For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలా చేస్తే.. మీకు నచ్చిన అమ్మాయి వయసుతో పని లేకుండా పడిపోతుందట...!

|

ఈ లోకంలో చాలా మంది మగవారు ప్రేమలో పడినా.. ప్రేమించాలనుకున్నా.. తమ కంటే వయసులో తక్కువగా ఉండే అమ్మాయిలను ఎంపిక చేసుకుంటారు. అలాంటి వారితోనే తమ ప్రేమ సంబంధం సాఫీగా సాగుతుందనుకుంటారు.

అయితే అదంతా ఒకప్పుడు.. ఇప్పుడు ప్రేమకు వయసుతో పెద్దగా పని లేదంటున్నారు కొందరు పురుషులు. ప్రస్తుతం సామాన్యనుల నుండి సెలబ్రెటీల దాకా చాలా మంది అబ్బాయిలు తమ కన్నా వయసులో పెద్దవారైనా పర్వాలేదంటున్నారు. ఈరోజుల్లో ప్రేమ సంబంధానికి.. పెళ్లి సంబంధానికి చిన్నా.. పెద్ద తేడాలను పెద్దగా పట్టించుకోవడం లేదు.

తమ మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే చాలు.. ఏజ్ తో ఏ మాత్రం పని లేకుండా ప్రేమాయణంలోకి అడుగు పెట్టేస్తున్నారు. కొందరు సెలబ్రిటీలైతే ఏకంగా ఏడడుగులు వేశారు. ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ నుండి ఇంకా ఎందరో ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.

వీరిని ఆదర్శంగా తీసుకొని కొందరు మగాళ్లు తమ కన్నా ఏజ్ ఎక్కువగా ఉండేవారితో వివాహ సంబంధాన్ని ఏర్పరచుకోవాలని భావిస్తున్నారట. మీరు కూడా అలానే ఆలోచిస్తుంటే.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ విశేషాలేంటో చూసేద్దాం రండి...

కపుల్స్ ఆ కార్యాన్ని అకస్మాత్తుగా అవాయిడ్ చేసేందుకు గల కారణాలేంటో తెలుసా...

అందంగా ఉన్నావంటే..

అందంగా ఉన్నావంటే..

సాధారణంగా ఒక మహిళ వయసు పెరిగే కొద్దీ వారి అందం తగ్గిపోతుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఏజ్ ఎక్కువతున్నా.. నీ అందం మరింత పెరిగిపోతుందని.. నీ సౌందర్య రహస్యమేంటి అనే మాటలు వారిని సంతోషపడేలా చేస్తాయట. ఇలాంటి పొగడ్తలను వారు బాగా ఇష్టపడతారట. వయసు పెరిగినా కూడా తాము ఇంకా అందంగా ఉన్నామని భావిస్తారట. ఆమెలో ఇంకా అందం తగ్గలేదని గుర్తించాలని కోరుకుంటారట.

సులభంగా దగ్గరవ్వాలంటే..

సులభంగా దగ్గరవ్వాలంటే..

మీ మనసుకు నచ్చిన అమ్మాయికి ఏజ్ ఎక్కువగా ఉందని మీరు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. మీరు వారిని నిత్యం పొగుడుతూ ఉంటే.. వారే మీకు సులభంగా దగ్గరవుతారట. ముఖ్యంగా వారు చేసే ప్రతి పనిలో అనునిత్యం ఏదో ఒక స్పెషాలిటీని కనిపెట్టి పొగిడితే చాలు.. వయసు గురించి వారు అస్సలు ఆలోచించరట. మీకు వారు అందంగా కనిపిస్తున్నారనే విషయం మాత్రం వారికి అర్థమైతే చాలంటున్నారు నిపుణులు.

ప్రపోజ్ చేయగానే..

ప్రపోజ్ చేయగానే..

మాములుగా అయితే మీ కంటే ఏజ్ లో తక్కువగా ఉండే వారికి మీరు ప్రపోజ్ చేస్తే.. వారు వెంటనే సమాధానం చెప్పరు. పైగా వారు రిప్లై ఇవ్వడానికి మిమ్మల్ని వారి వెంట తెగ తిప్పుకుంటారు. బోలెడంత సమయం వేస్ట్ చేస్తారు. అదే మీ కంటే ఏజ్ లో ఎక్కువగా ఉండే వారైతే ఇలాంటివి అస్సలు చేయరట. వారు ఏ విషయం నేరుగా చెప్పేస్తారట. మీరు నచ్చితే నచ్చారని.. లేదంటే లేదని చెప్పేస్తారు.. అంతేకానీ రోజులు, నెలల కొద్దీ సాగదీయరు. అందుకే కొన్ని సందర్భాల్లో పెద్దవారిని ప్రేమించడం తప్పేం కాదంటున్నారు నిపుణులు.

