For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy Chocolate Day 2021: చాక్లెట్ డే వెనుక ఉన్న వేల ఏళ్ల నాటి చరిత్ర గురించి తెలుసా...!

చాక్లెట్ డే వెనుక ఉన్న చరిత్ర గురించి తెలిస్తే షాకవుతారు...!

|

చిన్నారులైనా... పెద్దలైనా చాక్లెట్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. అందరికీ అత్యంత ఇష్టమైన వాటిలో చాక్లెట్ చాలా సార్లు ఫస్ట్ ప్లేసులో నిలిచింది.

Chocolate Day 2021: Date, Ideas, Importance, Why to Celebrate in Telugu

ఇక ఫిబ్రవరి 9న చాక్లెట్ డే అంటే ప్రేమికులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ సమయంలో తాము ప్రేమిస్తున్న వారికి చాక్లెట్ ఇవ్వడం ద్వారా తమ ప్రేమలో తియ్యదనం నింపుకుంటారు.

Chocolate Day 2021: Date, Ideas, Importance, Why to Celebrate in Telugu

ఇది మాత్రమే కాదు.. ఎవరైనా నిరాశలో ఉన్నా లేదా సంతోషంగా ఉన్నా ప్రతి ఒక్కరూ చాక్లెట్ తినడం ద్వారా తమ భావాలను షేర్ చేసుకుంటారు.

Chocolate Day 2021: Date, Ideas, Importance, Why to Celebrate in Telugu

అయితే కానీ చాక్లెట్ వెనుక 4 వేల ఏళ్ల నాటి చరిత్ర ఉందని మీకు తెలుసా.. అమెరికాలో దీనిని 'దేవతల ఆహారం' అని పిలుస్తారు. చాక్లెట్ డే సందర్భంగా చాక్లెట్ యొక్క చరిత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

Happy Propose Day 2021:ఇలాంటి మెసెజ్ లతో ప్రపోజ్ చేస్తే... కచ్చితంగా సక్సెస్ అవుతారు...!Happy Propose Day 2021:ఇలాంటి మెసెజ్ లతో ప్రపోజ్ చేస్తే... కచ్చితంగా సక్సెస్ అవుతారు...!

వాలెంటైన్ వీక్ లో 3వ రోజ్..

వాలెంటైన్ వీక్ లో 3వ రోజ్..

వాలెంటైన్ వీక్ లో తొలిరోజు రోజ్ డే.. రెండో రోజు ప్రపోజ్ డే.. మూడో రోజు ముచ్చటగా చాక్లెట్ డేను జరుపుకుంటారు. ఫిబ్రవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ డేను జరుపుకుంటారు. ఈ సమయంలో పూలు, ఇతర బహుమతులతో చాక్లెట్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.

చాక్లెట్ తో అనుబంధం..

చాక్లెట్ తో అనుబంధం..

సాధారణంగా ఎవరైనా తమ ప్రేమను, సంతోషాన్ని పంచుకునేందుకు చాక్లెట్లను పంచుకుంటారు. తాము ఇష్టపడే వారికి ప్రపోజ్ చేసి ప్రేమను వ్యక్తపరిచిన తర్వాత.. చాక్లెట్లతో ఆ అనుబంధంలో మరో అడుగు ముందుకేస్తారు. దీంట్లో భాగంగానే తాము ఎంతగానో ఇష్టపడే వారికి మరియు ప్రేమించే వారికి చాక్లెట్లను బహుమతిగా ఇస్తారు. ఇవి రొమాంటిక్ ఫీలింగుకు గుర్తుగా ఉంటాయి.

తొలిరోజుల్లో ఐరోపాలో..

తొలిరోజుల్లో ఐరోపాలో..

చాక్లెట్ కనిపెట్టిన తొలిరోజుల్లో వేడిగా ఉండేది. దీనిని కోకో విత్తనాలతో పులియబెట్టి, వేయించిన తర్వాత గ్రౌండ్ చేశారు. ఆ తర్వాత నీరు, వనిల్లా, తేనే, మిరపకాయ, మరియు సుగంధ ద్రవ్యాలు కలిపి నురుగు పానీయంగా మార్చారు. ఆ సమయంలో అది రాయల్ డ్రింక్. అయితే అది ఐరోపాకు చేరుకునే సమయంలో ఈ పదార్థానికి తియ్యదనం వచ్చేసింది. అలా ఐరోపాలో చాక్లెట్ తొలిసారిగా స్పెయిన్ చేరుకుంది. స్పానిష్ అన్వేషకుడు హెర్నాండో కోర్టెస్ అబ్జెక్ మాంటెజుమా ఆస్థానానికి వచ్చాడు. అక్కడే అతను మొదటి చాక్లెట్ ను పరిచయం చేశాడు.

