Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Stamina Boosting Drinks: శృంగార జీవితాన్ని ఆస్వాదించడానికి ఈ డ్రింక్స్ చాలా తోడ్పడతాయి
రోజువారీ డైట్ ప్లాన్‌లో కొన్ని పానీయాలను చేర్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు శృంగారం పట్ల ఆసక్తిని, సెక్స్ స్టామినాను పెంచుకోవచ్చు.
Stamina Boosting Drinks: వయస్సు పెరుగుతున్నకొద్దీ మన శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. మీ శరీరంతో పాటు మీ సెక్స్ స్టామినా కూడా అనేక మార్పులకు లోనవుతుంది. అంగం స్తంభించడంలోనూ లోపాలు కనిపిస్తూ ఉంటాయి. మహిళల్లో అయితే యోని పొడిగా మారుతుంది. కీళ్ల నొప్పుల్లాంటివి ఇబ్బంది పెడతాయి. అలాగే సెక్స్ పట్ల కోరిక తగ్గుతుంది.

అయితే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా మీరు మీ జీవితాంతం చురుకైన లైంగిక జీవితాన్ని గడపవచ్చు. వ్యాయామం, మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు లైంగిక జీవితం కూడా ఆనందంగా సాగుతుంది. మీ రోజువారీ డైట్ ప్లాన్‌లో కొన్ని పానీయాలను చేర్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు శృంగారం పట్ల ఆసక్తిని, సెక్స్ స్టామినాను పెంచుకోవచ్చు.

1. గ్రీన్ టీ
గ్రీన్ టీ బరువు తగ్గడానికి ఒక అద్భుత పానీయం మాత్రమే కాదు, మీ లైంగిక కోరికను కూడా పెంచే మహాద్ఫుత డ్రింక్. గ్రీన్ టీలో కాటెచిన్స్ అనే రిచ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఇది సెక్స్ డ్రైవ్‌ను పెంచడానికి సహాయపడుతుంది.

2. బ్లాక్ కాఫీ
మనందరికీ తెలిసినట్లుగా, మానసిక స్థితిని కాఫీ మెరుగుపరుస్తుంది. కాఫీలోని కెఫిన్ పురుషులు, మహిళలు ఇద్దరిలో సెక్స్ డ్రైవ్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. హ్యూస్టన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్ 2015లో జరిపిన అధ్యయనం ప్రకారం, ప్రతి రోజూ కాఫీ తాగే పురుషులు, అంగస్తంభన సమస్యలు ఎదుర్కొనే అవకాశం చాలా చాలా తక్కువ అని తేలింది.

3. రెడ్ వైన్
ది జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ వైన్ పురుషులు, స్త్రీలలో లైంగిక ప్రేరేపణను పెంచుతుందని పేర్కొంది. రెండు గ్లాసుల రెడ్ వైన్ తీసుకోవడం వల్ల మహిళల్లో సెక్స్ డ్రైవ్ పెరుగుతుంది. పురుషులలో, రెడ్ వైన్ టెస్టోస్టెరాన్ను పెంచుతుంది. అతిగా సేవించడం వల్ల దుష్ప్రభవాలు ఉంటాయని గుర్తించుకోవాలి.

4. బనానా షేక్
బనానా షేక్ మంచి రుచిని ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. బనానా షేక్ మీ సెక్స్ డ్రైవ్‌ను కూడా పెంచుతుంది. అరటి పండులో బ్రోమెలైన్ ఎంజైమ్ ఉంటుంది. ఇది పురుషులలో టెస్టోస్టెరాన్‌లను పెంచుతుంది. రోజూ బనానా షేక్ తాగడం అలవాటు చేసుకుంటే కొన్ని రోజుల్లోనే ఆ ఫలితాలను గుర్తించవచ్చు.

5. దానిమ్మ రసం
పురుషుల్లోనూ, స్త్రీల్లోనూ లైంగిక హార్మోన్లను పెంచడంలో దానిమ్మ రసం చాలా మంచి ఫలితాన్ని చూపిస్తుంది. USలోని బెవర్లీ హిల్స్ క్లినిక్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇంపోటెన్స్ రీసెర్చ్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం, దానిమ్మ రసం తీసుకోవడం వల్ల లైంగిక అవయవాలకు రక్త ప్రసరణ పెరుగుతుందని గమనించారు. తాజా దానిమ్మలతో చేసిన జ్యూస్ లను తాగడం మంచిది.

6. కలబంద రసం
కొన్ని అధ్యయనాల ప్రకారం, అలోవెరా జ్యూస్ టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. కలబంద రసం తాగడం వల్ల లైంగిక శక్తి పెరుగుతుంది. కలబంద రసం సాధారణంగా మీ ఆరోగ్యానికి కూడా మంచిది.

7. పుచ్చకాయ రసం
పుచ్చకాయ రసంలో L-citrulline అనే అమైనో ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. పుచ్చకాయలు మీ అంగస్తంభనను బలోపేతం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పుచ్చకాయలో ఉండే ఎల్-సిట్రులిన్ మీ శరీరంలో ఎల్-అర్జినైన్‌గా మార్చబడుతుంది. ఈ సమ్మేళనం నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మంచి అంగస్తంభనను కలిగి ఉండటానికి మీకు సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications