For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ లక్షణాలతో మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారో లేదో తెలుసుకోవచ్చు...!

|

'పెళ్లి' అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన ఘట్టం. ఈ బంధంతో ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉంటారు. అయితే అలాంటి వివాహ బంధంలో అన్నింటికంటే అత్యంత బాధను కలిగించేది భాగస్వామి తాను వివాహమాడిన వ్యక్తిని మోసం చేసి..

మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే... అందుకేనేమో.. పెళ్లికి ముందు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని చెబుతుంటారు పెద్దలు.అయితే కొన్ని విషయాలను బట్టి మీరు జీవితం పంచుకోబోయే వ్యక్తితో జీవితాంతం ఆనందంగా ఉంటారా?

మిమ్మల్ని వారు అనునిత్యం సంతోషపెడతారా? లేదా తనకు తెలియకుండా ఇతరులతో వివాహేతర సంబంధాలను పెట్టుకుంటారనే విషయాలను మాత్రం ఎవ్వరూ చెప్పలేరు.

ఈ నేపథ్యంలో మీ భాగస్వామి మీకు తెలియకుండా ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటే.. కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.. ఆ లక్షణాలను బట్టి మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారో లేదో తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Colour Psychology:ఇలాంటి రంగులను ఇష్టపడేవారు రొమాంటిక్ గా ఉంటారట...!Colour Psychology:ఇలాంటి రంగులను ఇష్టపడేవారు రొమాంటిక్ గా ఉంటారట...!

ఎక్కువగా ఆవేశపడేవారు..

ఎక్కువగా ఆవేశపడేవారు..

బ్రిటీష్ జర్నల్ ఆఫ్ సైకాలజీలో ప్రచురితమైన ఓకథనం ప్రకారం.. మీ భాగస్వామి తరచుగా ఆవేశ పడుతుంటే.. ఉద్రేకంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే.. అలాంటి వ్యక్తులు తమ భాగస్వాములను మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అలాగే వీరు తమ భాగస్వామికి తెలియకుండా ఇతరులతో సంబంధాన్ని కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అందుకు గల కారణాలేంటో కూడా వివరించారు నిపుణులు.

అలాంటి సంబంధాలు..

అలాంటి సంబంధాలు..

ఉద్వేగంలో నిర్ణయాలు తీసుకునే వారు తమ భాగస్వామిని మోసం చేసే ముందు తమ వివాహ బంధం లేదా ప్రేమ బంధం గురించి ఏ మాత్రం ఆలోచించరట. కేవలం అనైతిక సంబంధాలపై ఆసక్తితో తమ అడుగు ముందుకేస్తారట.

పెళ్లికి ముందు..

పెళ్లికి ముందు..

వారి పరిశోధన ప్రకారం.. పెళ్లికి ముందు ఎవరైతే ఎక్కువమందితో ఆ కార్యంలో పాల్గొని ఉంటారో.. అలాంటి వ్యక్తులు పెళ్లి తర్వాత కూడా తమ భాగస్వామిని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఎందుకంటే ఆ కార్యంలో పాల్గొనే వారికి ఎదుటి వ్యక్తిని ఎలా ఆకర్షించాలి? ఎలా వారిని లోబరుచుకోవాలనే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తారట. అందుకే పెళ్లయ్యాక కూడా ఇలాంటి అవకాశాలు మెండుగా ఉంటాయట.

కొత్తగా పెళ్లైన కపుల్స్ హ్యాపీగా ఉండాలంటే... ఈ విషయాల్లో రాజీ పడాల్సిందే...!కొత్తగా పెళ్లైన కపుల్స్ హ్యాపీగా ఉండాలంటే... ఈ విషయాల్లో రాజీ పడాల్సిందే...!

ఆశించినది దక్కకపోతే..

ఆశించినది దక్కకపోతే..

