For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

relationship problems:పార్ట్ నర్ ప్రతిసారీ అదే పని చేస్తే నమ్మేదేలా...

మీ భర్త ప్రతిసారీ అలాంటి పనులు చేస్తే ఏం చేస్తారు.

|

మనలో ప్రతి ఒక్కరికీ ప్రేమ బంధమైనా.. ఏడడుగులు వేసే వివాహ బంధమైనా చాలా ప్రత్యేకం. ఆ సమయంలో ఈ ప్రపంచంలో మీరిద్దరూ తప్ప ఇంకెవ్వరూ లేరనే అనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మీరిద్దరూ ఒకరికొకరు కొత్త లోకంగా మారిపోతారు.

Did You Catch Your Partner Lying? Ways to Deal With It Positively

మీరిద్దరూ ఎవరి కంటా పడకుండా సీక్రెట్ గా కలుసుకోవడం.. పక్కన పార్ట్ నర్ ఉంటే చాలు.. ఈ ప్రపంచాన్నే జయించొచ్చు అన్న భావన కలుగుతుంటుంది. అయితే కొన్ని జంటలను పరిశీలిస్తే ప్రతి విషయంలోనూ ఇద్దరి ఆలోచనలు, కార్యాచరణలు పూర్తి భిన్నంగా ఉంటాయి. కానీ అలాంటి వ్యక్తులు కూడా రిలేషన్ షిప్ లో కలిసే ఉంటే మనకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.

Did You Catch Your Partner Lying? Ways to Deal With It Positively

ఎందుకంటే చుట్టూ ఉన్నవారంతా భిన్నాభిప్రాయాలు కలిగిన వ్యక్తులు అధిక కాలం కలిసి జీవించలేరని భావిస్తుంట.. మీరిద్దరూ మాత్రం ఎవరి ప్రాధాన్యాలు వారు చూసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. పార్ట్ నర్ విషయంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు లేదా తన గురించి భయం కలిగినప్పుడు సహజంగా అబద్ధాలు చెబుతూ ఉంటారు.

Did You Catch Your Partner Lying? Ways to Deal With It Positively

మనలో చాలా మంది ఏ రిలేషన్ షిప్ లో అయినా అప్పటి సమస్య నుండి బయటపడేందుకు అబద్ధాన్ని సర్వసాధారణంగా చెబుతూ ఉంటాం. సడన్ గా సమస్య పెద్దదిగా కాకుండా అసత్యాలు చెబుతూ ఉంటాం. మరికొంతమంది ఇతరులను, ముఖ్యంగా పార్ట్ నర్ ను ఇబ్బంది పెట్టకూడదని అబద్ధాలు చెబుతూ ఉంటారు. అయితే ప్రతిసారీ అలానే చేస్తే, అది పెద్ద తప్పే అవుతుంది. అలాంటి సమస్యే ఓ వివాహితకు ఎదురైందట. దీంతో తనను నమ్మలా వద్దా అనే అనుమానం వస్తోందట. తానేం చేయాలని నిపుణులను సలహా అడిగింది. అందుకు ఆమెకు ఎలాంటి పరిష్కారం లభించిందో ఇప్పుడు తెలుసుకుందాం...

పెళ్లయినా పక్కచూపులు ఎందుకు చూస్తారో తెలుసా...పెళ్లయినా పక్కచూపులు ఎందుకు చూస్తారో తెలుసా...

ఎప్పుడూ అబద్ధాలే..

ఎప్పుడూ అబద్ధాలే..

హాయ్ ‘నా పేరు ఉమామహేశ్వరి(పేరు మార్చాం). నాకు పెళ్లై రెండేళ్లు పూర్తవుతోంది. నాకు వివాహం జరిగిన నాటి నుండి నేటి వరకూ తను ప్రతి చిన్న విషయానికి.. పెద్ద విషయానికి ఏదో ఒక అబద్ధం చెబుతూనే ఉంటారు. ఆఫీసు వర్క్ నుండి పర్సనల్ విషయాల దాకా ఇప్పటికీ నాతో అన్నీ అబద్ధాలు చెబుతున్నారు. అందుకే తను చెప్పే విషయాలు ఏవి నమ్మాలో, ఏవి నమ్మకూడదో తెలియట్లేదు.

ఎలా చెప్పాలి..

ఎలా చెప్పాలి..

తనకు నాతో ఏదైనా సమస్యగా ఉందా? తనను నిజాయితీగా ఉండమని ఎలా చెప్పాలి. నేను ఎన్నిసార్లు ఈ విషయం గురించి మాట్లాడినా పెద్దగా మార్పు లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు' అని ఓ వివాహిత తన సమస్యను నిపుణులతో చెప్పుకుంది. అందుకు వారు ఏమి సలహా ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంతో ఓపికగా..

