For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ టైంలో ఫ్రస్టేషన్ ను ఎలా అధిగమించాలో తెలుసా...

మీ ప్రేమ జీవితంలో కోపం, చిరాకును ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే సంబంధంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో అలకలు, కోపం, చిరాకు అనేవి కచ్చితంగా వస్తాయి. అయితే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులు లేదా తమ భాగస్వాములు ఏదో అన్నారని మనం వారిపై పగ పెంచుకుంటూ ఉంటాం.

How Do I Overcome Frustration in Love and Relationship?

ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంటాం. అయితే అలా చేయడం అనేది మంచి అలవాటు కాదు. పగ అంటే ఎదుటి వాళ్ల మీద అరవడం.. చిరాకు పడటం.. అలగడం వంటివి చేస్తుంటారు.

How Do I Overcome Frustration in Love and Relationship?

కోపంలోనే మన భాగస్వాములను లేదా బంధువులను ఏదైనా కఠినమైన పదాలను వాడుతూ ఉంటాం. మీ ప్రేమ లేదా రిలేషన్ షిప్ లో కోపం, ఫ్రస్టేషన్ వంటి వాటిని ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం...

New Study :'ఈ'పర్సనాలీటీ ఉండే మగాళ్లంటే మగువలు పడి చచ్చిపోతారట...!New Study :'ఈ'పర్సనాలీటీ ఉండే మగాళ్లంటే మగువలు పడి చచ్చిపోతారట...!

సున్నితంగా చెప్పండి..

సున్నితంగా చెప్పండి..

ఇద్దరి వ్యక్తుల మధ్య ఏదైనా విషయంలో గొడవ వచ్చినప్పుడు కోపంలో నోరు జారడం సహజం. అయితే కొన్నిసార్లు పరుష పదజాలం వాడుతూ ఉంటాం. అయితే అలాంటి వాటిని అక్కడే వదిలేస్తే బాగుంటుంది. కానీ కొందరు అలాంటి మాటలను, సంఘటనలను గుర్తు చేస్తూ మనసును నొప్పిస్తుంటారు. అయితే ఇలా చేయడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. అలాగని మీరు పడుతున్న బాధ గురించి వారు వినడానికి సిద్ధంగా ఉండరని భావించొద్దు. కొన్ని సమయంలో మీతో దురుసుగా ప్రవర్తించినందుకు వారు కూడా బాధపడుతూనే ఉంటారు. ఇలాంటి సమయంలో ‘అప్పుడు నువ్వు చాలా రూడ్ గా మాట్లాడావు. నాకు నీపై కోపం వచ్చింది. చిరాకేసింది'లాంటి పదాలు వాడొద్దు. ‘ఆ సమయంలో నువ్వు అన్న మాటలు చాలా బాధించాయి. ఒక్కసారిగా నీకు దూరమైపోయాను' అనిపించిందని సున్నితంగా చెప్పండి.

మీకు ఇష్టమొచ్చినట్టు..

మీకు ఇష్టమొచ్చినట్టు..

రిలేషన్ షిప్ లో లేదా ప్రేమ సంబంధంలో కొన్నిసార్లు చనువు తీసుకుంటూ ఉంటాం. ఇలాంటి సమయంలో మీరు వారి స్వేచ్ఛను హరించే విధంగా వ్యవహరించొద్దు. మీకు ఇచ్చిన చనువును దుర్వినియోగం చేయకుండా ఉండాలి. మీరు ఏ పని చేసినా.. ఏం మాట్లాడినా.. మీ మీద లవ్ ఉంది.. మిమ్మల్ని ఏమీ అనరులే అనే భ్రమలో ఉండొద్దు. ఎందుకంటే ఎవరైనా ఇలాంటి వాటిని కొన్ని పరిమితుల వరకు సహిస్తారు. కాబట్టి అనుబంధాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇద్దరికీ సమానంగానే ఉంటుంది.

పరిస్థితులు చక్కబడిన తర్వాత..

పరిస్థితులు చక్కబడిన తర్వాత..

రిలేషన్ షిప్ లేదా ప్రేమలో అయినా సమయం అనేది ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండదు. మన ఆలోచనలు, భావాలూ, మూడ్ అన్నీ కూడా ప్రతీ క్షణం మారిపోతూ ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు అనుకోకుండానే కోపం వస్తుంది. దీంతో మనం ఎదుటి వాళ్లని ఏదో ఒకటి అనాలి అనుకుంటూ ఉంటాం. కానీ కాసేపు తర్వాత కోపం తగ్గిపోతుంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత మనం ఎందుకు ఇలా మాట్లాడామా అని బాధపడతాం. కాబట్టి మీరు ఎల్లప్పుడూ స్థిరంగా ఉండటం మంచిది. అంతేగానీ మనం ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటే మళ్లీ మనమే బాధపడాల్సి వస్తుంది.

<strong>ప్రెగ్నెన్సీ ఆగిందో లేదో ఇలా తెలుసుకోవచ్చట...</strong></p><p>ప్రెగ్నెన్సీ ఆగిందో లేదో ఇలా తెలుసుకోవచ్చట...

అలా ఫీల్ అవ్వొద్దు..

అలా ఫీల్ అవ్వొద్దు..

ఒకవేళ మీ భాగస్వామి కానీ లేదా ఇతరులు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా కోపంలో అంటే తిరిగి మనం ప్రతీకారం తీర్చుకోవాలని చూడటం మంచిది కాదు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా మనల్ని ఏమైనా అని వారు వచ్చి మీకు సారీ చెబితే.. మనం చేసిన పనికి.. వారు గిల్టీగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా భాగస్వామి మీద లేదా ఇతరులపై ప్రతీకారం తీర్చుకోవడం మంచిది కాదు.

మరోసారి ప్రేమ పుట్టదు..

మరోసారి ప్రేమ పుట్టదు..

మీరు మీ భాగస్వామిపై లేదా ఎదుటి వ్యక్తులపై కోపం పెంచుకుని, వారిపై ప్రతీకారం తీర్చుకోవడం లాంటివి చేస్తే.. వారికి మీపై భవిష్యత్తులో ఎప్పటికీ ప్రేమ అనేదే పుట్టదు. అంతేకాదు మీపై కోపం మరింత పెరిగిపోతుంది. కాబట్టి మీరు మీ భాగస్వామిని లేదా ఇతరులను ఇబ్బంది పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు కనుక వారిని ఏమీ అనకండి. వారిని కాసేపు అలా వదిలేయండి.

మౌనంగా ఉండండి..

మౌనంగా ఉండండి..

మీరు కోపంలో మీ భాగస్వామిపై లేదా ఎదుటి వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే మీరిద్దరూ సంతోషంగా ఉండలేరు. అంతేకాదు మీరు శాంతంగా కూడా ఉండలేరు. కాబట్టి ఇలాంటి సమయాల్లో మీరు సాధ్యమైనంత మేరకు మౌనంగా ఉండండి. ఇలా చేయడం వల్ల పరిస్థితులు చక్కబడతాయి. అప్పుడు మీరంతా ఆనందంగా ఉండొచ్చు. మీ కోపం, ఫ్రస్టేషన్ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

English summary

How Do I Overcome Frustration in Love and Relationship?

Here we are talking about the how do i overcome frustration in love and relationship. Have a look
Story first published:Saturday, September 4, 2021, 18:23 [IST]
Desktop Bottom Promotion