For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెక్స్ పట్ల భాగస్వామిలో ఉండే భయాన్ని ఇలా పోగొట్టేయండి..

మీ పార్ట్నర్ కు సెక్స్ అంటే భయమేస్తోందా? అలాంటి సందర్భాల్లో ఆ సమస్యను ఎలా అధిగమించాలో ఇప్పుడే తెలుసుకోండి.

|

పెళ్లయిన తర్వాత లేదా పెళ్లికి ముందు చాలా మంది తొలిసారి సెక్స్ లో పాల్గొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే అదే సమయంలో భాగస్వామి నుండి ఆశించినంత స్పందన ఉండదు.

Fear About Sex And How To Deal With Partner in Telugu

ఒకవేళ తను చురుగ్గా ఉన్నప్పటికీ.. తమ సామర్థ్యం మీద కొందరికి అనుమానాలు కలుగుతూ ఉంటాయి. తమ పార్ట్నర్ ను సుఖపెడతామా లేదా తనకు త్వరగా భావప్రాప్తి కలుగుతుందా లేదా, తనకు సెక్స్ పట్ల అవగాహన ఉందా లేదా అని ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతూ ఉంటాయి.

Fear About Sex And How To Deal With Partner in Telugu

ఇక అమ్మాయిల విషయానికొస్తే.. తొలిసారి శృంగారంలో పాల్గొంటే బాగా నొప్పి కలుగుతుందనే అపొహలతో పాటు ఇంకా చాలా విషయాల్లో అపొహలు ఉంటాయి. ఇలాంటి భయాలతో ఆ కార్యంలో పాల్గొంటే ఎప్పటికీ మీరు శృంగారాన్ని ఆస్వాదింలేరు. ఈ సందర్భంగా భాగస్వామిలో శృంగారం పట్ల భయాన్ని ఎలా పోగొట్టాలి.. తనను ఆ కార్యానికి ఎలా సిద్ధం చేసుకోవాలనే ఆసక్తకిరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మన దేశంలోని ఆ ప్రాంతంలో పెళ్లికి ముందే రొమాన్స్... అంతేకాదు ఎవరితోనైనా ఎన్నిరోజులైనా గడపొచ్చు...!మన దేశంలోని ఆ ప్రాంతంలో పెళ్లికి ముందే రొమాన్స్... అంతేకాదు ఎవరితోనైనా ఎన్నిరోజులైనా గడపొచ్చు...!

పెళ్లి కాని వారిలో..

పెళ్లి కాని వారిలో..

పెళ్లి అయిన వారు ఆ కార్యాన్ని ఎలాగోలా స్టార్ట్ చేసేస్తారు. కానీ పెళ్లి కానీ యువతీ యువకులు డేటింగుకు వెళ్లినప్పుడు లేదా తొలిసారి ఆ కార్యంలో పాల్గొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అదే సమయంలో వారికొచ్చే అనుమానాలు వారి మూడ్ ను చెడగొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతవరకు సెక్స్ గురించి విన్న విషయాలను తలచుకుని భయపడుతూ ఉంటారు.

ప్రెగ్నెన్సీ భయం..

ప్రెగ్నెన్సీ భయం..

పెళ్లి కాని వారు ఆ కార్యంలో తొలిసారి పాల్గొంటే గర్భం వస్తుందని భయపడుతూ ఉంటారు. అందుకే చాలా మంది అలాంటి సమస్య ఎదురుకాకుండా కండోమ్ లను వాడతారు. అయితే కండోమ్స్ 100% సేఫ్ కాదు. ఎందుకంటే నాణ్యత లేని కండోమ్స్ కలయిక సమయంలో చిరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి గురించి బాగా స్పష్టత వచ్చాకే ఆ కార్యంలో పాల్గొంటే మీరు మీ పార్ట్నర్ ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు.

నొప్పికి కారణాలు..

నొప్పికి కారణాలు..

