Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
పడకగదిలో మీ మూడ్ పెంచడంలో చాక్లెట్ ఎంతలా హెల్ప్ చేస్తుందో తెలుసా...
పడకగదిలో చాక్లెట్ వాడకాన్ని కొత్తగా ప్రయత్నిస్తే.. మీకు ఎంత మజా వస్తుందో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.
మనలో పెళ్లి చేసుకున్న జంటలు లేదా ఇతర రిలేషన్ షిప్ లో ఉన్న కపుల్స్ పడకగదిలో శారీరకంగా కలుసుకుంటున్నప్పటికీ.. అందరూ ఆ కార్యాన్ని ఆస్వాదించడం లేదు. కేవలం కొందరు మాత్రమే ఆ కార్యంలో మంచి అనుభూతిని పొందుతున్నారు.

సాధారణంగా పడకగదిలో సెక్స్ లో పాల్గొనే వారు హల్వా, మల్లెపూలు, పాలు, కొన్ని రకాల పండ్లను తీసుకోవడం వంటివి చేస్తుంటారు. వీటి వల్ల తమ మూడ్ పెరుగుతుందని ఆశిస్తారు. ఇవి భాగస్వామి మూడ్ ని కూడా బాగా పెంచుతాయని పెద్దలు చెబుతారు. చిత్రమేమిటంటే.. పడకగదిలో రొమాన్స్ చేసే సమయంలో చాక్లెట్ కూడా చక్కగా ఉపయోగపడుతుందట.

ఈ విషయాన్ని స్వయంగా నిపుణులు అధ్యయనం చేసి మరీ వివరించారు. అదేంటి.. చాక్లెట్ అంటే చిన్నపిల్లలు తినే తియ్యని పదార్థం కదా అని ఆలోచిస్తున్నారా? అయితే దీన్ని రొమాన్స్ చేసే సమయంలో వాడితే మీరు ఆ కార్యంలో స్వర్గపు అంచులదాకా వెళ్లిన అనుభూతిని పొందుతారట. కావాలంటే మీరు కూడా ఓసారి ట్రై చేయమని నిపుణులు సూచిస్తున్నారు. అయితే మీరు పడకగదిలో రెచ్చిపోవడానికి.. మీ భాగస్వామిలో కోరికలు పెరిగేలా చేయడానికి కొన్ని రకాల చాక్లెట్లను కచ్చితంగా తినాలట. అంతేకాదు వాటిని ఆ కార్యంలో పాల్గొనే సమయంలో కొంచెం వినూత్నంగా వాడాలంట. అలాంటి ఆసక్తిరమైన విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

చాక్లెట్ ఘాటు..
మనం కొన్ని రకాల యాడ్స్ లో చూస్తుంటాం.. ఏదైనా మంచి పని చేసే ముందు చాక్లెట్ తో నోటిని తియ్యగా చేసుకోవాలి అనే డైలాగులు వింటూ ఉంటాం. అయితే ఈ చాక్లెట్ తో మీరు పడకగదిలో కూడా రెచ్చిపోవచ్చట. అంతేకాదు దీని నుండి వచ్చే ఘాటు వల్ల మీలో మరియు మీ భాగస్వామిలో మూడ్ కచ్చితంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

కొంచెం మెస్సీగా..
అయితే మీరు తీసుకునే ఈ చాక్లెట్ వాడకం కొంచెం మెస్సీగా ఉంటుందట. ఇలాంటి వాటిని ఎప్పుడైనా ఒకసారి ప్రయత్నించడంలో ఎలాంటి తప్పు లేదంటున్నారు. అదెలాగో మీరే చూడండి.

పడకగదిలో హంట్ గేమ్..
మనలో ట్రెజర్ హంట్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అదేనండి ఏదైనా వస్తువును రహస్య ప్రదేశంలో ఉంచి, దానికి సంబంధించిన హింట్ ఇస్తారు. అప్పుడే మనం దాన్ని కనిపెట్టాల్సి ఉంటుంది. అలాగే మీరు మీ పడకగదిలో చాక్లెట్ హంట్ గేమ్ ప్లే చేయాలి. మీ భాగస్వామికి ఏ రకమైన చాక్లెట్ ఇష్టమో దాన్ని దాచిపెట్టాలి. మీరు చేసే రొమాన్స్ తో తను ఆ ప్రదేశాన్ని కనిపెట్టాలి.

కొంచెం భిన్నంగా..
మీ భాగస్వామి మీరు రహస్య ప్రాంతాల్లో దాచి ఉంచిన చాక్లెట్లను అన్నింటినీ మీ బెడ్ పై ఉంచి.. వాటి మీదే మీరు ఆ కార్యాన్ని కొనసాగించాలి. ఇలా చేస్తే రోటీన్ కి చాలా భిన్నంగా ఉంటుంది. ఇలాంటి కలయికను ప్రతి ఒక్క జంట బాగా ఆస్వాదిస్తారు.

చాక్లెట్ బాత్..
మీ అందరికీ మిల్క్ బాత్ గురించి బాగానే ఐడియా ఉంటుంది. అలాగే చాక్లెట్ బాత్ అనేది ఒకటుందని మీకు తెలుసా.. ఈ చాక్లెట్ బాత్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని మరింత కాంతివంతంగా మార్చడంతో పాటు మీలో మూడ్ ను సైతం అమాంతం పెంచేస్తుందట. కాబట్టి దీన్ని కూడా మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి.

చాక్లెట్ స్పా..
మనలో చాలా మందికి మసాజ్ చేయించుకునే అలవాటు ఉంటుంది. మసాజ్ చేసుకున్న వారి బాడీ చాలా ఫ్రీగా ఉంటుంది. అందుకే చాలా మంది బ్యూటీ పార్లర్లకు, మసాజ్ సెంటర్లకు వెళ్లి మసాజ్ చేయించుకుంటారు. అయితే రొమాన్స్ విషయానికి వస్తే.. హోమ్ మేడ్ చాక్లెట్ స్పా ప్రయత్నించమని నిపుణులు సూచిస్తున్నారు. ఇది చాలా ఫన్నీగా ఉండటంతో పాటు.. మీ ఇద్దరిలో మూడ్ కూడా పెంచుతుందట.

చాక్లెట్ డిన్నర్..
మీకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం ఉంటే.. మీరు ఓ రోజు డిన్నర్ డేట్ ప్లాన్ చేసుకోవాలి. మరీ చాక్లెట్ ఎక్కువైతే తినలేం కాబట్టి.. మీరు చాక్లెట్ ఫ్లేవర్ లేదా చాక్లెట్ కలర్ ఉండే ఫుడ్ ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవాలి. అలా మీరు మీ భాగస్వామితో డిన్నర్ డేట్ ని ఎంజాయ్ చేయొచ్చు.

సుకుమారంగా తాకుతూ..
మీకు డిన్నర్ డేట్ వంటివి చేయడం కుదరకపోతే.. మీరిద్దరూ సరదాగా ఒకరికి మరొకరు చాక్లెట్ తో బాడీ పెయింటింగ్ వేయాలి. ఒకరినొకరు సుకుమారంగా తాకుతూ చాక్లెట్ తో బాడీ పెయింటింగ్ వేసుకోవడం సరదాగానూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీకు కొత్త అనుభూతి కూడా కలుగుతుంది.



Click it and Unblock the Notifications