Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Couples mistakes in bed:ఆ కార్యంలో అందరూ చేసే తప్పులేంటో తెలుసా...
కపుల్స్ పడకగదిలో బెడ్ పై చేసే అతి సాధారణ పొరపాట్లేంటో చూసెయ్యండి...
మనలో యవ్వనంలో ఉండే ప్రతి ఒక్కరికీ కోరికలు ఉంటాయి. అందరికీ ఏవేవో ఫాంటసీలు ఉంటాయి. అందులోనూ శృంగార భంగిమల గురించి.. ఆ కార్యంలో పాల్గొనడానికి ముందు తమ భాగస్వామి గురించి ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు.

అయితే ఆ కార్యం అనునిత్యం ఆసక్తికరంగా.. ఉత్సాహంగా.. ఉత్తేజంగా ఉండదు.. ఆలుమగల మధ్య కలయిక అనేది కొంతకాలం తర్వాత బోర్ కొడుతుంది. పడకగదిలో పార్ట్నర్ తో కలిసి సరదాగా గడిపేందుకు ఎంతగా ప్రయత్నించినా ఉత్సాహమే రాదు.

చాలా మంది కపుల్స్ ఏదో తూతూ మంత్రంగా ఆ కార్యాన్ని కానిచ్చేస్తూ ఉంటారు. ఇందుకు కారణమేంటో తెలుసా.. మీ పార్ట్నర్ తో కలిసి పడకగదిలో కొన్ని తప్పులు చేయడమే. ఇలాంటి తప్పుల వల్లే మీరు ఆ కార్యం పట్ల ఆసక్తిని కోల్పోతారని నిపుణులు చెబుతారు.

మీ భాగస్వామితో బెడ్ పై చేసే పొరపాట్ల వల్ల మీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తొచ్చు.. మీకు కొన్ని లైంగిక సమస్యలు కూడా పెరగొచ్చు.. ఇంతకీ పడకగదిలో అత్యంత సాధారణంగా చేసే తప్పులేంటి.. వాటిని ఎలా సరిదిద్దుకోవాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సినిమాల్లో చూపినట్టు..
మనలో చాలా మందికి సినిమాలు చూసే అలవాటు ఉంటుంది. మనం చూసే సినిమాల్లో శృంగార సన్నివేశాలకు అత్యంత ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాగే మీరు కూడా మీ రియల్ లైఫ్ లో రొమాన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు నిపుణులు. అయితే మనలో చాలా మంది బెడ్ రూమ్ లో భాగస్వామితో దూకుడుగా వ్యవహరిస్తుంటారు. తొందరపాటులో నిరుత్సాహపడతారు. అయితే భాగస్వామితో పడకగదిలో బెడ్ పై ఆ కార్యాన్ని తొందరపాటులో మొదలుపెట్టకూదట. ముందుగా ఫోర్ ప్లేతో ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు.

అనుభూతి కలిగేలా..
మనలో చాలా మంది ఆ కార్యం విషయంలో చాలా స్పీడ్ గా ఉంటారు. భావోద్వేగాలతో పని లేకుండా ఆ కార్యాన్ని పూర్తి చేసేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల మీ ఇద్దరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆ కార్యాన్ని ఎల్లప్పుడూ నెమ్మదిగా ప్రారంభించాలి. ముఖ్యంగా మీ పార్ట్నర్ ను బాడీలో మూడ్ పెరిగే ప్రాంతాలను నెమ్మదిగా తాకుతూ.. తనను మానసికంగా సిద్ధంగా చేయాలి. అప్పుడు తన బాడీ ఆ కార్యానికి పూర్తిగా సహకరిస్తుంది. వారి స్పందనను బట్టి.. మీరు మంచి అనుభూతిని పొందొచ్చు.

రొమాన్స్ టైమ్..
మనలో చాలా మంది ప్రతి పనికి ఓ టైం కేటాయించుకుంటూ ఉంటారు. అలాగే ఆ కార్యానికి ఓ సమయం సెట్ చేసుకుని.. కేవలం కొద్ది నిమిషాల్లోనే పడకగదిలో ఆ పని కానిచ్చేస్తారు. ఇలా కేవలం నిమిషాల వ్యవధిలో ఆ కార్యాన్ని ముగించడం ఏ మాత్రం మంచిది కాదు. కాబట్టి ఇలాంటి తప్పును ఎప్పటికీ చేయకండి. కనీసం రెండు మూడు గంటలైనా కేటాయించుకోండి.

రోటిన్ యాంగిల్స్..
ఆ కార్యం విషయంలో ప్రతి ఒక్కరికీ బోర్ కొట్టేందుకు ఇది కూడా ఒక కారణమే. అదేంటంటే.. రెగ్యులర్ గా రోటీన్ యాంగిల్స్ లో ప్రయత్నించడం. ఇలా చేయడం వల్ల మీకు రొమాన్స్ పై విసుగు పుడుతుంది. కాబట్టి మీరు కొంచెం కొత్తగా ట్రై చేయండి.. కొత్త యాంగిల్స్ లో ఆ కార్యాన్ని ప్రయత్నించడం వల్ల మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. చివరికి మీరు స్వర్గపు అంచులను తాకిన అనుభూతిని పొందుతారు.

పార్ట్నర్ కోరికలను..
మనలో చాలా మంది కపుల్స్ తమ పార్ట్నర్ ఆ కార్యం విషయంలో ఏం కోరుకుంటుందో పట్టించుకోరు.. తమకు నచ్చినవి మాత్రమే చేసుకుంటూ వెళ్తారు. వారు రొమాన్స్ చేసేందుకు రెడీగా ఉన్నారా లేదా అనేది అస్సలు చూసుకోరు. కాబట్టి మీరు ఇలాంటి తప్పులు చేయకండి. ముందుగా వారితో ముచ్చట్లు ప్రారంభించండి. వారు పడకగదిలో ఏం ఆశిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి.. లేదంటే మీ ఇద్దరి మధ్య ఆ కార్యం విషయంలో విభేదాలు తలెత్తొచ్చు.

పీరియడ్స్ టైములో..
కొందరు కపుల్స్ పీరియడ్స్ టైములో కూడా ఆ కార్యాన్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. అయితే ఆ సమయంలో భాగస్వామిని బలవంతం చేయడం వంటి తప్పులు చేయకండి. ఎందుకంటే ఆ సమయంలో వారికి విశ్రాంతి అవసరం. కాబట్టి వారిని ఇబ్బంది పెట్టకుండా ఆ కార్యంలో పాల్గొనేందుకు ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications











