Latest Updates
-
రోజూ 20 నిమిషాలు చాలు.. ఈ సింపుల్ యోగాసనాలతో మీ రోజు మారిపోతుంది.! -
2వ తరగతి హిందూ విద్యార్థికి 'కల్మా' హోంవర్క్..హైదరాబాద్ లో ముస్లిం టీచర్ చేసిన పనికి.. -
కుబేరుడి అనుగ్రహం కావాలా? ఆఫీసులో ఈ దిశగా కూర్చుంటే అదృష్టం మీ వెంటే! -
గాలిలో అధిక తేమ బీపీని పెంచుతుందా.?.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలివే.! -
సున్నుండలు ఇలా కొత్తగా చేయండి..సూపర్ టేస్ట్ తో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్! -
భోజనం తర్వాత ఈ పనులు చేస్తున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే! -
ఈనాటి దాంపత్యానికి ఆదర్శంగా నిలిచే ఆనాటి ప్రేమకథలు.. ఒక్కో కథలో ఒక్కో పాఠం.! -
కర్ణాటక ఫేమస్ మెంతి బాత్.. ఈ స్టైల్ లో చేస్తే టేస్ట్ వేరే లెవెల్..లంచ్ బాక్స్ కి సెట్! -
చిన్న కాయ.. పెద్ద ప్రయోజనాలు: వాక్కాయలతో ఈ లాభాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
ఉద్యోగులు రోజంతా యాక్టివ్గా ఉండాలంటే.. ఈ పది ఆరోగ్య సూత్రాలను పాటించాల్సిందే.!
Impress Girls: అమ్మాయిలను ఎలా ఇంప్రెస్ చేయాలో తెలుసా?
ఎదుటివారిని ఆకర్షించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికి స్త్రీ, పురుషుల లింగభేధానికి సంబంధం లేదు. ఎదుటి వారు మన పట్ల ఆకర్షితులు కావాలని చాలా మంది కోరుకునేది. వారు మనకు ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటారు. ముఖ్యంగా అపోసిట్ జ
Impress Girls: ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు. ఒక్కొక్క వ్యక్తిది ఒక్కో తీరు. ప్రవర్తన, మాట, చూపు, అర్థం చేసుకునే విధానం ఇలా చాలా అంశాలు ప్రత్యేకంగా ఉంటాయి. శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా విభిన్నంగా ఉంటారు. ఇందులో ఎదుటి వారికి నచ్చేవి, నచ్చనివి కూడా ఉంటాయి. అయితే కొత్త బంధానికి దారులు పరచుకోవాలన్నా, ఏదైనా బంధం ఏర్పడాలన్నా, ఎదుటి వారికి, ఎదుటి వారిలో కొన్ని అంశాలు మనకు నచ్చాలి.

ఎదుటివారిని ఆకర్షించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికి స్త్రీ, పురుషుల లింగభేధానికి సంబంధం లేదు. ఎదుటి వారు మన పట్ల ఆకర్షితులు కావాలని చాలా మంది కోరుకునేది. వారు మనకు ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటారు. ముఖ్యంగా అపోసిట్ జెండర్ విషయంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడు అమ్మాయిలను ఎలా ఇంప్రెస్ చేయాలో, ఎలా చేస్తే వాళ్లు ఇంప్రెస్ అవుతారో ఇప్పుడు చూద్దాం.

ఆత్మవిశ్వాసం:
ఆత్మవిశ్వాసం మెండుగా ఉండే వ్యక్తులు అందంగా కనిపిస్తారు. కాన్ఫిడెన్స్ తో ఉన్న వ్యక్తుల ముఖంలో తెలయని నిగారింపు కనిపిస్తుంది. మంచి డ్రెస్, గ్రూమింగ్ చేయడం వల్ల కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు. ఆత్మవిశ్వాసాన్ని ఆభరణంగా ధరించాలని పెద్దలు చెప్పేది అందుకే.

మాటతీరు:
మాటతీరు ఎప్పుడైనా మనల్ని మరో మెట్టు పైకి ఎక్కిస్తుంది. అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడటం అనేది గొప్ప వరం. ఇది కొందరిలో పుట్టుకతో వస్తుంది. మరికొందరిలో ప్రాక్టీస్ తో వస్తుంది. ఎదుటి వారు మన మాటలతో హర్ట్ కాకుండా, ఆహ్లాదంగా ఫీల్ అయ్యేలా ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనేది అందరికీ తెలిసిన సామెత. దానిని గుర్తుంచుకోవాలి.

రూపం:
ఫిజికల్ ఫిట్ నెస్ ఎంతో ముఖ్యమైనది. అది ఆరోగ్యపరంగానే కాకుండా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. మంచి ఫిజిక్ మెయింటైన్ చేసే వారి పట్ల ఎవరికైనా సానుకూల దృక్పథం కలుగుతుంది. మంచి కంఫర్ట్ ను ఇచ్చే డ్రెస్సులు వేసుకోవడం వల్ల అట్రాక్టివ్ గా మాత్రమే కాకుండా సౌకర్యంగా కనిపిస్తారు.

గ్రూమింగ్:
గ్రూమింగ్ అంటే హెయిర్ సెలూన్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అందం అనగానే అదేదో ఆడవాళ్ల సబ్జెక్ట్ అనుకోవద్దు. మంచిగా కనిపించడం ప్రతి ఒక్కరికీ అవసరమే. గడ్డం పెంచడం ఎవరికైనా ఇష్టమే. దానిని ఎప్పటికప్పుడు సరిగ్గా కట్ చేస్తూ గ్రూమింగ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎవరిని చూసినా మొదట కనిపించేది ముఖమే కాబట్టి కొద్దిగా నీట్ గా కనిపించేందుకు సమయం వెచ్చించండి.

అభినందన
మహిళలను అభినందిస్తే వాళ్లు చాలా సంతోషిస్తారు. ఇతరుల చేత అభినందనలు అందుకోవడం అమ్మాయిలకు ఎంతో ఇష్టమైన అంశం. తరచూ అభినందించే వ్యక్తుల పట్ల అమ్మాయిలు ఇష్టాన్ని చూపిస్తారు. అభినందనలతో అలా అమ్మాయిలను ఇంప్రెస్ చేయవచ్చు.

సలహా తీసుకోవడం
వారికేం తెలుసు అనుకోవద్దు. అమ్మాయిలను, మహిళలను తమ అభిప్రాయాలు అడగడం వారి నుండి సలహా తీసుకోవడం వల్ల వాళ్లు చాలా పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉంటారు. వాళ్లు తమ అభిప్రాయాలకు, సూచనలకు గౌరవం ఇస్తున్నారని మహిళలు అనుకుంటారు.

కంట్లో చూస్తూ మాట్లాడటం
అందమైన అమ్మాయిలను, మహిళలను పై నుండి కింది వరకు స్కాన్ చేస్తారా చాలా మంది పురుషులు. ఆమె ఎంత అందంగా ఉంటే, సంభాషణపై దృష్టి పెట్టడం, వాళ్లు చెప్పే విషయాలపై శ్రద్ధ వహించడం అంత కష్టం అవుతుంది. అయితే ఏదో ఒక విషయం గురించి వాళ్లు చెబుతున్నప్పుడు అది ముఖ్యమైన విషయం అయితే మీ చూపులో వారి ముఖం వైపు కాకుండా మరో దగ్గర ఉంటే వారి పట్ల నెగెటివ్ ఇంప్రెషన్ పడుతుంది.



Click it and Unblock the Notifications