Latest Updates
-
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.!
రొమాన్స్ లేని వివాహ జీవితాన్ని ఊహించొచ్చా? అది లేకుండా హ్యాపీగా ఉండొచ్చా?
మీ రిలేషన్ షిప్ లో రొమాన్స్ లేకుండా హ్యాపీగా ఉండగలరా? లేదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరు ఔనన్నా.. కాదన్నా వివాహం తర్వాత రతి క్రీడలో పాల్గొనడం అనేది చాలా కీలకం. పెళ్లి తర్వాత సెక్స్, రొమాన్స్ ఉన్నంత వరకు ఆ వివాహ జంట ఆనందంగా ఉంటుంది. ఈ విషయాన్ని చాలా మంది అంత సులభంగా నమ్మరు.

కొందరేమో రొమాన్స్ ఒక్కటే లైఫ్ కాదు.. అది లేకుండా మిగతా జీవితాన్ని హ్యాపీగా గడపొచ్చు అని చెబుతుంటారు. అది కొంతవరకు నిజమే. కానీ రొమాన్స్, రతిక్రీడ లేకుండా వివాహ జీవితాన్ని సాఫీగా కొనసాగించడం అనేది అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు.

అసలు భార్యభర్తల మధ్య కలయిక లేని జీవితం ఊహించలేమని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆలుమగల మధ్య ఆ కార్యం జరగకపోతే.. వారిద్దరూ అస్సలు రొమాన్స్ చేసుకోకపోతే.. వారి జీవితం హ్యాపీగా ఉంటుందా? లేదా అనే విషయాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం...

ఆ కార్యంలో పాల్గొనాలని..
పెళ్లికి ముందు ప్రతి ఒక్క మగాడికి ఆ కార్యంలో ఎప్పుడెప్పుడు పాల్గొందామా.. అనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అయితే పెళ్లి తర్వాత మాత్రం మొదట్లో ఆనందంగా అనిపించినప్పటికీ.. కాలం గడిచేకొద్దీ ఆ కార్యంపై ఆసక్తి తగ్గిపోతుంది. అయితే కొన్నిసార్లు భర్తకు ఆ కార్యంలో పాల్గొనాలని ఉన్నా.. భార్య అవాయిడ్ చేయడం.. లేదా తనకు కావాలన్నప్పుడు.. భర్త దూరంగా ఉండటం వంటివి జరుగుతూ ఉంటాయి.

అలాంటి రిలేషన్స్..
అలాంటి సమయాల్లోనే భార్యలు లేదా భర్తలు ఇద్దరూ వివాహేతర సంబంధాల వైపు చూసే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వారు కోరుకున్న సమయంలో వారి భాగస్వామి తీర్చని సమయంలో అలాంటి కోరికలను ఇతరుల నుండి ఆశిస్తారు. అందుకే కొత్త వ్యక్తులకు దగ్గరవుతారు. వారితోనే తమ కోరికలు తీర్చుకునేందుకు ప్రయత్నిస్తారు.

కుటుంబాల్లో సమస్యలు..
ఇలాంటి విషయాలు కుటుంబసభ్యులకు తెలియడం వల్ల ఎన్నో ఫ్యామిలీ గొడవలు వస్తుంటాయి. అయితే ఇలా తెలియకుండా చాలా మందే తమ సంసారాలను గుట్టుగా కానిచ్చేస్తున్నారు.

పనికి ప్రాధాన్యత..
మనలో చాలా మంది వివాహం అయిన తర్వాత వ్యక్తిగత పని, ఆఫీసు పనికి తొలి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇలా చేస్తూ రతి క్రీడ గురించి అస్సలు ఆలోచించరు. అలాంటప్పుడు ఒకరిపై ఒకరికి సహజంగానే కోపం, చిరాకు, ఆందోళన వంటివి పెరిగిపోతాయి. ఇలాంటి సమయాల్లోనే ఇద్దరి మధ్య అనేక విషయాల్లో విభేదాలు పెరుగుతాయి. అందుకే రతి క్రీడ, రొమాన్స్ లేకుండా వివాహ జీవితాన్ని హ్యాపీగా ఉండాలనుకోవడం కేవలం భ్రమే.

ఒత్తిడి పెరుగుతుంది..
ప్రతి ఒక్క మనిషికి గాలి, నీరు, ఆహారం, నిద్ర ఎంత అవసరమో.. సెక్స్ కూడా అంతే అవసరమని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ మీరు సరైన సమయానికి ఎలా అయితే నిద్రిస్తారో.. వివాహ జీవితంలోనూ సరైన సమయానికి మీరు సెక్స్ కార్యంలో పాల్గొనాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే మీపై ఒత్తిడి పెరుగుతుంది.

అనారోగ్య సమస్యలు..
మీరు వివాహం అయిన తర్వాత ఆ కార్యంలో పాల్గొనకపోతే అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు ఏ పనిని ఉత్సాహంగా చేయలేరు. దేన్నీ సంపూర్ణంగా ఆస్వాదించలేరు. మీకు ప్రతి విషయంలో చిరాకు, టెన్షన్ పెరిగిపోతాయి.

రొమాన్స్ తో లాభాలే..
అందుకే మీరు మీ భాగస్వామితో ఈ కార్యంలో సరైన సమయానికి పాల్గొంటే మీరు అనారోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టొచ్చు. మీపై పెరిగే ఒత్తిడిని సులభంగా జయించొచ్చు. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు, సెక్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. చూశారు కదా.. సెక్స్ వల్ల ఎన్ని లాభాలున్నాయో.. ఇకనైనా మీరు పని, డబ్బు అంటూ పరుగెత్తకుండా ఆ కార్యంలో ఒకసారి పాల్గొని చూడండి... అందులోని మజా ఏంటో మీకే తెలుస్తుంది.



Click it and Unblock the Notifications