For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రతిక్రీడలో పాల్గొన్నప్పుడు నొప్పిగా ఉంటోందా? అయితే ఇలా ప్రయత్నించండి...

|

మనలో చాలా మంది రతిక్రీడలో పాల్గొన్నప్పుడు కొన్ని రకాల నొప్పులను అనుభవిస్తూ ఉంటారు. అయితే ఇలా కలయిక సమయంలో ఈ నొప్పి కేవలం తమకు మాత్రమే వస్తుందేమో అని కంగారు పడుతూ ఉంటారు.

ఇలాంటి విషయాలను బయటకు చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. అయితే ఇలా చేయడం వల్లీ మీ ప్రాబ్లమ్ కు సొలుష్యన్ దొరకకపోగా.. మీరు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఆ కార్యంలో పాల్గొన్నప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగితే.. ఆ సమస్య మీ ఇద్దరిదీ అని గ్రహించాలి. అప్పుడే మీకు కలిగే నొప్పికి.. అందుకు గల కారణామేంటో తెలిస్తే.. దాని నివారణకు ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు.

ఈ సందర్భంగా కలయిక సమయంలో కాస్త నొప్పి, కొంచెం ఇబ్బంది అనేది కామన్ గా ఉంటుంది. అయితే ఆ కార్యంలో పాల్గొనడం తరచుగా జరుగుతూ ఉంటే అది కాస్త తగ్గిపోతుంది. ఇక పూర్తిగా మీరు క్లైమాక్స్ లో ఆ కార్యాన్ని అద్భుతంగా ఆస్వాదిస్తారు. అయితే మీరు రతి క్రీడలో పాల్గొన్నప్పుడు నొప్పి మరీ ఎక్కువగా ఉంటే మాత్రం మీరు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాల్సిందే. ఎందుకంటే దీని వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

మగాళ్లకు మాత్రమే.. ఇలా చేస్తే మహిళలకు అస్సలు నచ్చదట...! వారి మూడ్ ఆఫ్ అయిపోతుందట..

ప్రధాన కారణాలు..

ప్రధాన కారణాలు..

మీరు మీ భాగస్వామితో కలిసి కలయికలో పాల్గొన్నప్పుడు ఎక్కువ నొప్పి వస్తుంటే.. యురినరీ ట్రాక్ లో ఇన్ఫెక్షన్, వెజైనల్ ఇన్ఫెక్షన్ ఓవేరియన్ సిస్టులు, ఈస్ట్రోజెన్ లెవెల్స్ తక్కువగా ఉండటం, కటి ప్రాంతంలోని కండరాలు సున్నితంగా మారడం లాంటివి ప్రధాన కారణాలుగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల మీరు ఆ కార్యం సమయంలో నొప్పిని తగ్గించుకోవచ్చు. అప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోతే మీరు తప్పనిసరిగా డాక్టర్ ను సంప్రదించాలి.

నొప్పిని మరచిపోవాలంటే..

నొప్పిని మరచిపోవాలంటే..

చాలా మంది జంటలు ఆ కార్యంలో పాల్గొనే సమయంలో చాలా తక్కువగా మాట్లాడతారు. కేవలం ఆ పనిపై ఫోకస్ పెడుతూ ఉంటారు. అయితే అలా చేయడం వల్ల మీకు నొప్పి భావన కలగొచ్చు. మీకు నొప్పి ఫీలింగ్ రాకూడదంటే.. మీరిద్దరూ మనసు విప్పి కబుర్లు చెప్పుకోవాలంట. అలా చేయడం వల్ల మీ ఇద్దరికీ నొప్పి అనే విషయమే తెలియదట.

అలా జరిగితే..

అలా జరిగితే..

చాలా మంది ఆ కార్యంలో పాల్గొన్నప్పుడు ఏదైనా నొప్పి కలిగితే.. అది తమ పర్సనల్ విషయంగా భావించి.. వారిలో వారే ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అలా చేయం కరెక్టు కాదు.. మీరు పడుతున్న ఇబ్బందిని మీ భాగస్వామికి తెలియజేయాలి. మీ నొప్పికి ప్రధాన కారణమేంటో తెలిస్తే.. అందుకు పరిష్కారం చాలా సులభమవుతుంది. ఎందుకంటే కొందరికి ఆ కార్యంలో పాల్గొన్నప్పుడు వెజైనాలో ఫ్లూయిడ్స్ లేకపోతే కూడా నొప్పి వస్తుంటుంది. ఇందుకోసం మీరు ల్యూబ్రికెంట్స్ వాడటం తప్పేం కాదు.

ఈ రాశుల వారు ఉత్తమ బాయ్ ఫ్రెండ్స్ గా ఉంటారట... ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి..!

కోరికలు ఎక్కువుంటే..

కోరికలు ఎక్కువుంటే..

ఎవరికైతే రతి క్రీడకు సంబంధించిన కోరికలు ఎక్కువగా ఉంటాయో.. వారు ఇలాంటి వాటిని వాడటం ఉత్తమం. ముఖ్యంగా మంచి క్వాలిటీ ఉండే ల్యూబ్రికెంట్స్ వాడటం వల్ల కూడా నొప్పి నుండి బయటపడొచ్చు. అలాగే అసౌకర్యం నుడి తప్పించుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల వెరైటీ ల్యూబ్రికెంట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో మీకు బెస్ట్ అనిపించే వాటిని వాడండి. దీని వల్ల మీకు మరియు మీ భాగస్వామి ఎలాంటి ఇబ్బంది కలగకపోవచ్చు.

వేర్వేరు భంగిమలు..

వేర్వేరు భంగిమలు..

చాలా మంది కలయికలో పాల్గొనేటప్పుడు ఒకే రకమైన భంగిమలో ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీకు అసౌకర్యం, నొప్పి కలగొచ్చు. కాబట్టి మీరు అప్పుడప్పుడు వేర్వేరు భంగిమల్లో ఆ కార్యంలో పాల్గొనండి. అప్పుడు మీరిద్దరూ నొప్పి అనే దానిని అస్సలు ఫీలవ్వరు. అయితే నొప్పి అనేది తెలియకూడదంటే మీరు ఫోర్ ప్లే చేయడాన్ని అస్సలు మరచిపోవద్దు.

ఇలా చేస్తే..

ఇలా చేస్తే..

ఇలా చేయడం వల్ల మీ బాడీలో హార్మోన్లు విడుదలవతాయి. ఇవి విడుదల కావడం వల్ల మీకు అసౌకర్యం, నొప్పి అనేది తగ్గిపోతుంది. అంతేకాదు మిమ్మల్ని ఉద్రేకపరుస్తుంది. మీ నాడీ, కండరాల్లో చురుకైన కదలికలు తీసుకొస్తుంది. ఆ కార్యానికి అనువుగా మీ బాడీని మార్చేస్తుంది. ఇలాంటి వాటిని ప్రయత్నించినా కూడా మీకు నొప్పి, అసౌకర్యం వంటివి ఉంటే మీరు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. అప్పుడు మీకు కచ్చితం పరిష్కారం లభిస్తుంది.

English summary

How Can I Prevent Pain During Romance

Here we are talking about the how can i prevent pain during romance. Have a look
Story first published: Friday, September 24, 2021, 14:54 [IST]