For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Marriage Tips: పెళ్లికి ముందు అందరికీ ఈ టెన్షన్ ఉంటుందట.. దాన్ని ఎలా అధిగమించాలో ఇప్పుడే తెలుసుకోండి...

పెళ్లికి ముందు ఎదురయ్యే ఈ ఆందోళనలను ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

వివాహం(Marriage) అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎంతో ప్రత్యేకమైన రోజు. మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన సంప్రదాయంలో పెళ్లిళ్లు జరుగుతాయి.

How to handle your pre wedding anxieties in Telugu

చాలా చోట్ల పద్ధతులు ఒకే మాదిరిగా ఉన్నా.. ప్రతి ఒక్కరి ప్లానింగ్ చాలా విభిన్నంగా ఉంటుంది. అయితే పెళ్లికి ముందు ఎంత ప్లానింగ్ వేసుకున్నా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి అనుకోని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. ముఖ్యంగా వివాహానికి ముందు చాలా ఆందోళన మొదలవుతుంది.

How to handle your pre wedding anxieties in Telugu

ఆఖరి నిమిషంలో ఏవేవో ఇబ్బందులు రావడం అనేది చాలా కామన్ గా జరుగుతూ ఉంటుంది. మనం అనుకునేది ఒకటైతే.. జరిగేవి మరొకటిగా ఉంటాయి. పెళ్లికి ముందు వధువు, వరుడు మదిలో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. ఎందుకంటే తమ జీవితం మలుపు తిరగబోయేది వివాహంతోనే. మరో వ్యక్తితో కలిసి కొత్త జీవితం ప్రారంభించేది కూడా ఈ వివాహ తంతుతోనే.

How to handle your pre wedding anxieties in Telugu

అయితే పెళ్లి కాబోతుందనే సంతోషం వారిలో నిండినప్పటికీ.. మరోవైపు చాలా విషయాల పట్ల ఆందోళన ఉంటుంది. ఈ సందర్భంగా వివాహానికి ముందు ఎదురయ్యే సాధారణ సమస్యలు ఏంటి.. వాటిని ఎలా అధిగమించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మీ ప్రియుడిలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీతో 'ఆ కార్యానికి'ఆసక్తి చూపకపోవచ్చు..!మీ ప్రియుడిలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీతో 'ఆ కార్యానికి'ఆసక్తి చూపకపోవచ్చు..!

వాస్తవాలను అంగీకరించాలి..

వాస్తవాలను అంగీకరించాలి..

మీరు వివాహానికి ముందు కొత్తగా మారేందుకు ప్రయత్నించడం ఏ మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా ఇదివరకు ఎలా ఉండేవారో అలాగే ఫ్రీగా ఉండాలి. ముఖ్యంగా మీలోని ఫీలింగ్స్ అణిచివేయాలని భావిస్తుంటే.. దానికి బదులుగా మీరు వాటిని గుర్తించాలి. ఇలాంటి పరిస్థితులను మరియు వాస్తవికతను అంగీకరించాలి. కాబట్టి మీ మనసు చెప్పిన మేరకు నడుచుకోండి. మీ గురించి మీరు నిజాయితీగా ఉండండి. మీరు చాలా విషయాల్లో పరిణితి చెందిన తర్వాతే.. మీ సందేహాలను అంగీకరించండి.

ఒత్తిడి సమయంలో..

ఒత్తిడి సమయంలో..

వివాహం దగ్గర పడుతున్న కొద్దీ చాలా మంది వధూవరులలో ఏదో తెలియని టెన్షన్ స్టార్టవుతుంది. అలాంటి సమయంలో ఏవైనా చిన్న చిన్న తప్పుడు చేయడం అనేది సహజం. అయితే మీరు ఏవైతే అనుకున్నారో.. అవి అలా జరగకపోతే అస్సలు కంగారు పడకండి. వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. మీకు సహాయపడే కొన్ని బ్యూటీ టిప్స్ పై టైమ్ కేటాయించండి. ఇలాంటి పనుల వల్ల మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

విరామం అవసరమైతే..

విరామం అవసరమైతే..

మీరు వివాహ వేడుకలో బిజీగా ఉండి.. మీకు విరామం అవసరమైతే.. ఒకరోజు సెలవు తీసేసుకోండి. ముందుగా మీ కోసం మీరు శ్రద్ధ వహించండి. ముఖ్యంగా కొన్ని మంచి సినిమా సీరిస్ లను చూడండి. కొన్ని రుచికరమైన రెసిపీలను ఉడికించాలి లేదా తాజాగా మరియు యాక్టివ్ గా ఉండేందుకు ఎక్సర్ సైజ్ చేయండి.

marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?

యోగా చేయండి..

యోగా చేయండి..

వివాహానికి ముందు యోగా చేయడం ద్వారా కండరాల సడలింపు మరియు ధ్యాన పద్ధతులు ఫాలో అవ్వడం వల్ల మీరు ఆందోళన చెందుతున్న విషయాల నుండి ఉపమశనం లభిస్తుంది. ఇది మీ మనస్సు మరియు శరీరాన్ని విశ్రాంతి తీసుకునేలా చేస్తుంది. అంతేకాదు అప్పటి నుండి కొంత సమయం వరకు వివాహ ఆందోళన గురించి అస్సలు ఆలోచించరు. ఇలాంటివి మీ మొత్తం ఒత్తిడి స్థాయిలను సాధ్యమైనంత మేరకు తగ్గిస్తుంది.

