ముందే గర్భవతిగా మారి, ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

మహిమ చౌదరి - బాబీముఖర్జీ..

మహిమ చౌదరి - బాబీముఖర్జీ..

మహిమ చౌదరి పెళ్లికి ముందే గర్భం దాల్చింది. బాబీ ముఖర్జీని 2006వ సంవత్సరంలో వివాహం చేసుకుంది. ఈమె కూడా పెళ్లికి ముందే గర్భవతి కావడంతో బాబీని రహస్యంగా వివాహం చేసుకుంది.

నైనా గుప్తా-వివియన్ రిచర్డ్స్..

నైనా గుప్తా-వివియన్ రిచర్డ్స్..

మరో సీనియర్ హీరోయిన్ నైనా గుప్తా కూడా పెళ్లికి ముందే తల్లి అయ్యింది. ఈ భామ చాలా కాలం పాటు వివియన్ రిచర్డ్స్ తో డేటింగ్ లో ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ కూడా పెళ్లి సమయానికి ఒక బేబీకి జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

వీళ్లు మాత్రమే కాదు... ఇంకా చాలా మంది సెలబ్రెటీలు ఇలా పెళ్లికి ముందే గర్భవతులయ్యారు. కొంతమంది కలిసి సహజీవనం చేస్తున్నారు. కొంతమంది పెళ్లి చేసుకున్నారు. మరికొందరు మాత్రం విడిపోయి జీవిస్తున్నారు.

Desktop Bottom Promotion