Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
తను తప్ప మరో లోకం లేదన్నట్లుగా ఉండేది.. అంతలోనే...!
కాలేజీ క్రష్ లవ్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలా మంది ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరితో ప్రేమలో పడుతూ ఉంటాం. అయితే ఆ ప్రేమ ఎప్పుడు.. ఎలా.. ఎక్కడ పుడుతుందో ఎవ్వరికీ తెలీదు. అయితే ఎవ్వరికైనా తొలి ప్రేమ అనేది చాలా ప్రత్యేకం.

ఆ సమయంలో ఈ లోకంలో మీరిద్దరూ తప్ప ఎవ్వరూ లేరని అనిపిస్తుంది. మీ ఇద్దరికే ఈ ప్రపంచం సొంతం అన్నంతలా భావిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఒకరికొకరు లోకంగా మారిపోతారు.

ఇలాంటి బంధం ఏర్పడినప్పుడే స్మార్ట్ ఫోన్లో అర్థరాత్రి నుండి తెల్లవారుజాము వరకు ఫోన్లో మాట్లాడుకోవడం లేదా చాటింగ్ చేయడం.. ఎవరికి తెలియకుండా కలుసుకోవడం వంటివి చేస్తుంటారు. మీ ఇద్దరి ప్రేమ బలంగా ఉంటే చాలు..

ఈ లోకాన్నే గెలిచేస్తాం అన్న భావన కలగడం సహజంగా జరుగుతుంటాయి. అయితే ఇలాంటి ప్రేమ బంధాలు ఎంత కాలం ఉంటాయన్నది చెప్పడం కాస్త కష్టమే. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. ఓ వ్యక్తి ప్రేమలో తనకు ఎదురైన అనుభవాల గురించి ఇలా చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

కాలేజీ తొలిరోజుల్లో..
‘నా పేరు రాజు(పేరు మార్చాం). నేను ఇంటర్మీడియట్ M.P.C గ్రూపులో తొలిసారి ఎంతో ఉత్సాహంగా అడుగుపెట్టిన రోజు. నేను బాగా చదువుకుని.. పెద్ద ఇంజనీర్ కావాలని కలలు కన్నాను. టెన్త్ లో కూడా టాపర్ గా రావడంతో అందరికీ నాపై అంచనాలు పెరిగిపోయాయి.

నాకు కావాల్సిన బుక్..
నేను రెగ్యులర్ గా కాలేజీకి వెళ్లి అన్ని క్లాసులను బుద్ధిగా వినేవాడిని. ఖాళీ పీరియడ్స్ లో కేవలం లైబ్రరీకి మాత్రమే వెళ్లేవాడిని. అయితే అక్కడే నాకు ఊహించని సంఘటన ఎదురైంది. నేను సెల్ఫ్ లో నాకు కావాల్సిన బుక్ కోసం వెతుకుతుంటే.. అదే పుస్తకాన్నే నా సీనియర్ తీసుకోవడానికి వచ్చింది.

అప్పుడే పరిచయమైంది..
అంతే మా ఇద్దరి చేతులు దానిపై పడ్డాయి. అటువైపు నుండి తను.. ఇటువైపు నుండి నేను ఆ పుస్తకంపై చేయి వేసి లాగుతుంటే.. మిగిలిన పుస్తకాలన్నీ ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో నా సీనియర్ అయిన తను నాపై చాలా కోప్పడింది. అయితే తను నన్ను తిడుతుంటే.. నాకు ఏ మాత్రం బాధ కలగలేదు.

కాసేపటి తర్వాత..
అయితే అక్కడున్న తన స్నేహితులు తప్పు తనదేనని చెప్పడంతో.. ఆమె కాసేపటి తర్వాత నా దగ్గరికొచ్చి సారీ చెప్పింది. అంతేకాదు నా పేరు.. నా క్లాస్ తో పాటు నా ఫోన్ నెంబర్ కూడా అడిగింది. తను ఆ సబ్జెక్టు(కెమిస్ట్రీ)లో వీక్ అంట. నాకేమో కెమిస్ట్రీ అంటే చాలా ఈజీ. వెంటనే తన ఫోన్ నుండి మిస్డ్ కాల్ ఇచ్చి ఇది నా నెంబర్ సేవ్ చేసుకోమని చెప్పింది.

