For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ టైంలో అక్కడ మూడ్ రావాలంటే... ఇలా ట్రై చేయండి...

|

రతి క్రీడ అంటే కొందరు పురుషులు కేవలం శారీరక కలయికగానే భావిస్తారు. అయితే మహిళలకు మాత్రం అదొక మానసిక సంఘర్షణ. వారు ఆ కార్యాన్ని రెండు మనసుల కలయికగా భావిస్తారు.

అయితే అదే అసలు వాస్తవం. కానీ అందరూ రతి క్రీడ గురించి అలాగే ఆలోచిస్తారని అనుకోవడం చాలా తప్పు. ముఖ్యంగా మగవారు, ఆడవారికి రతి క్రీడ విషయంలో అనేక భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అనేక అధ్యయనాల్లో మగవారి కంటే ఆడవారికే కోరికలు ఎక్కువని తేలినప్పటికీ.. ఆ విషయాన్ని వారు నేరుగా బయటపెట్టరు. పడకగదిలో ఎవరి ఇష్టాలు వారివి.

కానీ సాధారణంగా కొందరు స్త్రీలకు, పురుషులకు, ఇద్దరికీ నచ్చే విషయాలు కొన్ని ఉంటాయి. ఇవి ప్రాంతాలు, వయసుతో సంబంధం లేనంతగా ఉంటాయి. మీకు పడకగదిలో ఇదే మొదటి కలయిక అయితే మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. మీరు ఇదివరకే సీరియస్ రిలేషన్ షిప్ లో ఉంటే బెడ్ రూమ్ లో మీ ప్రవర్తన ఇలా ఉండేలా చూసుకోండి.

అప్పుడే మీ భాగస్వామి పడకగదిలో మంచి మూడ్ లోకి వచ్చేస్తారు. అప్పుడే మీరు ఆ కార్యంలో అవలీలగా రెచ్చిపోవచ్చు. ఇంతకీ భాగస్వామికి మూడ్ తెప్పించడానికి ఏమి చేయాలి.. మీ భాగస్వామి లైంగిక భావాలను ఉత్తేజపరిచేందుకు మీరు చేయాల్సిన పనులేంటో మీరే చూడండి.

ఈ సంకేతాలు మీ భాగస్వామిలో కనిపిస్తే.. తను ఇంకొకరితో...!

రీజన్ తెలుసుకోండి..

రీజన్ తెలుసుకోండి..

మీ భాగస్వామి పడకగదిలో హుషారుగా ఉండటం లేదా? అయితే అలా ఎందుకు ఉంటున్నారనేందుకు రీజన్ తెలుసుకోండి. ఎందుకంటే తను రతి క్రీడకు సంబంధించి మానసిక స్థితిలో లేడని మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకు గల కారణాలను మీరు కనుగొంటే.. మీ భాగస్వామిని లైంగిక మూడ్ లోకి తీసుకురావడం, శారీరకంగా వారిని ఆకట్టుకోవడం చాలా సులభమవుతుంది.

కోరికలను రేకేత్తించడం..

కోరికలను రేకేత్తించడం..

మీ భాగస్వామికి లైంగికంగా ప్రేరేపించడానికి మరో సులభమైన మార్గం ఏంటంటే.. తనతో సన్నిహితంగా ఉంటూ.. తన చెవుల్లో ఏదైనా గుసగుసలాడటం మరియు పడకగదిలో బెడ్ పై తను ఏమి ఆశించారో.. అది మీరిచ్చే ప్రయత్నం చేయాలి. అలాగే తను మీ నుండి ఏమి ఆశించవచ్చో తనకు తెలియజేయండి. ముఖ్యంగా తనలో లైంగిక కోరికలు పెరిగేందుకు తనకు సెక్సీ మెసెజెస్ మరియు సెక్సీ ఫొటోలను పంపండి.. అలా తనను రొమాంటిక్ మూడ్ లోకి తెచ్చేయండి.

సెక్సీ డ్రస్..

సెక్సీ డ్రస్..

