For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రంగును ఇష్టపడే వారు పడకగదిలో శృంగారాన్ని బాగా ఆస్వాదిస్తారట...!

|

మనలో ప్రతి ఒక్కరికీ కొన్ని రకాల రంగులంటే చాలా ఇష్టం ఉంటుంది. అది చాలా సహజం. ఒక్కో రంగు ఒక్కో విషయాన్ని కూడా తెలుపుతుంది. ఉదాహరణకు తెలుపు శాంతికి చిహ్నంగా, ఎరుపు, గులాబీ రంగులను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు.

ఇదిలా ఉండగా.. మనకు నచ్చే రంగును బట్టి మన శృంగార జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. మీ పడకగదిలో ఎక్కువగా ఏ రంగులో ఉంటుంది? మీ బెడ్ రూమ్ రంగులు మీ రొమాంటిక్ లైఫ్ గురించి ఏమి చెబుతున్నాయనే విషయంలో ఓ సర్వే సంస్థ అధ్యయనం చేసింది.

ఇందులో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పడకగదిలో ఉండే ఈ రంగుల వల్ల మీలో లైంగిక కోరికలు ప్రేరేపించడంలోనూ, మీ ప్రవర్తనపైనా ఇవి బాగా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏయే రంగు ఏమి చెబుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వన్ నైట్ స్టాండ్ సెక్స్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా...!వన్ నైట్ స్టాండ్ సెక్స్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా...!

ఆరెంజ్ కలర్..

ఆరెంజ్ కలర్..

ఆరెంజ్ కలర్ ఇష్టపడే వ్యక్తులు శృంగారంలో ఫాంటసీ కావాలని కోరుకుంటారట. ఈ వ్యక్తులను రతి మన్మథులు అని పిలుస్తారు. కానీ వీరు పడకగదిలో మాత్రం ఎక్కువగా ఆ కార్యంపై ఆసక్తి చూపరు.

బ్లూ కలర్..

బ్లూ కలర్..

ఈ సర్వేలో పాల్గొన్న వారిలో చాలా మంది బ్లూ కలర్ ప్రశాంతమైనదిగా భావించారట. కాబట్టి బ్లూ కలర్ అంటే ఇష్టపడే వారు పడకగదిలో ప్రశాంతంగా నిద్రపోవొచ్చని భావిస్తారట. అందుకే వారు హాయిగా నిద్రపోతారని ఈ సర్వే తెలిపింది. అంతేకాదండోయ్.. నీలం రంగు పడకగదిలో ఉంటే.. వారంలో కనీసం మూడు, నాలుగుసార్లు శృంగారంలో పాల్గొంటారట.

ఎల్లో కలర్..

ఎల్లో కలర్..

పసుపును ఇష్టపడే వారి లైంగిక ఆసక్తులు కొంచెం తక్కువగా ఉంటాయి.వీరు లైంగిక ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. అయితే మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మరోవైపు పసుపు రంగు ఎక్కువగా ఆకలిని ప్రేరేపిస్తుందని తేలిందట. అయితే పడకగదిలో కూడా ఈ రంగు లైంగిక కోరికలను బాగానే ప్రేరేపిస్తుందని సర్వేలో తేలిందట. పసుపు రంగు పడకగదిలో ఉంటే.. రోజుకు సుమారు 7 గంటల 40 నిమిషాల పాటు నిద్రపోతున్నట్లు సర్వేలో తేలింది. అలాగే పసుపు రంగు మానసిక ప్రశాంతతను ఇస్తుందని, దీని వల్ల దంపతుల మధ్య సాన్నిహిత్యం బాగా పెరుగుతుందన్నారు.

Colour Psychology:ఇలాంటి రంగులను ఇష్టపడేవారు రొమాంటిక్ గా ఉంటారట...!Colour Psychology:ఇలాంటి రంగులను ఇష్టపడేవారు రొమాంటిక్ గా ఉంటారట...!

పర్పుల్ కలర్..

పర్పుల్ కలర్..

పర్పుల్ కలర్ ను ఇష్టపడే వ్యక్తులు సాధారణంగా లైంగిక విషయాలలో స్వార్థపరులుగా ఉంటారు. తమ సొంత కోరికలను మాత్రమే చూసుకుంటారట. ఇలాంటి వ్యక్తులు తమ జీవిత భాగస్వామి ప్రయోజనాల కంటే తమ సొంత ప్రయోజనాలకు మొదటి స్థానం ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

గ్రీన్ కలర్..

గ్రీన్ కలర్..

ఈ రంగును ఇష్టపడే వ్యక్తులు శృంగారంలో ఎప్పటికప్పుడు తాజాదనాన్ని, కొత్తదనాన్ని కోరుకుంటారట. ఇలాంటి అభిరుచుల వల్ల వీరు పడకగదిలో భాగస్వామిని బాగా ఇష్టపడతారట.

బ్లాక్ కలర్..

బ్లాక్ కలర్..

ఈ రంగును ఇష్టపడే వ్యక్తులు శృంగారంలో ఎక్కువ ఆసక్తి చూపుతారట. పడకగదిలో తమ కోరికలను నెరవేర్చుకునేందుకు కొంత ఆధిపత్యం కూడా చెలాయిస్తారట. ఆ కార్యంలో ఎల్లప్పుడూ వీరిదై పైచేయిగా ఉండాలని భావిస్తారట.

వైట్ కలర్..

వైట్ కలర్..

ఈ రంగును ఇష్టపడే వ్యక్తులు సాధారణంగా శృంగారం అంటే చాలా సిగ్గుపడతారట. ఈ కారణంగా వీరు పడకగదిలో కూడా శృంగారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వరట.

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం అంతా మాకు ఇంటర్నెట్లో మరియు ఇతర చోట్ల దొరికిన సమాచారంతో పాటు మాకు పరిజ్ణానాన్ని జోడించి రాసినది. అలాగే ఓ సర్వే సంస్థలో వెల్లడైన విషయాలు మాత్రమే. వీటిని నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం.

English summary

How Different Colors Affect Your Love Life in Telugu

Here we are talking about the how different colors affect your love life in Telugu. Have a look