For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లికి ముందు ‘ఆ’విషయాల గురించి అడగడం అస్సలు మరువకండి...!

|

మనలో ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి(Marriage)అనేది చాలా ముఖ్యమైనది. అందుకే ఒకప్పుడు వివాహం పేరేత్తగానే.. అటు ఏడు తరాలు.. ఇటు తరాలు చూడాలనేవారు.

ఇప్పట్లో అలాంటివేవీ లేనప్పటికీ, ప్రతి ఒక్కరూ తమను అర్థం చేసుకునే భాగస్వామి కావాలని.. అందంగా.. ఉండే పార్ట్ నర్ కావాలని కోరుకుంటారు. అయితే అందరికీ కొన్ని సందర్భాల్లో కోరుకున్న భాగస్వామి దొరకకపోవచ్చు. ఎందుకంటే వివాహ జీవితం అంటేనే.. ఎన్నో విషయాలు, త్యాగాలు, సర్దుబాట్లు, రాజీలు ఇంకా ఎన్నో ఉంటాయి. పెళ్లి ద్వారా ఇద్దరు వ్యక్తులే కాదు..

రెండు కుటుంబాలు కూడా కలిసిపోతాయి. అందుకే పెళ్లికి ముందు మీరు మీ భాగస్వామితో కొన్ని విషయాలను కచ్చితంగా మాట్లాడాలి. దీని వల్ల వారి ధోరణి, వారి మనస్తత్వం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఏ విషయాల గురించి మాట్లాడాలి.. ఎలాంటి వాటి గురించి అడిగితే బాగుంటుందో ఓసారి చూసెద్దామా...

Relationship Problems: పెళ్లైన వారు'ఆ కార్యం'లో ఆందోళనలను అధిగమించాలంటే...

ఆర్థిక అంశాలు..

ఆర్థిక అంశాలు..

ప్రస్తుతం మనందరి జీవితంలో డబ్బు అనేది ఒక భాగం అయిపోయింది. అది ఉంటేనే ఏ పని అయినా జరుగుతుంది. అందుకే మీరు పెళ్లికి ముందు ఆర్థిక అంశాల గురించి కచ్చితంగా చర్చించాలి. మీరు డబ్బును ఎలా చూస్తారు? మీరు ఎక్కువగా చేస్తుంటారా? లేదా ఆదా చేస్తుంటారా? మీరు పెళ్లి తర్వాత జాయింట్ అకౌంట్ ఏమైనా ఓపెన్ చేయాలనుకుంటున్నారా? అనే విషయాల గురించి అడగండి. వారు చెప్పే సమాధానాలను బట్టి ఆర్థిక సంబంధిత విషయాల్లో ఎంత పారదర్శకత ఉందో గమనించండి. మీ భాగస్వామి డబ్బు విషయంలో ఎలాంటి బాధ్యతలనైనా తీసుకోడానికి సిద్ధంగా ఉన్నారో లేదో ఇట్టే తెలిసిపోతుంది.

రొమాన్స్ విషయంలో..

రొమాన్స్ విషయంలో..

పెళ్లికి ముందు శృంగారం గురించి అడగడం అస్సలు మరచిపోకండి. ఇది మీ ఆరోగ్యకరమైన జీవితానికి చాలా ముఖ్యమైనది. పెళ్లికి ముందే మీ భాగస్వామితో శృంగార విషయాలను చర్చించండి. తను శృంగారం అంటే ఏమనుకుంటున్నారు.. తనకు ఆ కార్యంపై ఎంత అవగాహన ఉంది.. అనేది తెలుసుకుంటే.. మీరు మీ లైంగిక అవసరాల గురించి మాట్లాడేటప్పుడు మీ భాగస్వామికి ఎలా అనిపిస్తుందని అడగడం కూడా మంచిదే.

ఎలాంటి రిలేషన్..

ఎలాంటి రిలేషన్..

మీరు వివాహానికి ముందే మీ భాగస్వామికి ఎలాంటి బంధాలంటే ఇష్టం.. అందరితో కలిసిపోవడం ఇష్టమా.. లేదా ఎవ్వరినీ పట్టించుకోకుండా ఒంటరిగా ఉండటం వంటి అంశాల గురించి చర్చించండి. సాధారణంగా చాలా మంది మొదట్లో ఈ అంశాల పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఇద్దరూ కలిశాక అందరితో కలవాలంటే.. కొంత సమయం కావాలి. స్నేహితులతో రిలేషన్ గురించి అడగాలి.

పిల్లల గురించి..

