For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ఆ కార్యం’ గురించి మగాళ్లకు వచ్చే కామన్ డౌట్స్ ఇవే...! ముఖ్యంగా దాని సైజు గురించే...!

|

మాములుగా మన దేశంలో పెళ్లికి ముందు రొమాన్స్ లో పాల్గొనడమే కాదు.. దాని గురించి మాట్లాడటాన్ని కూడా చాలా తప్పుగా భావిస్తుంటారు. అందుకే చాలా మంది పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత రొమాన్స్ గురించి సరైన అవగాహన లేక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అందుకే వారికి ఆ కార్యంలో పాల్గొనే సమయానికి ఏవేవో సందేహాలు, అనుమానాలు, భయాలు ముఖ్యంగా అమ్మాయిల కన్నా అబ్బాయిల్లో ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు.

ఈ క్రమంలో చాలా మంది తమకు వచ్చే డౌట్స్ గురించి బయట చెప్పడానికి భయపడుతుంటారు. అయితే ఎక్కువ మందికి ఇలాంటి అనుమానాలు, అపొహలు వస్తుంటాయని ఓ సర్వేలో తేలింది.

అయితే వీటి గురించి ఫ్రెండ్స్ తోనో లేదా ఇంకా ఎవరితో అయినా మాట్లాడాలంటే.. ఈ మాత్రం తెలియదా అని అంటారేమో అనే భయంతో.. చాలా మంది అడగలేకపోతున్నారట. ఈ సందర్భంగా ఆ డౌట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పడకగదిలో ఈ పనులు చేస్తే... రొమాన్స్ లో రెండింతల సంతృప్తి మీ సొంతం...!

రొమాన్స్ అంటే..

రొమాన్స్ అంటే..

మనలో చాలా మందికి రొమాన్స్ అనగానే గుర్తుకొచ్చేది సినిమాల్లో చూపించే రొమాంటిక్ సీన్లు. తమ కలయిక సమయంలో సినిమా సీన్లు ఫాలో అవ్వడం ద్వారా అందమైన అనుభూతి సొంతం చేసుకోవాలనుకునేవారు చాలా మందే ఉంటారు. కానీ దీని వల్ల నిరాశ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి సినిమాల్లో చూసినదంతా మరచిపోండి. మీరు మీలా ఉంటూనే మీ భాగస్వామితో ఇష్టప్రకారం నడుచుకోడానికి ప్రాధాన్యత ఇవ్వండి చాలు.

ఆందోళన పడటం..

ఆందోళన పడటం..

మనం ఏదైనా కొత్త పని మొదలు పెట్టేముందు లేదా పూర్తి చేసిన తర్వాత దాని నుండి ఎలాంటి రిజల్ట్ వస్తుందోనని మనం తెగ కంగారు పడుతుంటాం. అలాగే రొమాన్స్ విషయంలో కూడా ప్రతి ఒక్కరూ మొదట్లో ఆందోళన చెందుతూ ఉంటారట. అయితే మీరు ఎలాంటి కంగారు పడకుండా మీరు చేయాలనుకున్నది సౌకర్యవంతంగా చేస్తే ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు.

సైజ్ చిన్నగా..

సైజ్ చిన్నగా..

‘నా పురుషాంగం చాలా చిన్నగా ఉంటుంది. నేను నా లైఫ్ పార్ట్ నర్ ను సాటిస్ ఫై చేస్తానో లేదో అనే భయంగా ఉంది'.. అని నూటికి 70 శాతం మంది ఇలాంటి డౌట్స్ తో కుమిలిపోతున్నారంట. అయితే కలయికలో పాల్గొనేందుకు.. పురుషాంగ పరిమాణానికి, లైంగిక సామర్థ్యానికి ఎలాంటి సంబంధం ఉండదు.

బాడీలో అవి తగ్గితే..

బాడీలో అవి తగ్గితే..

సాధారణంగా రొమాన్స్ చేస్తూ.. పార్ట్ నర్ ను సుఖపెట్టడం ఒక కళ. ఆ టాలెంట్ మీలో ఉంటే చాలు.. మీ జీవిత భాగస్వామిని మనసారా ప్రేమించి.. తనను అర్థం చేసుకుంటే సరిపోతుంది. బాడీలో టెస్టోస్టెరాన్ నిల్వలు తగ్గినప్పుడు మాత్రమే డాక్టర్లను సంప్రదించి ట్యాబ్లెట్స్ వాడితే చాలు.

మీ శ్రీవారు మీపై మనసు పడాలంటే.. ఇలా ట్రై చేయండి...

ఆ సమస్యలు..

ఆ సమస్యలు..

షుగర్ ఉండే వారికి.. అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి. శీఘ్రస్కలన సమస్య బాధపెడుతుంది. ఈ సమస్య కూడా చాలా మందికి ఎదరవుతూ ఉంటుంది. అయితే పురుషాంగానికి సంబంధించిన రక్తనాళాలు దెబ్బతిన్నప్పుడు.. ఆ వైపుగా రక్తప్రవాహమూ తగ్గుతుంది. దీంతో అంగస్తంభన సమస్యలు వస్తుంటాయి. అంతేకానీ, ఆ షుగర్ ఉన్న అందరిలోనూ ఇలాంటి లోపాలు తలెత్తవు.

కొందరు యువకులు..

కొందరు యువకులు..

కొందరు కుర్రాళ్లైతే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కొన్ని విషయాల్లో అనుమానం పడుతూ ఉంటారు. ఏమన్నా అంటే.. నా భార్యకు నేనంటే ఇష్టం ఉండదు. పడకగదిలో తప్పితే.. తాను ఎప్పుడు అడిగినా కలయికకు ఆసక్తి చూపించదని వాపోతుంటారు.

కోరికలు ఎక్కువగా..

కోరికలు ఎక్కువగా..

వాస్తవానికి మనలో చాలా మందిలో ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్లు ఆడ, మగవారిలో కోరికలను నిర్ణయిస్తుంది. టెస్టోస్టెరాన్ పురుష పక్షపాతి. మగవారిలో ఆ హార్మోన్ ప్రభావం 10 నుండి 20 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీంతో మగాళ్లకు ఎక్కువగా కోరికలు కలుగుతుంటాయి.

అందుకు తగినట్టు..

అందుకు తగినట్టు..

కలయికలో పాల్గొనే స్త్రీ, పురుషులు సమయానికి మూడ్ కూడా అందుకు తగినట్టు ఉండాలి. ఇందుకోసం బెడ్ రూమ్ లో తక్కువ లైటింగ్ ఉండేలా చూసుకోవడం, పరిమళద్రవ్యాలతో గదిని నింపడం.. వంటివి చేయాలి. ఇలాంటి చిన్న చిన్న ఏర్పాట్లే మూడ్ ని మీ రొమాంటిక్ లైఫ్ ఎంజాయ్ చేసేలా చేస్తాయి.

English summary

Doubts everyone have about romance in telugu

Here we are talking about the doubts everyone have about romance in telugu. Read on
Story first published: Tuesday, March 30, 2021, 14:27 [IST]