Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ప్రేమలో పడ్డ అబ్బాయిలు ఇలా ప్రవర్తిస్తారు
పురుషులు ప్రేమలో పడినప్పుడు వారు మరింత ఉద్వేగభరితంగా, క్రేజీగా ఉంటారు. తమకు ప్రియమైన వారు వారి చుట్టూ ఉంటే వారిలో చాలా రకాల భావాలు కలుగుతాయి. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించినప్పుడు అతడు కొంత విభిన్నంగా ప్రవర్తిస్తాడు.
పురుషులు ప్రేమలో పడినప్పుడు వారు మరింత ఉద్వేగభరితంగా, క్రేజీగా ఉంటారు. తమకు ప్రియమైన వారు వారి చుట్టూ ఉంటే వారిలో చాలా రకాల భావాలు కలుగుతాయి. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించినప్పుడు అతడు కొంత విభిన్నంగా ప్రవర్తిస్తాడు.

ఒక అబ్బాయి ప్రేమలో పడినప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, ఎలాంటి భావాలను వ్యక్తపరుస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం.

1. వాళ్లు రొమాంటిక్‌గా మారతారు
పురుషులు స్త్రీలతో ప్రేమలో పడినప్పుడు, రోమియోగా మారతారు. అమ్మాయిలకు తరచూ గిఫ్ట్స్ ఇస్తుంటారు. తమ ప్రియమైన వారిని ఏదైనా ప్రదేశాలకు తీసుకెళ్తారు. వారిని నవ్వించడానికి ప్రయత్నిస్తారు. క్యాండిల్ లైట్ డిన్నర్‌లు ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటి పనుల వల్ల అబ్బాయి ప్రేమలో ఉన్నట్లు ఈజీగానే తెలిసిపోతుంది.

2.మార్పు కనిపిస్తుంది
అమ్మాయిని జస్ట్ ఫ్రెండ్ అనుకున్నా లేదా ఫ్లర్టింగ్ కోసమే అనుకున్నా ఆ అమ్మాయిని అబ్బాయి తన స్నేహితులకు, కుటుంబసభ్యులకు పరిచయం చేయడానికి ఇష్టపడడు.
అబ్బాయిలు నిజంగా ప్రేమలో ఉన్నప్పుడు.. ఆ అమ్మాయి గురించి తన స్నేహితులకు చెబుతుంటాడు. తన మిత్రులకు, కుటుంబసభ్యులకు ఆ అమ్మాయిని పరిచయం చేస్తాడు. ఇలా పరిచయం చేస్తే తను ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు.

3. ఎక్కువగా మాట్లాడతారు
అబ్బాయిలు అమ్మాయితో ప్రేమలో ఉంటే వారు ఎక్కువగా మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. సమయం, సందర్భం, మాట్లాడటానికి సరైన టాపిక్ లేకపోయినా వారు ఏదో ఒక దాని గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఒక్క సమయం గడపాలని తపిస్తారు.

4. అభిప్రాయాలపై ఆసక్తి
ఒక అమ్మాయి పట్ల అంతగా అనుభూతి చెందని వ్యక్తి ఆమె ఏదైనా అంగీకరించకపోతే పెద్దగా పట్టించుకోడు. మరోవైపు, ప్రేమలో పడ్డ వ్యక్తి ఆహారం, అలంకరణ, వస్తువులు, సినిమాలు, రాజకీయాలు ఇలా ప్రతి దాని గురించి ఆమె అభిప్రాయం ఏమిటో తెలుసుకోవడానికి ఇష్టపడతాడు.

5. స్త్రీల పట్ల సద్భావం ఉంటుంది
అప్పటి వరకు స్త్రీలు, వారి అభిప్రాయాలు, వారి ఆత్మగౌరవం, హక్కుల గురించి పెద్దగా పట్టించుకోని వ్యక్తులు కూడా.. ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత పూర్తిగా మారిపోతారు. వారిలో ఆడవారి పట్ల ఉన్న అభిప్రాయం క్రమంగా మారుతుంది. వారు ఉన్నప్పుడు మంచిగా ప్రవర్తిస్తారు. మృదువుగా ఉంటారు. వారికి హక్కులు, ఆత్మగౌరవం ఉందని గుర్తిస్తారు. వారి అభిప్రాయాలకు విలువ ఇస్తారు.

6. జాగ్రత్తగా చూసుకుంటారు
ప్రేమించిన అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా అన్ని సమకూరుస్తారు. సంతోషంగా ఉండాలని, ఎప్పుడూ నవ్వుతూ గడిపేయాలని బలంగా కోరుకుంటారు. అమ్మాయిలకు ఏమీ కాకుండా అబ్బాయిలు అండగా నిలబడతారు. ఇది ప్రతి విషయంలోనూ కనిపిస్తుంది. దీనిని మాటలతో చెప్పాల్సిన అవసరం ఉండదు. వారు చేసే పనులు దీని గురించి చెప్పేస్తాయి.

7. వారు మిమ్మల్నే ఎంచుకుంటారు
వారి దృష్టిలో ప్రేమించిన అమ్మాయిలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. చుట్టూ ఎంత మంది ఉన్నా మీతో గడపడానికే ఎక్కువగా ఇష్టపడతారు. మీతో సమయం గడపాలని, ఏదో మాట్లాడాలని, వీలైతే తాకాలని తహతహలాడుతుంటారు. ఫ్రెండ్స్ ఉన్నా వారితో కంటే ప్రేమించిన అమ్మాయితోనే ఉండటానికి మక్కువ చూపిస్తారు.



Click it and Unblock the Notifications