ఎంతో ఓపికగా..

మీరు మీ వైవాహిక జీవితంలో ఇంతవరకు ఎంతో ఓపికగా ఉన్నారు. అన్ని క్లిష్ట పరిస్థితులను ఎంతో సహనంతో ఎదుర్కొంటున్నారని అర్థమవుతోంది. అయితే మీ పార్ట్ నర్ అబద్ధం చెప్పడం చాలా కారణాలే ఉంటాయి. అందుకు గల కారణాలేంటో ముందు తెలుసుకుందాం. అప్పుడు మీకు కొంచెం స్పష్టత రావచ్చు.

నవ వధువు శోభనం గదిలోకి పాలనే ఎందుకు తీసుకెళ్తుందో తెలుసా...నవ వధువు శోభనం గదిలోకి పాలనే ఎందుకు తీసుకెళ్తుందో తెలుసా...

పొరపాటు జరిగినప్పుడు..

పొరపాటు జరిగినప్పుడు..

కొందరు వ్యక్తులు తెలిసి, తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దాని వల్ల పెద్దగా ఇబ్బందులేమైనా ఎదురవుతాయనే అనుమానంతో అబద్ధం చెబుతూ ఉంటారు. ముఖ్యంగా అప్పటికప్పుడు సమస్య నుండి తప్పించుకోవడానికి అబద్ధాలు చెబుతూ ఉంటారు.

ఇతరులను నొప్పించకుండా..

ఇతరులను నొప్పించకుండా..

ఇక మీ వివాహ బంధం విషయానికొస్తే.. మిమ్మల్ని నొప్పించకుండా ఉండేందుకు, మిమ్మల్ని సంతోషపెట్టేందుకు కూడా కొన్నిసార్లు అబద్ధాలు చెబుతూ ఉంటారు. అయితే ఇలా అబద్ధాలు చెప్పడం వల్ల ఇద్దరి మధ్య గొడవలు రాకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. అందుకే కొందరు వ్యక్తులు ఎక్కువగా నిజాలను చెప్పరు.

నిజాయితీగా మాట్లాడండి..

నిజాయితీగా మాట్లాడండి..

అయితే తను చెప్పే అబద్ధాల వల్ల మీ ఇద్దరి మధ్య ఏమైనా పొరపచ్చాలు వస్తున్నాయా? లేదా అనే విషయాన్ని గమనించాలి. దీన్ని ఎవ్వరూ గమనించరు. ఇలాంటి పరిస్థితులను తెలుసుకునేందుకు మీరు మీ పార్ట్ నర్ దగ్గరకు వెళ్లి నిజాయితీగా ప్రశాంతంగా తనతో మాట్లాడండి. దీంతో తను చేసే తప్పు అతనికి అర్థమవుతుంది.

పెళ్లైనా ఆ కోరిక తీరలేదా.. ఇవి ట్రై చేయండి.. మీరు కీలుగుర్రంలా రెచ్చిపోవచ్చు...!పెళ్లైనా ఆ కోరిక తీరలేదా.. ఇవి ట్రై చేయండి.. మీరు కీలుగుర్రంలా రెచ్చిపోవచ్చు...!

స్పష్టంగా చెప్పండి..

స్పష్టంగా చెప్పండి..

తను చెప్పే అబద్ధాల వల్ల మీ వైవాహిక బంధంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో.. చాలా స్పష్టంగా చెప్పండి. దీని వల్ల మీ సమస్యకు పరిష్కారం దొరకొచ్చు. ఈ విషయం గురించి మాట్లాడేటప్పుడు మీరు ఎలాంటి కోపం చూపకండి.

కూల్ గా చెప్పండి..

కూల్ గా చెప్పండి..

మీరు ప్రతి విషయాన్ని ప్రశాంతంగా, నెమ్మదిగా, కూల్ గా చెప్పడం వల్ల తను పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే కొందరు తమకు తెలియకుండానే భాగస్వామి ఆనందం కోసం అబద్ధాలు చెబుతూ ఉంటారు. అలాంటి వారితో కూడా నెమ్మదిగా మీరు మాట్లాడి, మీ సమస్యను సాల్వ్ చేసుకోండి.

English summary

Did You Catch Your Partner Lying? Ways to Deal With It Positively

Here we are talking about the did you catch your partner lying? ways to deal with it positively. Have a look
Story first published:Thursday, July 1, 2021, 12:56 [IST]
Desktop Bottom Promotion