రొమాన్స్ తర్వాత ఇలా మాట్లాడితే.. మీ బంధం మరింత బలపడుతుందట...!

నిజాయితీగా ఉంటే..

నిజాయితీగా ఉంటే..

చాలా మంది అమ్మాయిలు తమకన్నా వయసులో చిన్న వారితో రిలేషన్ షిప్ కొనసాగించేందుకు బాగా ఇష్టపడతారట. వీరు రిలేషన్ షిప్ లో చాలా నిజాయితీగా ఉంటారట. వీరు మోసం చేసే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుందట. అయితే మీరు కూడా వారితో రిలేషన్ షిప్ లో చాలా నిజాయితీగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే వారు కూడా రిలేషన్ షిప్ లో లాయల్టీగా ఉండేవారిని బాగా ఇష్టపడతారట.

నమ్మకం కలిగిస్తామని..

నమ్మకం కలిగిస్తామని..

మీ కంటే వయసులో ఎక్కువగా ఉండే మహిళలను మీరు ప్రేమిస్తే.. మీరు వారికి భవిష్యత్తు గురించి నమ్మకం కలిగిస్తామని భరోసా కల్పించాలట. అది ఏ విషయంలోనైనా తోడుగా ఉంటామని హామీ ఇవ్వాలట. అప్పుడు వారితో మీ లైఫ్ చాలా హ్యాపీగా గడిచిపోతుందట.

అవి చేయకూడదట..

అవి చేయకూడదట..

చాలా మంది తమకన్నా ఏజ్ ఎక్కువగా ఉండే వారిని పెళ్లి చేసుకున్నప్పుడు లేదా ప్రేమలో ఉన్నప్పుడు పదే పదే వారి వయసు గుర్తు చేయడం వంటివి చేస్తుంటారట. మరి కొందరు నీవు అచ్చం మా అమ్మలా ఉన్నావని.. నీ చర్మం రోజురోజుకు మెరుగవుతోందని అని చెప్పకూడదట. ఎందుకంటే ఇలాంటి విషయాలు వారికి చిరాకు తెప్పిస్తాయట. అందుకే వారి వయసుని పదే పదే గుర్తు చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

తన మాట వినాలి..

తన మాట వినాలి..

చాలా మంది అమ్మాయిలు భావోద్వేగ విషయాలకు ఎక్కువగా ఫీలవుతారు. అందుకే వారికి సంబంధించిన ప్రతి విషయం భావోద్వేగాలతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వారు మీకు నచ్చని విషయాలు చెబుతున్నా మీరు జాగ్రత్తగా వినాలి. తాను చెప్పే విషయాలన్నీ శ్రద్ధగా వింటున్నందుకు ఆమె చాలా సంతోషిస్తుందట. ఇలా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య అనుబంధం ఆటోమేటిక్ గా పెరిగిపోతుందట.

ఎలాంటి సమస్యా ఉండదు..

ఎలాంటి సమస్యా ఉండదు..

చాలా మంది పురుషులు తమ కంటే ఏజ్ లో ఎక్కువగా ఉండే వారిని పెళ్లి చేసుకుంటే వారు తమ కంటే చాలా బాగా ఆలోచిస్తారని, వారికి చాలా విషయాల్లో అనుభవం ఉంటుందని.. కాబట్టి వారితో ఎలాంటి సమస్యలు రావని నిపుణులు సూచిస్తున్నారు. వీరు ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా వాటికి తట్టుకుని నిలబడ గల సామర్థ్యం వీరిలో ఉంటుందట. కాబట్టి ఇలాంటి వారితో రిలేషన్ షిప్ లో ఎలాంటి సమస్యా ఉండదని భావిస్తారట.

English summary

How to Attract an Older Girl in Telugu

Here we are discussing about the how to attract an older girl in Telugu. Have a look
Story first published: Monday, September 20, 2021, 15:13 [IST]