Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
అబ్బాయిల్లోని ఈ గుణాలు.. అమ్మాయిలకు అస్సలే నచ్చవు, జాగ్రత్త సుమీ!
చాలా మంది అమ్మాయిలకు అబ్బాయిల్లో కొన్ని నచ్చని గుణాలు ఉన్నాయి. అయితే అవేంటో తెలుసుకొని.. ఆ పనులు చేయకపోతే మీరు అమ్మాయిల్ని సులువుగా ఇంప్రెస్ చేయొచ్చు. అయితే ఈ గుణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు చేయని పనంటూ ఉండదు. వారితో స్నేహం ఏర్పరుచుకోవాలన్నా, వారిని ప్రేమలో దింపాలన్నా చాలా కష్టపడిపోతుంటారు. వారికి నచ్చిన వేషాలన్నీ వేస్తుంటారు. కానీ అమ్మాయిను ఇంప్రెస్ చేయడం అంత తేలికైన పని కాదు. ఈ విషయం బహుశా అబ్బాయిలకు తెలియకపోవచ్చు. మీరు అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకొని ఆమెకు నచ్చేవి ఎన్ని చేసినా ఆమె మిమ్మల్ని ఇష్టపడుతుందనే గ్యారెంటీ లేదు. అలాగే మీరు ఆమె కోసం చేసే ప్రయత్నాలు ఏవైనా మిస్ ఫైర్ అయ్యాయంటే.. ఇక మీ పని గోవిందా. ప్రేమ కాదు కదా కనీసం స్నేహం కూడా దక్కుదు.

చాలా మంది అమ్మాయిలకు అబ్బాయిల్లో కొన్ని నచ్చని గుణాలు ఉన్నాయి. అయితే అవేంటో తెలుసుకొని.. ఆ పనులు చేయకపోతే మీరు అమ్మాయిల్ని సులువుగా ఇంప్రెస్ చేయొచ్చు. అయితే ఈ గుణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అమ్మాయిలపై చెత్త జోకులు వేసే వారంటే చిరాకు:
చాలా మంది అబ్బాయిలు తమ స్నేహితురాలిని ఇంప్రెస్ చేసే క్రమంలో పలువురు అమ్మాయిలపై పిచ్చి పిచ్చి జోకులు వేస్తుంటారు. కొన్ని సార్లు చనువుగా, సరదాగా ఆ అమ్మాయిని కూడా ఎగతాళి చేస్తూ జోకులు వేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఇలాంటి వాళ్లను అమ్మాయిలు అస్సలే ఇష్టపడరు. ముఖ్యంగా బాడీ షేమింగ్ చేసే ఏ అబ్బాయిని అమ్మాయి ఇష్టపడదు.

తామే గ్రేట్ అని ఫీలయ్యే అబ్బాయిలకు అమ్మాయిలు దూరం:
తమకు తాము గ్రేట్ అని ఫీలయ్యే అబ్బాయిలకు అమ్మాయిలు చాలా దూరంగా ఉంటారు. అలాంటి అబ్బాయిలు దగ్గర వచ్చే ప్రయత్నం చేసినా దూరంగా పెడుతుంటారు. తమను తాము ఉన్నత వ్యక్తులుగా భావించుకునే వాళ్లు అమ్మాయిలను చులకన చేసి చూస్తుంటారు. అందుకే ఇలాంటి వారికి గర్ల్స్ దూరంగా ఉంటారు.

ఉపన్యాసాలు ఇచ్చే వాళ్లంటే కూడా నచ్చరు:
తరచుగా ఉపన్యాసాలు ఇచ్చే అబ్బాయిలు అంటే అమ్మాయిలకు తెగ చిరాకు. ప్రతీ చిన్న విషయానికి లెక్చర్లు ఇస్తుంటే ఏంట్రా ఈ నస అని ఫీలవుతుంటారు. వాళ్లు దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తుంటే దూరంగా వెళ్లిపోతుంటారు. కనీసం వాళ్లు మాట్లాడుతుంటే కూడా ఇష్టపడరు. వాళ్లని చూడగానే పారిపోతుంటారు. సో బాయ్స్ జాగ్రత్త.

ఆధిపత్యం చూపే అబ్బాయిలంటే అమ్మాయిలకు అసహ్యం:
ఆధిపత్యం, డామినేషన్ చేసే అబ్బాయిలు అంటే కూడా అమ్మాయిలకు అసహ్యం. అమ్మాయిలను తక్కువ చేసి మాట్లాడుతూ, చులకనగా చూస్తూ తాము ఆధిపత్యం చలాయిస్తుంటారు. నీవు అమ్మాయివి, నీకు ఏం తెలుసుంటూ తరచుగా చెబుతుంటారు. అన్ని విషయాలు తమకే తెలుసని ఫీలవుతూ.. వీరిని మాట్లాడనివ్వరు. అందుకే ఇలాంటి అబబ్బాయిలు అంటే అమ్మాయిలకు నచ్చరు.
పైన చెప్పిన అంశాల్లో ఏ ఒక్క గుణం మీకు ఉన్నా.. వెంటనే మార్చుకోవాలి. లేదంటే మీకు మీ పార్టనర్ దొరకడం కష్టం. అందులోనూ మీరు కావాలనుకునే అమ్మాయిని దక్కించుకోవాలంటే మరింత కష్టం. ఒకవేళ వేరే అమ్మాయితో పెళ్లి జరిగినా.. వాళ్లు కూడా మిమ్మల్ని ఎక్కువగా భరించలేరు. సో జాగ్రత్త బాయ్స్. పైన చెప్పినవన్నీ చూసుకొని మీ ప్రవర్తనను మార్చుకోండి.



Click it and Unblock the Notifications