Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Holi 2023: హోలీ కలర్స్ తో హ్యాపీ హార్మోన్లు పెరుగుతాయని తెలుసా...
హోలీ 2023 సందర్భంగా కపుల్స్ మానసిక స్థితి ఎలా మెరుగుపరుచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో అప్పుడే హోలీ సంబరాలు మొదలయ్యాయి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కలర్ ఫుల్ ఫెస్టివల్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

చిన్నా పెద్ద అనే తేడా లేకుండా, ఆడ, మగ అనే వ్యత్యాసం లేకుండా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే ఈ రంగుల పండుగ మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది. ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ రంగుల వానలో తడిసి ముద్దవ్వాలని ఆశిస్తారు.

ప్రతి ఒక్కరూ ఈ పండుగ సంబురాల్లో పాల్గొనడం వల్ల దైనందిన జీవితంలోని సమస్యలను మరచిపోయి.. మొత్తం సందడి వాతావరణం ఏర్పడుతుంది. అందుకే హోలీ సంబరాల్లో పాల్గొనడం వల్ల ఉత్సాహంగా, చురుగ్గా మారిపోతారని, రంగులతో ఆడుకోవడం వల్ల అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. హోలీ పండుగ ఇంట్లో ప్రేమతో పాటు ఆనందాన్ని కూడా పెంచుతుంది. ఇది భార్యభర్తల మధ్య బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఈ సందర్భంగా హోలీ కలర్స్ మీ వైవాహిక జీవితాన్ని ఎలా సంతోషంగా మారుస్తాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఒత్తిడి తగ్గిస్తుంది..
హోలీ వేడుకల్లో కపుల్స్ ఇద్దరు పాల్గొనడం వల్ల మీ ఒత్తిడి మరియు ఆందోళన స్థాయిలు చాలా వరకు తగ్గిపోతాయి. ప్రకాశవంతమైన రంగులు మరియు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే వాతావరణం వల్ల మీ సమస్యలన్నీ కాసేపు మరచిపోయి మీరు ఆనందంగా ఉండేందుకు దోహదపడతాయి.

మానసిక స్థితి మెరుగుదల..
కొత్తగా పెళ్లైన కపుల్స్ లేదా ఇతర దంపతులు ఇప్పటివరకు ఏదైనా మానసిక సమస్యలను ఎదుర్కొంటు ఉంటే.. హోలీ రంగుల వేడుకల్లో పాల్గొనడం వల్ల మీ మానసిక స్థితి కచ్చితంగా మెరుగుపడుతుంది. సంతోషకరమైన వాతావరణం మరియు ఆహ్లాదకరమైన కార్యకలాపాలు మీరు ఎంతో సంతోషంగా ఉండేందుకు సహాయపడతాయి.

కొత్త వారితో పరిచయం..
హోలీ పండుగ రోజున స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పాటు కొత్త వ్యక్తులతో కలిసి రంగుల పండుగలో పాల్గొనడం వల్ల మీకు కొత్త వారితో మాట్లాడేందుకు అవకాశం లభిస్తుంది. ఈ ప్రకాశవంతమైన సమయంలో.. రంగుల సంబరాల్లో మునిగిపోయినప్పుడు.. మీకు ఒకరితో ఒకరికి మాట్లాడేందుకు మంచి అవకాశం అనేది సులభంగా ఏర్పడుతుంది.

బంధాల ప్రోత్సాహం..
చిన్నా, పెద్దా, స్త్రీ, పురుషుల వంటి ఎలాంటి తేడాలు లేకుండా ఆడే హోలీ ఆటలో పాల్గొనడం వల్ల మీ బంధం బలంగా మారేందుకు సహాయపడుతుంది. అందమైన కళాఖండాలను రూపొందించడానికి ప్రతి ఒక్కరూ కలిసి పని చేస్తున్నప్పుడు మీ బంధం మరింత బలంగా మారేందుకు సహాయపడుతుంది.

హ్యాపీ హార్మోన్స్..
హోలీ పండుగ రోజున మీరిద్దరూ ఒకరికొకరు రంగులు చల్లుకోవడం.. రుచికరమైన మిఠాలను పంచుకోవడం.. ఇద్దరూ కలిసి సరదాగా గడపడం వల్ల హ్యాపీ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మీ మానసిక స్థితి తేలికగా మెరుగుపడుతుంది. మీ ఇద్దరి మధ్య సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు సంతోషంగా ఉండేందుకు సహాయపడుతుంది.

కలర్ థెరపీ..
చివరగా హోలీ పండుగ సమయంలో రంగుల వాడకం చాలా కీలకమైనది. ఎందుకంటే ప్రతి ఒక్క రంగు వెనుక ఏదో ఒక శక్తి, భావోద్వేగాలు మరియు పరివర్తన సామర్థ్యం యొక్క విభిన్న అంశాలతో ముడిపడి ఉంటుంది.
ఈ లోకంలో ఎన్నో రంగులు మన చట్టూ ఎల్లప్పుడూ ఉంటాయి. అవి మనపై లోతైన మానసిక, శారీరక మరియు భావోద్వేగ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు రెడ్ కలర్ ఎక్కువ స్థిరత్వాన్ని తెస్తుంది.
బ్లూ కలర్ వ్యక్తీకరణ మరియు కమ్యూనికేషన్లో సహాయపడుతుంది. ఎల్లో కలర్ మీ శక్తిని పెంచడంలో దోహదపడుతుంది.
ఈ ఏడాది 2022 సంవత్సరంలో మార్చి 17, 18వ తేదీల్లో అంటే గురు, శుక్రవారం నాడు రానుంది. స్నేహాన్ని, బంధుత్వాన్ని మరింత దగ్గర చేసేందుకు హోలీ వంటి పండుగలు ఎంతో ప్రయోజకరంగా ఉంటాయి. ఇదిలా ఉండగా.. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో శుక్ల పక్షం పౌర్ణమి రోజున హోలికా దహనం చేస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, రంగ్ ఉత్సవ్ హోలీని హోలికా దహన్ అంటారు. ఈ పండుగ సత్య యుగం నుండి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాల ద్వారా తెలుస్తోంది.



Click it and Unblock the Notifications