For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Aids Day 2021:ఆ కార్యంలో పాల్గొంటే ఎయిడ్స్ వస్తుందా?

|

ఈ ప్రపంచంలో ఎన్ని రోగాలొచ్చినా.. ఎన్ని వైరస్ లు వచ్చినా ప్రతి ఒక్కదానికీ మందులు ఉన్నాయి. అంతేందుకు రెండేళ్లక్రితం వచ్చిన కరోనా మహమ్మారికి సైతం విరుగుడు కనిపెట్టాం.

అయితే ఇప్పటికీ మందు లేని మహమ్మారుల్లో హెచ్ఐవి, ఎయిడ్స్ ఒకటి. ఈ వ్యాధి సోకిన వారికి ప్రాణాపాయం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. 1981 సంవత్సరంలో జూన్ 5వ తేదీన తొలిసారి అమెరికాలో నలుగురు స్వలింగ సంపర్కుల్లో గుర్తించిన ఎయిడ్స్ వ్యాధి.. ఇప్పటివరకు కొన్ని కోట్ల మందికి సోకింది.

మన దేశంలోనూ తొలిసారిగా 1986లో ఎయిడ్స్ వ్యాధిని గుర్తించారు. అయితే దీనికి నేటికీ మందు కనిపెట్టలేదు. కేవలం ఒక్కటే మార్గం. ఇంతటి భయంకరమైన వ్యాధి గురించి మనలో చాలా మందికి అనేక అపొహలు, అనుమానాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎయిడ్స్ వ్యాధి గురించి కొన్ని వాస్తవాలను తెలుసుకుందాం.

World Aids Day 2021 : ఇవి తెలుసుకుంటే.. ఎయిడ్స్ నుండి సులభంగా తప్పించుకోవచ్చు...

రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది..

రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది..

ఈ భూ ప్రపంచం మీద మానవాళి ఇప్పటివరకు చూడని ప్రాణాంతక వ్యాధులలో ఎయిడ్స్ మహమ్మారి ఒకటి. దీనిని వైద్యపరంగా హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్ఐవి) లేదా అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటారు. ఇది అంటు వ్యాధి, ఇది మానవ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఇది ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాపిస్తుంది. ఈ హెచ్ఐవి దశల వారీగా రూపాంతరం చెందుతూ ఎయిడ్స్ వ్యాధిగా మారుతుంది. ఈ కారణంగా రోగికి ప్రాణాపాయం ఉండొచ్చు.

కలిసి భోజనం చేస్తే..

కలిసి భోజనం చేస్తే..

మనలో చాలా మందికి ఇప్పటికీ ఈ అపొహ ఉంది. హెచ్ఐవి సోకిన వారితో కలిసి భోజనం చేసినా.. వారి ప్లేటులో గానీ.. వారు కూర్చున్న స్థలంలో ఉన్నా ఆ వ్యాధి సోకుతుందనే అపొహ ఉంది. అయితే ఇది కేవలం అపొహ మాత్రమే. ఎందుకంటే హెచ్ఐవి అనేది ఒక వైరస్, ఇది శరీరం లోపల ఉన్నప్పుడే మాత్రమే చురుగ్గా ఉంటుంది. బయటి వాతావరణంలో తన మనుగడను సాగించలేదు. కాబట్టి మీరు హెచ్ఐవి పాజిటివ్ రోగిని దూరంగా ఉంచడం అంటే వారికి (అతనికి / ఆమెకు) అన్యాయం చేసినట్లే. ఒక హెచ్ఐవి రోగి అంటే మన అందరి మాదిరిగానే ఉన్న ఒక సాధారణ మానవుడు, కానీ వారి రోగనిరోధక వ్యవస్థ మనకన్నా ఎక్కువగా ప్రభావితమవుతుంది అందుకోసమే వారు అదనపు జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం చాలానే ఉంది.

ఇన్ఫెక్షన్ ఉంటుందా?

ఇన్ఫెక్షన్ ఉంటుందా?

తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు లేదా తల్లి పాలను బిడ్డకు ఇవ్వడం వల్ల నవజాత శిశువులకు కూడా ఈ హెచ్ఐవి వ్యాధి సోకుతుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఇది ప్రతిసారీ జరగదు. బిడ్డ ఒక సాధారణమైన తండ్రికి మరియు ఒక హెచ్ఐవిని కలిగి ఉన్న తల్లికి గాని జన్మించిన ఉంటే, వారు వ్యాధిని కలిగి ఉండరు. అయినప్పటికీ కూడా, అలాంటి పిల్లలు ఎక్కువ ముప్పును కలిగి ఉంటారు, అందువల్ల వారి జననాన్ని పూర్తిగా వాయిదా వేసుకోవాలి, మరియు వైరస్ను పిల్లల శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి తగిన వైద్య చికిత్సను సరైన రీతిలో తీసుకోవాలి.

మందులు వాడితే..

మందులు వాడితే..

ఒక వ్యక్తిలో హెచ్ఐవి గుర్తించిన తర్వాత, వైద్యునిచే సూచించబడిన ఔషధాలను కొనసాగించటం చాలా అవసరం. కానీ మనలో కొందరు నమ్ముతారు, ఇవి చాలా శక్తివంతమైన మందులుగా ఉంటాయని, అవి హెచ్ఐవిని నిర్మూలించవచ్చు (ఒక బలమైన ఔషధం వలె జ్వరమును త్వరగా నయం చేయవచ్చు) అని. కానీ హెచ్ఐవి అలాంటిది కాదు. కాబట్టి, మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటే, సరైన ఔషధాలను మరియు సరైన సమయానికి వాడుతూ, మధ్య మధ్యలో తనిఖీని చేయించుకోవటం కూడా చాలా అవసరం.

వెంటనే మరణిస్తారా?

వెంటనే మరణిస్తారా?

హెచ్ఐవి / ఎయిడ్స్ గురించి అత్యంత సాధారణ అపోహ ఏమిటంటే, హెచ్ఐవి రోగి యొక్క జీవితకాలం చాలా స్వల్పంగా ఉంటుంది. అయితే ఇది అవాస్తవం. శాస్త్రీయ మరియు సాంకేతిక అభివృద్ధితో అందుబాటులో ఉన్న సరైన మందుల సహాయంతో ఒక హెచ్ఐవి సోకిన వ్యక్తి దీర్ఘకాలం వరకూ జీవిస్తూ, ఆరోగ్యకరమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారని ఇప్పుడు ప్రజలందరికీ తెలుస్తోంది. ఏది ఏమయినప్పటికీ, ఆ రోగికి ఎప్పటికప్పుడు సరైన చికిత్సను అందించకపోతే, ఎయిడ్స్ మళ్లీ ఆఖరి దశకి వెళ్లిపోతుంది (మళ్లీ మళ్లీ చికిత్స చేయకపోతే), అది అలా మరణానికి దారి తీస్తుంది.

ఆ కార్యంలో పాల్గొంటే..

ఆ కార్యంలో పాల్గొంటే..

మనలో చాలా మందికి ఆ కార్యంలో పాల్గొంటే కూడా హెచ్ఐవి/ఎయిడ్స్ సోకుతుందనే ఒక అపొహ బలంగా ఉంది. అయితే ఇది పూర్తి అవాస్తవం. హెచ్‌ఐవీ అన్నది వ్యాధి ఉన్నవారితో సెక్స్ చేయడం, వారి రక్తాన్ని స్వీకరించడం ద్వారా తప్ప మరింకే మార్గంలోనూ వ్యాపించదు. హెచ్‌ఐవీ రోగులు ఉన్న ప్రాంతంలో మనం శ్వాసించడం వల్ల గాలి ద్వారా అది మనకు సంక్రమించదు. వారిని హత్తుకున్నా, కరచాలనం చేసినా అది మనకు రాదు. హెచ్‌ఐవీ రోగులు వాడిన టాయిలెట్ సీట్లపై మనం కూర్చున్నా, లేదా వారు ముట్టుకున్న డోర్ నాబ్, హ్యాండిల్స్‌ను ఆ తర్వాత మనం వాడినా ఎయిడ్స్ రాదు.

