ఆ విషయంలో మోసం జరిగితే ఏ రాశి వారు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసా...

రిలేషన్ షిప్ లో మోసం జరిగినప్పుడు వ్యవహరించే విధానం, ప్రతి ఒక్క రాశిచక్రం రిలేషన్ షిప్ లో మోసం జరిగినప్పుడు ఎలా డీల్ చేస్తాయి.

మనలో చాలా మంది మనకు ఊహ తెలిసినప్పటి నుండి ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరి చేతిలో మోసపోతూ ఉంటాం. అయితే మనం ఎంతగానో నమ్మిన వారే మోసం చేయడం.. తన అనుకున్న వారంతా మనల్ని ఘోరంగా నయ వంచన చేయడం వంటివి కూడా కామన్ గా జరుగుతూ ఉంటాయి.

How Each Zodiac Sign Deals With Cheating in a Relationship

ప్రస్తుత కాలంలో ఇలాంటివి మరింత ఎక్కువైపోయాయి. నిత్యం ఇలాంటి విషయాల గురించి మనం రోజు టివీల్లో లేదా న్యూస్ పేపర్లలో చూస్తుంటాం. అయితే కొందరు ఒకసారి మోసానికి గురైతే.. మరోసారి అలా జరగకుండా జాగ్రత్త పడతారు. కానీ కొందరు మాత్రం పదే పదే మోసానికి గురవుతూ ఉంటారు. దీంతో చాలా బాధపడతారు.

How Each Zodiac Sign Deals With Cheating in a Relationship

అయితే మోసం జరగడం వల్ల మనం కూడా కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటాం. మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించీ, మనతో కలిసి మెలిసి ఉండే మనుషుల గురించి కొన్ని నమ్మలేని నగ్న సత్యాలను తెలియజేస్తుంది. అయితే మోసం గురించి అందరూ ఒకేలాగా స్పందించరు. ఈ సందర్భంగా జ్యోతిష్యశాస్త్రం గ్రహాల ఆధారంగా మోసం జరిగినప్పుడు ద్వాదశ రాశుల వారు ఎలా స్పందిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారు రిలేషన్ షిప్ లో మోసానికి గురైతే అస్సలు తట్టుకోలేరు. అందరికీ చెప్పుకుంటారు. మోసం చేసిన వారిని అస్సలు వదలకూడదని, వారి పని పట్టేంత వరకు వదిలిపెట్టరు. కుటుంబసభ్యులు, స్నేహితుల సహాయంతో వారికి బుద్ధి చెప్పాలనుకుంటారు.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు మోసానికి గురైనప్పుడు ఎక్కువగా ఫీలవుతారు. తమలో తామే బాధపడతారు. తాము నమ్మిన వారే మోసం చేసినందుకు ఎక్కువగా బాధపడతారు. అదే విషయాన్ని తలచుకుంటూ ఎక్కువ రోజులు గడుపుతారు. చాలా రోజులు విచారంగా ఉంటారు.

మిధన రాశి..

మిధన రాశి..

ఈ రాశి వారిని ఎవరైనా మోసం చేస్తే వీరు దాన్ని చాలా బాగా కవర్ చేసుకుంటారు. అసలు తమ లైఫ్ లో ఎలాంటి తప్పు జరగలేదన్నట్టు ఉంటారు. ఎందుకంటే వీరికి జరిగింది విని ఎవరైనా సానుభూతి వ్యక్తం చేయడం వీరికి ఇష్టం ఉండదు. అంతేకాదు వీరి విషయం తెలుసుకుని ఇతరులు బాధపడటం వీరికి ఇష్టముండదు.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు రిలేషన్ షిప్ లో మోసానికి గురైతే తమ మాటలను ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికే చెప్పాలనుకుంటారు. తాము మోసపోయినప్పుడు చాలా ఎక్కువగా అనుభవిస్తారు. ఈ విషయాన్ని మనసులో దాచుకుని కుమిలిపోతారు. ఆ విషయాన్ని అస్సలు మరచిపోలేరు. అయితే అలాంటి తప్పు మరోసారి జరగకుండా చాలా జాగ్రత్తపడతారు.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు ఎవరి చేతిలో అయినా మోసపోతే.. చాలా కోప్పడతారు. వ్యక్తిగతంగా వీరు బలంగా ఉండటం వల్ల పైకి ధైర్యంగానే కనబడతారు. కానీ తమకు జరిగిన మోసం గురించి చాలా బాధపడతారు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు మోసం జరిగినప్పుడు చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతారు. పైగా ఎవరైతే మోసం చేస్తారో.. వారికి వారి రూట్లోనే వెళ్లి బుద్ధి చెప్పాలనుకుంటారు. అప్పుడు కూడా వారు మాట వినకపోతే.. వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక ప్లాన్ కూడా రెడీ చేస్తారు.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు రిలేషన్ షిప్ లో మోసపోతే చాలా ఎక్కువగా బాధపడతారు. అయితే తమకు జరిగిన మోసం గురించే ఆలోచిస్తూ సమయాన్ని వేస్ట్ చేయరు. దాన్ని ఎంత త్వరగా మరచిపోయేందుకు వీలుంటే.. అంత త్వరగా దాన్ని పక్కనబెట్టి ముందుకు సాగడం గురించి ఆలోచిస్తారు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు మోసం జరిగితే మాత్రం అస్సలు తట్టుకోలేరు. వీరిని మోసం చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునేంత వరకు నిద్రపోరు. వీరిని మోసం చేసిన వారిని క్షమించాలంటే.. వీరికి చాలా సమయం పడుతుంది. అయితే వారికి తగిన బుద్ధి చెప్పేందుకు మాత్రం రెడీగా ఉంటారు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు ఎవరి చేతిలో అయినా మోసపోతే, చాలా సమయం ఆవేదన చెందుతారు. అయితే ఆ మోసం మళ్లీ జాగ్రత్తపడతారు. అంతేకాదు జరిగిన దాని గురించి తలచుకుంటూ బాధపడటం వల్ల ప్రయోజనం లేదని గుర్తించి, ఇతర పనుల్లో మునిగిపోతారు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు మోసానికి గురైతే, దాన్ని ఎంత త్వరగా మరచిపోవాలనేందుకు ఉన్న మార్గాలన్నీ అన్వేషిస్తారు. అందుకోసం ఏమి చేయాలో అది చేసేస్తారు. ముఖ్యంగా వేరే పనుల్లో మునిగిపోతారు. కొత్త అలవాట్లను అలవర్చుకుంటారు. కొత్త భాష నేర్చుకుంటారు. వారు చేయగలిగినదంతా చేసి దీన్ని మరచిపోతారు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు మోసానికి గురైతే వీరి గుండె బద్దలైనంత పనవుతుంది. ఇలాంటి వారికి వీరు గట్టిగా స్పందిస్తారు. కొన్నిసార్లు ఎక్కువ బాధపడతారు లేదా ఎక్కువ కోపం తెచ్చుకుంటారు. మోసం జరగడం వల్ల వీరు ప్రత్యేకంగా భావిస్తారు. ఈ విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోరు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు ఎవరి చేతిలో అయినా మోసపోతే చాలా భావోద్వేగానికి గురవుతారు. చాలా ఎక్కువగా బాధపడతారు. అయితే వీరిని మోసం చేసిన వారు క్షమించమని అడిగితే మాత్రం, అస్సలు ఆలోచించకుండా వారిని వెంటనే క్షమిస్తారు.

Story first published: Monday, June 28, 2021, 10:38 [IST]
Desktop Bottom Promotion