Latest Updates
-
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం!
కపుల్స్ ఆ కార్యాన్ని ఆస్వాదించలేకపోతున్నారా? అయితే ఇలా ట్రై చేయండి...
మీ రిలేషన్ షిప్ లో సాధారణంగా వచ్చే సమస్యలేంటి? వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలా మంది పెద్దలు కుదర్చిన పెళ్లిళ్లను లేదా ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అయితే పెద్దలు సెట్ చేసినా సంబంధమైనా.. ప్రేమ సంబంధమైనా.. వారి మధ్య శారీరక సాన్నిహిత్యం ఉంటేనే వారి బంధం మరింత బలపడుతుంది.

ఇలాంటివి లేకపోతే ఆ జంటల మధ్య ఎంత డబ్బు ఉన్నా.. ఎన్ని ఆస్తులున్నా.. ఎంత అందమున్నా.. వారి వివాహ జీవితం వినోదభరితంగా ఉండదు. మన జీవితంలో హ్యాపీగా బతికేందుకు డబ్బు ఒక్కటే మార్గం కాదని ఎందరో నిరూపించారు.

అందుకు ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. పెళ్లైన కొత్తలో చాలా మంది రొమాన్స్ చేయడానికి బాగా ఇష్టపడతారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ కార్యం దగ్గరికొచ్చేసరికి ఆందోళన పడుతూ ఉంటారు. తమ భాగస్వామిని తాము సంతోషపరుస్తామో లేదోనని.. తను కోఆపరేట్ చేస్తుందో లేదోనని అపొహలో ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది.. ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే ఏమి చేయాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ప్రేమ లేకుంటే..
ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా ఉండే బంధం బలపడాలంటే ప్రేమ అనేది కచ్చితంగా ఉండాలి. ఇద్దరూ ఒకరినొకరు బాగా ఇష్టపడాలి. అంతేగానీ ఇవేవీ లేకుండా కేవలం డబ్బు ఉందని.. ఆస్తి ఉందని.. తమకు అన్ని లభిస్తాయనుకుంటే తప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే ప్రేమకు ఉన్న శక్తి కారణంగా.. అది ఎంతటి కష్టాలనైనా భరించే సామర్థ్యాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. దంపతులు లేదా ప్రేమికుల మధ్య సఖ్యత లేకపోతే.. ఆ బంధం బలహీనపడుతుంది.

సంసార సమస్యలు..
ఈ నేపథ్యంలో ఓ వివాహిత తన వివాహం తర్వాత తన జీవితంలోని అనుభవాలను ఇలా చెప్పుకొచ్చారు. ‘నాకు పెళ్లి జరిగి పదేళ్లు పూర్తయ్యింది. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అయితే తనను పెళ్లి చేసుకున్నప్పటి నుండి మేమిద్దరం శారీరకంగా ఏ రోజు సంతోషంగా గడపలేదు. నా జీవితం ఇలాగే ముగిసిపోతుందా? అనే అనుమానం కలుగుతోంది' అని తన బాధనకు వెళ్లగక్కింది. ఇంతకీ తన సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా? నిపుణులు తనకు ఎలాంటి సమాధానం చెప్పారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కపుల్స్ మధ్య..
ప్రేమ జీవితం అయినా.. పెళ్లి జీవితం అయినా.. కపుల్స్ మధ్య గొడవలు అనేవి సాధారణంగా ఉంటాయి. కొన్నిసార్లు అలాంటి గొడవలే వల్లే మీ వివాహ జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లకు పరిష్కారంగా కూడా నిలుస్తాయి. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు.. అప్పుడు మీ మనసుకు నచ్చిన వ్యక్తి.. ఇప్పుడెందుకు నచ్చలేదనే విషయం గురించి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి.

మాటలు సరిగా లేకుంటే..
మీ ఇద్దరి మధ్య మాటలు సరిగ్గా లేకుంటే.. మీ బంధంలో ఆటోమేటిక్ గా దూరం పెరిగిపోతుంది. అదే సమయంలో పడకగదిలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక అసలు విషయానికొస్తే.. మీరు సెక్స్ లో సంత్రుప్తి చెందనప్పుడు.. ఇలాంటి వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నామా అనే సమస్య సహజంగానే వస్తుంది. ఇలాంటి సమయంలో మీ పార్ట్నర్ ఏ విషయం గురించి ఆలోచిస్తున్నాడనే విషయాలను తెలుసుకోవాలి.

ఇష్టం లేకపోవడం..
కొందరి వివాహ జీవితంలో భాగస్వాములిద్దరిలో ఎవరో ఒకరికి ఆ కార్యంపై ఆసక్తి లేకపోవడం వల్ల కూడా పడకగదిలో సమస్యలకు దారితీస్తాయి. ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకున్నప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఎందుకంటే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం లేకపోవడం వల్ల రొమాన్స్ పరంగా మరిన్ని సమస్యలు ఎదురవుతాయి.

ఒత్తిడి వల్ల..
మరికొందరికి ఆ కార్యం పాల్గొనడానికి ఒత్తిడిగా ఫీలవుతుంటారు. ఒత్తిడి ఎక్కువ అవ్వటం వల్ల ఆ కార్యంలో ఎక్కువ సమయం పాల్గొనలేకపోతారు. దంపతులలో ఇద్దరిలో ఎవరో ఒకరు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటుంటు.. మీరే మీ భాగస్వామికి ధైర్యం చెప్పాలి. వారికి ఆ కార్యానికి మానసికంగా సిద్ధం చేయాలి. అంతేగానీ మీరు బాధపడి.. వారిని మరింత బాధపెట్టకూడదు. ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు కచ్చితంగా పరిష్కారం లభిస్తుంది.

సన్నిహితుల సలహాలు..
మీ వివాహ జీవితంలో ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు.. మీకు బాగా నమ్మకంగా ఉండే సన్నిహితుల సలహాలు తీసుకోవాలి. వారి వద్ద నుండి కూడా సరైన పరిష్కారం రాకపోతే.. మీరు నిపుణుల సలహాలను తీసుకోవచ్చు. కళ్యాణం అయిన కపుల్స్ ఏ పని అయినా టీమ్ లా భావించి చేయాలి. అలా టీమ్ వర్క్ చేస్తే.. సంసార జీవితం సాఫీగా సాగిపోతుంది.

రొమాంటిక్ సమస్యలు..
మీ భాగస్వామిలో రతిక్రీడకు సంబంధించిన సమస్యలు ఉంటే.. మీరు వారికి భావోద్వేగ పరంగా ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మీరు సమస్యల నుండి త్వరగా బయటపడతారు. అంతేకాదు మీ సమస్యకు త్వరగా పరిష్కారం కూడా లభిస్తుంది. ఇలాంటి విషయాల్లో నిపుణుల సలహా తీసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాటు మీ భాగస్వామి ఏదైనా జాబ్ చేస్తుంటే.. వారికి జాబ్, బిజినెస్ లో తోడ్పాటునందించడం వల్ల మీ సంసారం సంతోషంగా సాగుతుంది.



Click it and Unblock the Notifications