పెళ్లి తర్వాత లేదా తొలిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు కాస్త నొప్పిగా ఉంటుంది. ఇది అందరికీ సర్వసాధారణంగానే ఉంటుంది. అయితే ఇది మిమ్మల్ని మరీ ఇబ్బంది పెడుతుంటే.. మీరు వైద్యుడిని కలిసి కౌన్సెలింగ్ తీసుకోండి. ఒకవేళ మీరు ఎక్కువ వెయిట్ ఉంటే.. సరైన డైట్ ఫాలో అవ్వండి. ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు వర్కౌట్లు చేస్తే చాలు. మీ వెయిట్ కంట్రోల్ లోకి వచ్చేస్తుంది. అలా చేయకుండా ఆ కార్యంలో పాల్గొంటే నొప్పి మరింత పెరగొచ్చు.

ప్రేమలో పురుషులు చేసే అతి పెద్ద తప్పులు ఏంటో తెలుసా?ప్రేమలో పురుషులు చేసే అతి పెద్ద తప్పులు ఏంటో తెలుసా?

మోహమాటం..

మోహమాటం..

ఇక రెగ్యులర్ గా ఆ కార్యంలో పాల్గొనే వారు ఎప్పుడూ ఒకేలా శృంగారంలో పాల్గొనడాన్ని అంతగా ఇష్టపడరు. చాలా మందికి కొత్త కొత్త భంగిమల్లో ట్రై చేయాలనిపిస్తుంది. అయితే తమ భాగస్వామికి చెబితే ఏమనుకుంటారో అని ఓపెన్ అవ్వడానికి మొహమాట పడుతూ ఉంటారు. దీంతో చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మీరిద్దరూ ముందుగానే ఆ విషయాల గురించి మాట్లాడుకోవాలి. మీకు ఎలాంటి భంగిమలో భావప్రాప్తి దక్కుతుందో అనే విషయాన్ని తెలుసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అప్పుడే మీరిద్దరూ ఆ కార్యంలో స్వర్గపు అంచుల దాకా వెళ్లిన అనుభూతి పొందుతారు.

కాన్ఫిడెన్స్ తక్కువగా..

కాన్ఫిడెన్స్ తక్కువగా..

చాలా మందికి ఆ కార్యంలో పాల్గొనే ముందు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. దీంతో సెక్స్ కు దూరంగా ఉండిపోతారు. ముఖ్యంగా తాము చిన్నగా ఉన్నామని లేదా చాలా లావుగా ఉన్నామని.. కొందరేమో తాము చాలా పొట్టిగా ఉన్నామని ఏవేవో అనవసర విషయాల గురించి భయపడుతూ ఉంటారు. అయితే శృంగారానికి ఇలాంటివేవి సమస్య కాదనే విషయాన్ని మాత్రం మరచిపోవద్దు. అయితే మీరు ముందుగా మానసికంగా సిద్ధం కావాలి.

స్లోగా స్టార్ట్ చేస్తే..

స్లోగా స్టార్ట్ చేస్తే..

కొందరు మగాళ్లు శృంగారం విషయంలో చాలా స్పీడ్ గా ఉంటారు. అయితే ఇలా స్పీడ్ గా ఉండటం చాలా మంది ఆడవారికి నచ్చదు. వారు మీ వేగాన్ని తట్టుకోలేరు. కాబట్టి మీరు ఆ కార్యంలో పాల్గొనే ముందు దూకుడుగా ఉండకుండా.. స్లోగా స్టార్ట్ చేయండి. అప్పుడు మీ పార్ట్నర్ కూడా మీతో ఎక్కువ సమయం కలయికలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతారు. అప్పుడు మీకు కచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది.

English summary

Fear About Sex And How To Deal With Partner in Telugu

Here we are talking about the fear about sex and how to deal with partner in Telugu. Have a look
Story first published:Wednesday, February 16, 2022, 18:52 [IST]
Desktop Bottom Promotion