Valentine's Day 2021:వాలెంటైన్స్ వీక్ లో ఈ హెల్దీ గిఫ్ట్ ఐడియాలను ట్రై చెయ్యండి...!Valentine's Day 2021:వాలెంటైన్స్ వీక్ లో ఈ హెల్దీ గిఫ్ట్ ఐడియాలను ట్రై చెయ్యండి...!

4 వేల నాటి చరిత్ర..

4 వేల నాటి చరిత్ర..

చాక్లెట్ కు సుమారు 4 వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. కొందరు చాక్లెట్ తయారు చేసే కోకో చెట్టు మొదట అమెరికా అడవులలో దొరికిందని కూడా చెప్పేవారు. అయితే ఇప్పుడు 70 శాతం కోకో చెట్లు ఆఫ్రికాలో ఉన్నాయి. అక్కడి నుండి అందరికీ సరఫరా అవుతున్నాయి. మెక్సికో మరియు మధ్య అమెరికా ప్రజలు చాక్లెట్ ప్రవేశపెట్టారని చెబుతుంటారు. 1528లో స్పెయిన్ మెక్సికోను స్వాధీనం చేసుకుంది. కానీ రాజు తిరిగి స్పెయిన్ వెళ్లినప్పుడు, అతను తనతో పాటు కోకో విత్తనాలు మరియు పదార్థాలను తీసుకున్నాడు. ఆ తర్వాత అతి తక్కువ సమయంలో ఇది ప్రజలలో ఆదరణ పొందింది. అప్పటికే ఇది ధనికులకు ఇష్టమైన పానీయంగా ఉండేది.

ఉత్తర అమెరికాలో..

ఉత్తర అమెరికాలో..

మరో కథనం మేరకు.. ఉత్తర అమెరికాలోని అజ్ టెక్ తెగకు చెందిన చాక్లెట్లను ఎంతగానో ఆరాధించేవారు. రోమ్ లో వీరమరణం పొందిన సెయింట్ వాలెంటైన్ గౌరవార్థం ఇచ్చిన విందులో చాక్లెట్లు ఇచ్చారని చెబుతుంటారు. అప్పటి నుండే వాలెంటైన్ వీక్ లో చాక్లెట్ డే ఆవిర్భవించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.

హెల్దీ చాక్లెట్లు..

హెల్దీ చాక్లెట్లు..

చాక్లెట్లతో హెల్దీ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన బాడీలోని బ్లడ్ ప్రెజర్ ను పెంచడంతో పాటు మనలోని హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. రెగ్యులర్ గా చాక్లెట్లు తినే వారి చర్మం ఆరోగ్యంగా ఉంటుందని అనేక అధ్యయనాల్లో కూడా తేలింది. బంధాలలో తీపి, ప్రేమ తీవ్రతకు చాక్లెట్లు నిదర్శనంగా నిలిచాయి. ఇవి ఒకరి మూడ్ ను పెంపొందించడానికి, ప్రేమ భావనలను ఎదుటివారికి తెలియజేయడానికి సహాయపడతాయి.

చాక్లెట్ వేడుకలు..

చాక్లెట్ వేడుకలు..

చాక్లెట్లు ప్రేమికులతో పాటు అందరికీ హ్యాపీనెస్ పంచుతాయి. చాక్లెట్ డేను కేవలం ప్రేమికులే చేసుకోవాలని రూలేమీ లేదు. ఈ దినోత్సవాన్ని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ప్రత్యేకంగా భావించే వారితో కూడా వేడుకలు చేసుకోవచ్చు. ప్రేమ, ఆప్యాయతలను గుర్తు చేసే చాక్లెట్ డే వేడుకలను ఇష్టమైన వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహించుకోవచ్చు.

English summary

Chocolate Day 2021: Date, Ideas, Importance, Why to Celebrate in Telugu

Here we are talking about the Choclate Day 2021:Date, Ideas, Importance, why to celebrate in Telugu. Read on
Story first published:Tuesday, February 9, 2021, 18:58 [IST]
Desktop Bottom Promotion