మీ భాగస్వామికి పడకగదిలో మూడ్ లోకి సులభంగా రప్పించాలంటే.. మీరు సెక్సీ డ్రస్ ధరించాలి. తను ఆ డ్రస్సులో మిమ్మల్ని చూడగానే హత్తుకునేలా ఉండాలి. మీ భాగస్వామి ప్రతిరోజూ ఒకే డ్రస్సులో చూస్తూ మీపై ఆసక్తి తగ్గించుకుంటే.. మీరు ఇలా సెక్సీ డ్రస్ ట్రై చేయండి. ముఖ్యంగా వదులుగా ఉండే దుస్తులను ధరించండి. అప్పుడు పడకగదిలో తను మన్మథుడిలా రెచ్చిపోతాడు.

మగువలు అలాంటి మగాళ్లతోనే ఎందుకని ఎక్కువగా గడపాలనుకుంటారో తెలుసా...

రోల్ ప్లే..

రోల్ ప్లే..

పడకగదిలో భార్యభర్తలిద్దరూ అప్పుడప్పుడు ఇలాంటి రోల్ ప్లే ప్రయత్నించాలి. ఇందులో ఏం తేడా ఉంటుందని అనుకుంటున్నారా? ఇందులోనే మస్తు మజా వస్తుందని మగవారి ఫీలింగ్. ఒక్కసారి వారి బట్టలు మీరు వేసుకుని.. మీ బట్టలు వారు వేసుకుని, ఒకరి రోల్ మరొకరు చేయాలని వారు కోరుకుంటూ ఉంటారు. మీరు తనలా మారడమే కాదు.. కాస్త బోల్డ్ గా వ్యవహరిస్తూ తను ప్రతిరోజూ ఎలా అయితే ఆధిపత్యం చేస్తుంటాడో.. అలా మీరు ప్రయత్నించడం వల్ల మీకు మంచి ఫలితం వస్తుంది.

మీరే లీడ్ తీసుకోండి..

మీరే లీడ్ తీసుకోండి..

సాధారణంగా లైంగిక కార్యంలో పాల్గొనేటప్పుడు పురుషులే ఎక్కువగా లీడ్ తీసుకుంటూ ఉంటారు. వారే అజమాయిషీ చెలాయిస్తుంటారు. అయితే మీ భాగస్వామి మిమ్మల్ని ఆకర్షించేందుకు మగవారి కోసం వేచి ఉండకండి. ఈసారి మీరే ఒకడుగు ముందుకు వేసి మీరే లీడ్ తీసుకోండి. దీని వల్ల తన మానసిక స్థితి ఎంత త్వరగా మారుతుందో.. తను ఎంత త్వరగా మూడ్ లోకి వస్తాడో మీరే చూడండి.

సెక్సీ మసాజ్..

సెక్సీ మసాజ్..

మీరు మీ ప్రియుడిని పడకగదిలో ఆకర్షించడానికి ఇలా కూడా ట్రై చేయొచ్చు. మీ భర్త మానసిక స్థితిని మార్చడానికి, మీరు సెక్సీ మసాజ్ చేయండి. ముఖ్యంగా మసాజ్ చేసే సమయంలో సెక్సీ దుస్తులను ధరించాలి. అప్పుడే మీ భర్త నుండి మీరు ఒక రకమైన ఆకర్షణ గురించి తెలుసుకుంటారు. అలాగే మీరు ఆ కార్యం గురించి తన చెవిలో గుసగుసలాడొచ్చు.

కలిసి స్నానం..

కలిసి స్నానం..

మీ భర్తను మూడ్ లోకి తీసుకురావడానికి మరో మార్గం ఏంటంటే.. మీరిద్దరూ కలిసి బాత్ రూమ్ లో స్నానం చేయడం. ఇలా చేయడం వల్ల తను ఆశ్చర్యపోతారు. దీని వల్ల మీ ఇద్దరిలో కోరికలు పెరుగుతాయి. దీంతో మీరిద్దరూ ఆ కార్యంలో పాల్గొంటారు.

English summary

How to Get Your Man in the Mood for Romantic Night

Here we are talking about the how to get your man in the mood for romantic night. Read on
Story first published: Tuesday, June 8, 2021, 16:30 [IST]