సరైన సూచనలు..

సరైన సూచనలు..

పెళ్లి అంటేనే కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఎంతో మంది మీ చుట్టూ చేరి మిమ్మల్ని తెగ ఇబ్బంది పెడుతుంటారు. అయితే ఇలాంటి సమయంలో మీరు ఒంటరితనం కావాలని కోరుకోవాల్సిన అవసరం లేదు. మీ వివాహ ఆందోళన తీవ్రమైన సమస్యగా ఉంటే, మీరు వారి దగ్గరి నుండి సరైన సూచనలు పొందొచ్చు. ఇతరుల మార్గదర్శకత్వం తీసుకొని దానికి అనుగుణంగా వ్యవహరించాలి.

సోషల్ మీడియాలో లాగవుట్..

సోషల్ మీడియాలో లాగవుట్..

పెళ్లికి ముందు మీరు సోషల్ మీడియా నుండి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఎందుకంటే మీ ఆకర్షణీయమైన, మ్యారేజ్ వైబ్స్ సోషల్ మీడియాలో స్పష్టంగా కనబడాలంటే.. మీ పోస్టులు మరియు కథలు చాలా స్పష్టంగా కావాలంటే మీరు సోషల్ మీడియాలో లాగవుట్ అవ్వాలి. మీకు ఏవైనా ఇతర ఆలోచనలుంటే.. కొంతకాలం వరకు లాగవుట్ చేసి ప్రస్తుతానికి మీ ఫోకస్ మొత్తం మ్యారేజ్ పైనే పెట్టాలి. ఎందుకంటే సోషల్ మీడియాను కంటిన్యూగా వాడితే మీరు ప్రతికూల ఆలోచనల వైపు మీ ద్రుష్టిని మరల్చొచ్చు.

మగువలలో అందంతో పాటు అవి ఉంటేనే మగాళ్లు ఈజీగా అట్రాక్ట్ అవుతారట...!మగువలలో అందంతో పాటు అవి ఉంటేనే మగాళ్లు ఈజీగా అట్రాక్ట్ అవుతారట...!

అదో రకం ఫీలింగ్..

అదో రకం ఫీలింగ్..

పెళ్లికి ముందు రోజు చాలా మంది బ్యాచ్ లర్ పార్టీ ఇస్తుంటారు. అప్పటి నుండి డ్రింక్ మానేయాలని భావిస్తారు. అయితే మీరు మాత్రం ఎందుకు దూరంగా ఉండాలి? మీరు ఒకటి తీసుకోవచ్చు. కానీ లిమిట్స్ లో ఉండాలి సుమా..

దేవుడిని తలచుకుని..

దేవుడిని తలచుకుని..

పెళ్లి రోజు అనేది మీ లైఫ్ లో ప్రత్యేకం కాబట్టి.. మీరు ఆ రోజును మొదట దేవుడి ప్రార్థన లేదా పూజ చేయడంతో ప్రారంభించండి. ఉదయాన్నే లేచి స్నానం పూర్తి చేసుకుని కాసేపు పూజ, ధ్యానం చేయండి. ఈ సమయం మీకు కంగారు తగ్గిపోయి.. మీరు వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేలా చేస్తుంది.

వారికి దగ్గరగా..

వారికి దగ్గరగా..

మీ వివాహ వేడుకలో మీకు నచ్చిన వ్యక్తులు, ముఖ్యంగా చిన్నారులను మీకు దగ్గరగా ఉంచుకోండి. వారు మిమ్మల్ని ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉండేలా చేస్తారు. ఎందుకంటే ఎలాంటి కార్యక్రమమైనా వాళ్లుంటే సందడే సందడిగా ఉంటుంది. వాళ్లను చూస్తుంటే మీకూ ఉత్సాహం ఉప్పొంగుతుంది. మీ ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది.

ఇది మరచిపోవద్దు..

ఇది మరచిపోవద్దు..

కళ్యాణం వంటి కమనీయ కార్యక్రమం చాలా పెద్దది. ఈ వేడుకలో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏవేవో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు వాటిని చూసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరికొందరికి పెళ్లి సమయంలో తినడానికి కూడా టైమ్ దొరకదు. కాబట్టి మీరు వివాహానికి ముందే లైట్ గా ఏదైనా తినడం చాలా మంచిది.

దాని గురించి థింక్ చేయొద్దు..

దాని గురించి థింక్ చేయొద్దు..

మనలో చాలా మంది వివాహం అనగానే.. ఆ తర్వాత జరిగే తతంగం గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అదే శోభనం గురించి తెగ కంగారు పడుతూ ఉంటారు. కానీ వరుసగా పెళ్లి కార్యక్రమాలతో మీరు అలసిపోయి ఉంటారు కాబట్టి శోభనం రోజు చాలా మంది ఈ విషయం గురించి ఆలోచించరు. కాబట్టి మీరు కూడా కంగారు పడాల్సిన పనిలేదు. మీరు కూాడా దాని గురించి కంగారు పడొద్దు.

English summary

How to handle your pre wedding anxieties in Telugu

Here we are talking about the How to handle your pre-wedding anxieties. Read on.
Desktop Bottom Promotion