కొందరు వ్యక్తులు తమ భాగస్వామిని మోసం చేయాలనుకునే ముందు.. తమ బంధంలో తాము ఆశించిన ప్రేమ, ఆప్యాయత, సాన్నిహిత్యం దక్కనప్పుడు ఇతరులపై ఆకర్షణకు లోనవుతారట. వీరి రిలేషన్ షిప్ లో ఆనందం లేకపోవడం వంటివన్నీ.. వేరే వ్యక్తి దగ్గరకు చేరేందుకు అవకాశాన్ని కల్పిస్తాయట.

మగాళ్లే ఎక్కువగా..

మగాళ్లే ఎక్కువగా..

భాగస్వామిని మోసం చేసే వారిలో మగవాళ్లే ఎక్కువగా ఉంటున్నారని ఈ అధ్యయనంలో తేలిందట. ముఖ్యంగా పెళ్లి చేసుకున్న పురుషులు తమ భాగస్వామితో వారికి కావాల్సినది దొరకనప్పుడు.. పక్కచూపులు చూస్తుంటారట. అయితే ఆడవారిలో కూడా కొందరు ఇలాంటివే చేస్తున్నారట. కానీ పురుషులతో పోలిస్తే మహిళలు తక్కువగా మోసం చేస్తున్నారని తేలింది.

ఎక్కువగా మోసం..

ఎక్కువగా మోసం..

అయితే ఒక భాగస్వామిని అనేకసార్లు మోసం చేసే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలట. వారు ఒక్కసారి ఇలాంటి పనులను చేయడం అలవాటు పడ్డాక.. వాటిని అస్సలు మానుకోలేరట. ఈ ప్రవర్తన కూడా వారి జీవనశైలిలో భాగం కనుక.. అలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

అలా ఇష్టపడకపోతే..

అలా ఇష్టపడకపోతే..

వారు మీ కోసం వారి ప్రణాళికలను మార్చడానికి ఎప్పుడూ ఇష్టపడరు. గతంలో, మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి కొత్త అవకాశం వచ్చినప్పుడు, వారు దానిని కోల్పోరు మరియు వారి ప్రణాళికలను సర్దుబాటు చేస్తారు. అయితే, ఈ పరిస్థితి ఇప్పుడు ఉండకపోతే. మీ ప్రణాళికలు ఎంత ఉత్తేజకరమైనవి అయినప్పటికీ, మీరు వాటిని మార్చడానికి ఎప్పుడూ ఇష్టపడరు.

ఇలా టెస్ట్ చేయొచ్చు..

ఇలా టెస్ట్ చేయొచ్చు..

మీ భాగస్వామి కూడా ఇలాంటి రిలేషన్ షిప్ లో ఉన్నారో లేదో తెలుసుకోడానికి మీరు కొన్ని టెస్టులు చేయొచ్చు. ఈ లక్షణాలు వారిలో కనిపిస్తే మీరు వారిని అనుమానించొచ్చు.

- మీ పార్ట్ నర్ ఇన్నాళ్లూ లేనిది మీ దగ్గర ఏదో దాస్తున్నట్లు అనిపిస్తే..

- వారి ఫోన్, ల్యాప్ టాప్ లతో అనుకున్న సమయం కన్నా ఎక్కువగా గడుపుతున్నా..

- మీకు టైం కేటాయించడానికి ఇంట్రస్ట్ చూపకపోతే..

- మీ రొమాంటిక్ లైఫ్ లో మార్పులు(ఇదివరకంటే తక్కువగా లేదా ఎక్కువగా ఆ కార్యంలో పాల్గొంటే)

-చిన్న చిన్న విషయాలకే చిరాకు పడటం..

-వాళ్ల ఫ్రెండ్స్ లేదా మీ ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ గా ఉండే స్నేహితులు మీతో ఇదివరకటిగా క్లోజ్ గా లేకపోతే..

English summary

Hidden Signs Your Partner Might Be Emotionally Cheating On You

Here are the hidden signs your partner might be emotionally cheating on you. Have a look
Story first published: Monday, July 19, 2021, 17:05 [IST]