ఎయిడ్స్ వేగంగా వ్యాపిస్తుందా?

ఎయిడ్స్ వేగంగా వ్యాపిస్తుందా?

హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన వెంటనే అది ఎయిడ్స్ రూపాంతరం చెందుతుందని.. దీంతో జీవితకాలం త్వరగా తగ్గిపోతుందని చాలా మంది అపొహ పడుతుంటారు. అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు. వాస్తవానికి హెచ్ఐవి పాజిటివ్ వచ్చినా కూడా అది వెంటనే ఎయిడ్స్ దశకు చేరదు. ఇలాంటి సమయంలో మీరు వైద్యులు చెప్పిన మార్గదర్శకాలను, మందులను సరైన సమయంలో తీసుకుంటే ఎయిడ్స్ దశకు చేరకపోవచ్చు. మీరు సరైన చికిత్స తీసుకోకపోతే మాత్రం అది కొన్ని సంవత్సరాల తర్వాత ఎయిడ్స్ దశకు చేరుకుంటుంది.

ఓరల్ సెక్స్ చేస్తే..

ఓరల్ సెక్స్ చేస్తే..

ఓరల్ సెక్స్ ద్వారా హెచ్‌ఐవీ వ్యాపించడానికి అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. అయితే పూర్తిగా సురక్షితమని చెప్పడానికి లేదు. ఎందుకంటే వ్యాధి సోకిన వారిలోగాని లేదా వారి భాగస్వామిలో గానీ నోటిలో ఏవైనా గాయాలున్నా, ఎదుటివారి రహస్యాంగాల్లో ఏవైనా కనిపించనంత చిన్న గాయాలు, పుండ్లు ఉన్నా... వాటి ద్వారా హెచ్‌ఐవీ వ్యాపించడానికి అవకాశాలు ఉన్నాయి.

ప్రతి సంవత్సరం ఎయిడ్స్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?

ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1వ తేదీన ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున ఎయిడ్స్ వ్యాధిపై ప్రజలందరిలో అవగాహన కల్పిస్తారు. అలాగే ఈ ఎయిడ్స్ రోగులకు ధైర్యం, ప్రోత్సాహం చెప్పేందుకు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఎయిడ్స్ డే ఎప్పటి నుంచి ప్రారంభమైంది?

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) 1988లో తొలిసారిగా ఎయిడ్స్ డే నిర్వహించాలని నిర్ణయించింది. మానవ ఆరోగ్య సంబంధిత అంశాల కోసం ప్రత్యేకంగా ఒకరోజును కేటాయించడంతో ఈ ఎయిడ్స్ డే మొదలైంది. ఇక అసలు విషయానికొస్తే.. ప్రతి ఏటా

హెచ్ఐవి సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి?

సాధారణంగా హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV) లక్షణాలు అది సోకిన దశపై ఆధారపడి ఉంటాయి. ఎక్కువ సందర్భాలలో ఈ వ్యాధి సోకిన కొన్ని నెలల్లో చాలా అంటువ్యాధులుగా కనిపిస్తుంది. ఈ వ్యాధి సంక్రమించిన తర్వాత మొదటి కొన్ని వారాలలో, హెచ్ ఐవి పాజిటివ్ వ్యక్తి ఫ్లూ వంటి లక్షణాలను అనుభవిస్తారు.

English summary

Common Myths About HIV and AIDS Busted in Telugu

Here are the common myths about hiv and aids busted in Telugu. Have a look
Story first published: Monday, November 29, 2021, 11:57 [IST]