Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెళ్లయిన ఏడాదికే గర్భం దాల్చింది.. ఆనందించేలోపే గుండె పగిలే నిజం తెలిసింది...
ఓ వ్యక్తి పెళ్లి అయిన కొన్ని రోజుల తర్వాత తన భార్యే తన సోదరి అని తెలిసింది. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్ననాటి నుండి వారిద్దరూ స్నేహితులుగా ఉండేవారు. వారు పెద్దయ్యాక వారి స్నేహం ప్రేమగా మారింది. అప్పటి నుండి వారు ఎంచక్కా పార్కులకు, పబ్బులకు, సినిమాలకు, షికార్లకు వెళ్లి ఎంజాయ్ చేశారు.

అలా వారిద్దరూ కలిసి దాదాపు ఎనిమిది సంవత్సరాల పాటు సహజీవనం చేసి గత ఏడాదే పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే ఆమె గర్భం దాల్చినట్లు ఓ శుభవార్త కూడా విన్నారు.

అలా హాయిగా కాపురం చేస్తున్న ఆ జంటకు ఊహించని షాక్ ఎదురైంది. ఎనిమిదేళ్లు కలిసి జీవించిన తర్వాత వారిద్దరూ ఒకే తండ్రి పిల్లలని తెలిసింది. దీంతో వారు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

అయితే ఈ అరుదైన సంఘటన ఎక్కడ జరిగింది? అసలు ఈ గుండె పగిలే వార్త వారికి ఎలా తెలిసింది? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఇంగ్లాండులో..
యునైటెడ్ కింగ్ డమ్ లోని ఓ జంట ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుని.. గత సంవత్సరమే పెళ్లి చేసుకున్నారు. వారు హనీమూన్ ముగించుకున్న సంవత్సర కాలంలోనే ఆమె గర్భం దాల్చింది. శుభవార్త అని సంతోషించేలోపే, అతను సోషల్ మీడియా సైట్ లో తనకు ఎదురైన వింత అనుభవాన్ని పంచుకున్నాడు.

నా భార్య నా కంటే పెద్దది..
అతను చెప్పిన వివరాలను వింటే అందరూ షాకవుతారు. ‘‘నా భార్య నా కంటే ఒక ఏడాది పెద్దది. మేమిద్దరం కలిసి ఎనిమిది సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నాం.

కొత్త జీవితం ప్రారంభం..
గత సంవత్సరమే పెళ్లి చేసుకుని కొత్త దంపతుల మాదిరిగా, కొత్త జీవితాన్ని ప్రారంభించాం. ప్రస్తుతం తను గర్భవతి. 2020లో మరో కొత్త వ్యక్తి మా మధ్య అడుగు పెడతాడని సంతోషంగా ఉన్నాం.

ఓ చేదు నిజం..
అంతా హాయిగా సాగిపోతున్న సమయంలో ఓ గుండె పగిలే నిజం బయటపడింది. నా భార్య తల్లితో ఇటీవల మాటల సందర్భంగా నా భార్య తండ్రి గురించి ప్రస్తావనకు వచ్చింది.

తన తండ్రి..
ఈ సందర్భంగా ఆమె చెప్పిన వివరాలు విని నేను ఆశ్చర్యపోయాను. నా భార్య తండ్రి ఎవరో కాదు నా తండ్రి అని తెలిసింది.

డిఎన్ఏ పరీక్షల తర్వాత..
అయితే అది నిజమో కాదో తెలుసుకోవాలని ఆసక్తితో డిఎన్ఏ పరీక్షలను చేయించుకున్నాం. అందులో వచ్చిన రిపోర్టులను చూస్తే, మేమిద్దరం ఒకే తండ్రికి పుట్టిన పిల్లలమని తేలింది.

చాలా బాధగా..
ఈ విషయం తెలిసిన తర్వాత మేమిద్దరం చాలా బాధపడ్డాం. నాకు చాలా భయం కూడా వేసింది. నాకు బిడ్డ పుట్టిన తర్వాత డిఎన్ఏ వివరాలను పొందుపరుస్తారు. ఆ సమయంలో ఆమె డిన్ఏ, నాది ఒకటని తెలిస్తే, చట్టపరమైన సమస్యలు తీసుకుంటారేమో అనిపించింది.

అలా అయితే ఏ సమస్యా లేదు..
నా కొడుకు ఆరోగ్యంగా పుడితే ఎలాంటి సమస్యా లేదు. అలా జరగకపోతే మా డిఎన్ఏ వివరాలు బహిర్గతం చేస్తారు. ఇంగ్లాండు చట్టం ప్రకారం అది నేరం'' అని తను వివరించాడు.

విడిపోవాలని అనుకోవట్లేదు..
‘ఈ విషయం తెలిసిన తర్వాత మేమిద్దరం విడిపోవాలని అనుకోవడం లేదు. ఎందుకంటే మేమిద్దరం చిన్ననాటి నుండే స్నేహితులుగా ఉన్నాం. మేం రక్తసంబంధం కలవారు అని తెలిసిన తర్వాత కూడా మాలో ఆ ఫీలింగ్ ఏ మాత్రం కలగలేదు.

బిడ్డ కోసమైనా..
ఇప్పుడు మాకు ఓ బిడ్డ కూడా పుట్టబోతున్నాడు. కనీసం ఆ బిడ్డ కోసమైనా మేం కలిసి ఉండాలి. తెలియకుండా జరిగిన ఈ తప్పిదానికి మేం బాధ్యులు కాదనే భావిస్తున్నాం. ఈ విషయాన్ని నేను రహస్యంగా ఉంచగలనా? ఎందుకంటే ఇది ఇంగ్లాండ్' అని తెలిపాడు.

అలాంటి సంబంధాలపై నిషేధం..
ఇంగ్లాండులో రక్త సంబంధీకుల మధ్య వైవాహిక, లైంగిక సంబంధాలపై నిషేధం ఉంది. ఒకే వ్యక్తికి పుట్టిన బిడ్డలు ఒకరినొకరు పెళ్లి చేసుకోవడం.. పిల్లలు జన్యుపరమైన లోపాలను ఎదుర్కొంటారనే కారణంతో ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తారు.

తీవ్ర ఆందోళన..
సోషల్ మీడియాలో ఈ పోస్టును చదివవి కొందరు నెటిజన్లు అతనికి వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే చట్టపరమైన సమస్యలు రాకుండా, న్యాయవాదులను సంప్రదించాలని చెబుతున్నారు. అయితే కొందరు మాత్రం అలా ఎలా కొనసాగిస్తారు.. మీరు నేరం చేసినట్లే అని కామెంట్ చేస్తుండటంతో తనను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. పాపం ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు.



Click it and Unblock the Notifications