పిల్లల గురించి..

ఈ ప్రశ్న కొందరికీ సిల్లీగా అనిపించవచ్చు. కానీ ఇది మీరు పెళ్లికి ముందు కచ్చితంగా అడగాల్సిన ప్రశ్నే. ఎందుకంటే మీరు తల్లిదండ్రులుగా మారాలని అనుకుంటున్నారనేది చాలా ముఖ్యం. ఎందుకంటే పిల్లలు పుట్టడం వల్లనే మీ జీవితం మొత్తం మారిపోతుంది. ఈ విషయంలో మీ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయో లేదో తెలుసుకోవడం కోసం.. మీరు వీటి గురించి చర్చించుకోవడం చాలా ముఖ్యం.

‘అప్పుడు నాతో.. ఇప్పుడు తనతో.. ఎంజాయ్ చేస్తున్నాడు... కానీ '..

మతం, సంప్రదాయాలు..

మతం, సంప్రదాయాలు..

కొందరు పెళ్లి విషయంలో మతం, కులం, సంప్రదాయాలు, కట్టుబాట్లను ఎక్కువగా నమ్ముతారు. ఇవే వివాహాల విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విషయాల గురించి పెళ్లికి ముందే మీ భాగస్వామితో చర్చించడం మంచిది. ఎందుకంటే వారికి ఇలాంటి వాటిపై ఉండే విశ్వాసం గురించి తెలుసుకోవడం అనేది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మీరు తెలుసుకోవచ్చు.

కలిసి ఉంటారా? లేక వేరు కాపురమా?

కలిసి ఉంటారా? లేక వేరు కాపురమా?

పెళ్లికి ముందు ఈ ప్రశ్న అడగడం చాలా ముఖ్యం. దీని ఉద్దేశ్యం తను తల్లిదండ్రులను ఎంతలా గౌరవిస్తున్నారో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఎందుకంటే మీ తల్లిదండ్రులైనా.. మీ భాగస్వామి తల్లిదండ్రులైనా మీ ఇద్దరి జీవితంలో కీలక పాత్ర పోషిస్తారు. మీకు చాలా సందర్భాల్లో అండగా ఉంటారు. మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్య వచ్చినా వాటిని పరిష్కరించేది వారే. వారు ఉమ్మడి కుటుంబంలో ఉండేందుకు ఒప్పుకుంటే మీరు చాలా లక్కీ.

ఉదయాన్నే నిద్ర లేస్తారా? లేపాలా?

ఉదయాన్నే నిద్ర లేస్తారా? లేపాలా?

పెళ్లికి ముందు మీకు కాబోయే భాగస్వామికి ఉదయాన్నే నిద్ర లేవడం వంటి అలవాటు ఉంటే.. ఒకవేళ మీకు అలాంటి అలవాటు లేకపోతే పెళ్లి తర్వాత మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. కాబట్టి మీకు కాబోయే భాగస్వామి ఉదయాన్నే నిద్ర లేస్తారా? లేక మీరు నిద్ర లేచినప్పుడే నిద్ర లేపాలా అనే విషయాల గురించి అడగండి. అందుకు అనుగుణంగా మీరు మీ సమయాన్ని మార్చుకోవచ్చా లేదా తెలుసుకోండి. లేదంటే మీరు మీ భాగస్వామితో కలిసి ఉదయాన్నే వేడి వేడిగా ఓ కప్పు టీ లేదా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పే ఛాన్స్ మిస్సవుతారు.

సర్దుకుపోతారా?

సర్దుకుపోతారా?

ఈ ప్రశ్న మీరు ఎందుకు అడగాలంటే.. తనలో మీకు నచ్చని విషయాలు ఏవైనా ఉండొచ్చు.. మీకు కూడా వారిలో కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు. కాబట్టి మీరు ఒకరిని భాగస్వామిగా అంగీకరిస్తున్నారంటే.. వారి ప్లస్ పాయింట్స్ తో మైనస్ పాయింట్స్ కూడా ఒప్పుకోవాల్సిందే. అందుకు తగ్గట్టు ఇద్దరూ సర్దుకుపోవాల్సిందే. అందుకే మీ భాగస్వామికి రాజీ పడే సమయం వస్తే ఓ మెట్టు తగ్గుతారా లేదా అనేది పెళ్లికి ముందే తెలుసుకోండి.

English summary

Conversation You Must Have Before Marriage in Telugu

Here we are talking about the conversation You Must Have Before Marriage in Telugu. Have a look.
Story first published: Saturday, May 8, 2021, 16:46 [IST]