ఆరోజు నుండి..
అంతే ఆరోజు నుండి నా లైఫ్ లో ఒక్క అమ్మాయి లేరనే బెంగ తీరిపోయింది. అప్పటి నుండి తనతో నిత్యం ఫోన్లో గంటల తరబడి మాట్లాడేవాడిని. సబ్జెక్టు గురించి తక్కువ.. మిగిలిన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుకునే వాళ్లం. మా ఇద్దరి మధ్య రిలేషన్ తక్కువ సమయంలోనే చాలా దూరం వెళ్లిపోయింది.

కాలేజీ ఎగ్గొట్టి..
అది ఎంతలా అంటే.. కాలేజీ ఎగ్గొట్టి మరీ సినిమాలకు వెళ్లేవాళ్లం. అయితే సినిమా ఖర్చులన్నీ తనే భరించేది. ఎందుకంటే నేను మిడిల్ క్లాస్ అని.. నా పరిస్థితుల గురించి నేను మొత్తం చెప్పేశాను. దీంతో తను నన్ను అర్థం చేసుకుని.. నాకేమీ కావాలన్నా తనే తెలుసుకుని మరీ అరెంజ్ చేసేది.

తను తప్ప..
అప్పుడు నాకు తను తప్ప వేరే ధ్యాస అనేది వచ్చేది కాదు. తనే ఈ లోకం అనిపించేది. అయితే అంతలో నాకు ఫస్టియర్ ఎగ్జామ్స్.. తనకు సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది. నా పరీక్షల ఫీజు కూడా తనే కట్టింది.

సెలవుల్లో ఇద్దరం కలిసి..
ఇక సెలవుల్లో మేమిద్దరం కలిసి కంబైన్డ్ స్టడీస్ మొదలెట్టాం. అదే సమయంలో తనకు బైక్ డ్రైవింగ్ కూడా నేర్పించాను. అలా తను సెలవుల్లో కూడా రెగ్యులర్ గా మా ఇంటి దగ్గరికొచ్చి కొన్ని సిగ్నల్స్ ఇచ్చేది లేదంటే ఫోన్ చేసేది.

ఎప్పుడు తెల్లారిందో..
అలా తను పక్కనుంటే ఎప్పుడు తెల్లారిందో కూడా తెలిసేది కాదు. తనకు బైక్ నేర్పించేటప్పుడు నా చేయి తన చేతులతో కలిపి ఎక్కడెక్కడో టచ్ చేస్తూ తనకు బైక్ నడపడం నేర్పించేవాడిని. అలా మేమిద్దరం ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేకపోయాం.

పరీక్షల సమయం..
అంతలోనే మా ఇద్దరికీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మా ఇద్దరి ఎగ్జామ్ సెంటర్లు కూడా ఒకే చోట పడ్డాయి. అప్పుడు కూడా మేమిద్దరం కలిసే వెళ్లేవాళ్లం.. అయితే అప్పటికీ మా ఇద్దరి గురించి కాలేజీ క్యాంపస్ లో అంతా రూమర్స్ వ్యాప్తి చెందాయి.

ఎగ్జామ్స్ తర్వాత..
అయితే ఏమయిందో తెలియదు కానీ.. అంతలోనే నాకు బ్యాడ్ టైమ్ స్టార్టయ్యిందనిపించింది. ఎందుకంటే ఎగ్జామ్స్ తర్వాత తను మళ్లీ కనిపించలేదు. తనకు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ వచ్చేది. తన ఇంటికెళితే తాళం వేసి ఉండేది. చుట్టుపక్కల వారిని ఆరా తీస్తే సెలవులకు వాళ్ల అమ్మమ్మ ఊరెళ్లారని చెప్పారు.

అలా వెళ్లిన తను ఇప్పటికీ..
ఏ విషయం అయినా నాతో షేర్ చేసుకునే తను సెలవులకు వెళ్తున్న విషయాన్ని చెప్పలేదు. అంతేకాదు అప్పటి నుండి తను నాకు అస్సలు కనిపించలేదు. అంతే అప్పటిదాకా తనే లోకం అని జీవించిన నాకు విషయం అర్థమైంది. తను నన్ను వాడుకుని వదిలేసిందని.. తన గురించి ఆలోచించి.. తన జ్ణాపకాలనే గుర్తు చేసుకుంటూ చాలా రోజులు బాధపడ్డాను. ఇక లాభం లేదనుకుని తనను మరచిపోవడం ప్రారంభించాను' అని ఓ టీనేజీ కుర్రాడు తన కాలేజీ క్రష్ లవ్ స్టోరీ గురించి వివరించాడు. మీరు కూడా తనలా మోసపోవద్దని.. ప్రేమ విషయంలో ఎవ్వరినీ గుడ్డిగా నమ్మొద్దని చెబుతున్నాడు.



Click it and Unblock the Notifications