Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
క్రష్ కోసం ఏ రాశి వారు ఎలా నటిస్తారో తెలుసా...!
అన్ని రాశుల వారు క్రష్ కోసం ఏమి చేస్తారో తెలుసుకోవడానికి ఇక్కడ ఓ లుక్కేయండి.
మనలో చాలా మందికి ఎవరో ఒక్కరిపై లేదా కొందరిపై ఎప్పుడో ఒకప్పుడు.. లేదా ఏదో ఒక సందర్భంలో క్రష్ అనేది ఏర్పడుతుంది. అలా ఏర్పడిన క్రష్ కోసం వారు ఏవేవో చేస్తుంటారు.

అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ద్వాదశ రాశుల వారు తమ క్రష్ ఎదుట ఎలా నటిస్తారో కూడా తెలుసుకోవచ్చు. జాతకాలను బట్టి గ్రహాల ఆధారంగా రాశి చక్రాల వారు ఎలా ప్రవర్తిస్తారనే విషయాన్ని అంచనా వేయొచ్చని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఏ రాశి చక్రం వారు తమ క్రష్ ఎదుట ఎలా ప్రవర్తిస్తారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రాశి వారు చాలా విషయాల్లో డేరింగ్, డాషింగ్ గా ఉంటారు. ముఖ్యంగా ప్రేమ విషయంలో చాలా దూకుడుగా ఉంటారు. ఈ రాశి వారు ఎవరినైనా లవ్ చేస్తే.. వారికి వెంటనే ఆ విషయాన్ని చెప్పేందుకు ప్రయత్నిస్తారు. ఎలాంటి విషయాలను సీక్రెట్ గా ఉంచరు. ఎవరైనా వీరిని ముగ్గులోకి దింపినా.. వెంటనే పడిపోతూ ఉంటారు.

వృషభ రాశి..
ఈ రాశి వారు తమ మనసులో ఉండే ప్రేమను ఎప్పటికీ బయటకు చెప్పుకోలేరు. ముఖ్యంగా తమకు నచ్చిన వారితో మాట్లాడే సమయంలో చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అయితే తమలో తాము చాలా ఆనందిస్తారు. అయితే వీరి ప్రవర్తన, హావాభావాల కారణంగా తాము ఎదుటి వ్యక్తిని ఎంతలా ప్రేమిస్తున్నామో చెప్పేస్తారు.

మిధున రాశి..
ఈ రాశి వారు ప్రేమ, ఆప్యాయత, ఇష్టం, అనురాగం అన్నింటినీ తమలోనే దాచుకుంటారు. వీరు ఎవరినైనా ఇష్టపడితే ఆ విషయాన్ని వారితో చెప్పడానికి ఇష్టపడరు. అయితే వారితో చాలా క్లోజ్ గా ఉంటారు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు లవ్ మ్యాటర్స్ ను సీరియస్ గా తీసుకోరు. ముఖ్యంగా వీరిపై సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు ఆ విధంగానే ఆలోచిస్తుంటారు. అందుకే వీరు క్రష్ విషయానికొచ్చేసరికి చాలా అధ్యయనం చేస్తారు.

సింహ రాశి..
ఈ రాశి వారు ఏ విషయంలో చాలా సరదాగా ఉంటారు. ప్రతి సందర్భంలో నిజాయితీగా ఉంటారు. వీరు అందరిలో చాలా సులభంగా కలిసిపోతారు. ముఖ్యంగా క్రష్ విషయంలో చాలా చురుకుగా ఉంటారు. తమకు నచ్చిన వ్యక్తులను ఎక్కువగా నవ్విస్తారు.

కన్య రాశి..
ఈ రాశి వారు క్రష్ గురించి ఏవేవో ఊహించుకుంటూ ఉంటారు. అందుకే వీరు తమకు నచ్చిన వారిపై చాలా ఫోకస్ పెడతారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. వీరికి ఎవరిపై అయినా క్రష్ ఏర్పడితే చాలా సంతోషపడతారు. అది సాధారణమైన విషయం అయినప్పటికీ చాలా గొప్పగా ఫీలవుతుంటారు.

తుల రాశి..
ఈ రాశి వారు సాధారణంగా కుటుంబ సభ్యులకు ఎక్కువ విలువ ఇస్తారు. అలాగే తమ క్రష్ విషయంలోనూ చాలా నిజాయితీగా ఉంటారు. వీరు తమ క్రష్ కోసం ఏదైనా చేయడానికి వెనుకాడరు

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి రొమాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే వీరు క్రష్ విషయంలో చాలా రొమాంటిక్ గా ఆలోచిస్తారు. వీరు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు ఎదుటి వారిని వశపరచుకోవడం చాలా సిద్ధహస్తులు. వీరికి ఎవరైనా నచ్చితే చాలు..వారితో చాలా సరదాగా ఉంటారు. అయితే వీరు ప్రేమిస్తున్న వ్యక్తులను ఎవరైనా ఇష్టపడితే మాత్రం అస్సలు సహించలేరు.

మకర రాశి..
ఈ రాశి వారికి ఎవరిపై అయినా క్రష్ ఉంటే.. చాలా సీక్రెట్ గా ఉంచుతారు. ఎవ్వరితో ఈ విషయాన్ని చెప్పుకోరు. అయితే తమ క్రష్ కు మాత్రం ప్రేమ గురించి చాలా రహస్యంగా ఫోన్లు, ఫన్నీ సందేశాలను పంపుతూ ఉంటారు.

కుంభ రాశి..
ఈ రాశి వారు చాలా విషయాల్లో మొహమాట పడుతూ ఉంటారు. ఇక వీరికి ఎవరిపై అయినా క్రష్ ఏర్పడితే.. ఆ విషయం వారికి చెప్పేందుకు చాలా కాలం పడుతుంది.

మీన రాశి..
ఈ రాశి వారు చాలా రొమాంటిక్ గా ఉంటారు. వీరికి ఎవరిపై అయినా క్రష్ ఏర్పడితే.. వీరు చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. వీరి కలను నెరవేర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు.



Click it and Unblock the Notifications