For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నసపెట్టే కొందరు బంధువుల రాకను అడ్డుకోవడం ఎలా...

నసపెట్టే కొందరు బంధువుల రాకను అడ్డుకోవడం ఎలా...

|

వివాహాలు, పుట్టినరోజు పార్టీలు, పదవీ విరమణలు, గ్రాడ్యుయేషన్లు, సెలవులు, వంటి ప్రత్యేక సందర్భాలు ఆనందం కలిగించేలా ఉండాలి కానీ, భయంతో కాదు. కొందరు బంధువుల అనుచిత ప్రవర్తనలు, భాధించే మాటలు, నాటకాలు ఆ ఈవెంట్ సంతోషాలనే పక్కదారి పట్టించవచ్చు. అటువంటి బంధువుల ప్రవర్తన గురించి మీరు ఆందోళన చెందుతుంటే, వారి రాకను ముందుగానే నివారించడం మంచిదిగా ఉంటుంది. కానీ, మీరు మీ ఆహ్వానాన్ని తిరిగి వెనక్కి తీసుకునే ముందు, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉంటుంది. ముఖ్యంగా, వారితో హృదయపూర్వకంగా సంభాషణ చేయడం అవసరంగా ఉంటుంది. ఈ సంభాషణలు, వారి ఆలోచనా విధానాలను, పరిస్థితులను అవగాహన చేసుకోడానికి సహాయం చేస్తాయి. అదనంగా, ఇదివరకు వారి ప్రవర్తనకు గల కారణాలను తెలుసుకోడానికి కూడా సహాయపడుతుంది.

How to Uninvite Annoying Relatives

ఒకవేళ ఉన్నపళంగా మీరు మీ ఆహ్వానాన్ని రద్దు చేసినట్లయితే, మీరొక "చెడ్డ వ్యక్తి" గా ముద్రవేయబడతారని గుర్తించండి. మీరు ఇంతకు ముందు పంపిన ఆహ్వానాన్ని రద్దు చేస్తుంటే, ఇతరులు కూడా మీపరంగా చెడుగా ఆలోచించే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా ఇదివరకే ఆహ్వానం బయటకు వెళ్లినట్లైతే, దాన్ని ఉపసంహరించుకోవడమనేది ఎన్నటికీ మర్యాదగా అనిపించుకోదు. ఇది జగమెరిగిన సత్యం. మీ నిర్ణయం, అవతలి వ్యక్తి మనస్తాపానికి కూడా కారణంగా మారొచ్చు. అంతేకాకుండా, ఇతర బంధువులతో మీ సంబంధాలు దెబ్బతినడానికి కూడా కారణంగా ఉంటాయి.

మీరు చేసే ఈ పనివల్ల కలిగే లాభనష్టాలు :

మీరు చేసే ఈ పనివల్ల కలిగే లాభనష్టాలు :

ఇలా మీరు మీ బంధువుల నుండి ఆహ్వానాన్ని ఉపసంహరించుకోవడంలో కొన్నిప్రతికూల ఫలితాలను ఎదుర్కొనవలసి ఉండొచ్చు. కాబట్టి, అలా చేయడానికి ముందుగా మీ కారణాలను క్షుణ్ణంగా, జాగ్రత్తగా పరిశీలించాలి. ఆహ్వానించని పక్షంలో, తర్వాత జరిగే పరిణామాలేమిటి అన్న అంశాల మీద అవగాహన తప్పనిసరి.

మీకు ఇటీవల ఆ వ్యక్తితో విభేదాలు ఉన్నాయా? ఏదైనా భావోద్వేగ కారణాల వల్ల ఆ ఆహ్వానాన్ని ఉపసంహరించుకోవాలని చూస్తున్నారా? వారిని అనుమానించడానికి, మీదగ్గర ప్రత్యేకంగా ఏమైనా కారణం ఉందా? అటువంటి ప్రశ్నలన్నింటికీ మీదగ్గర సమాధానాలు ఉండాలి.

ఆ వ్యక్తి గతంలో చేసిన చర్యల మీద అవగాహన:

ఆ వ్యక్తి గతంలో చేసిన చర్యల మీద అవగాహన:

ముందుగా ఆ వ్యక్తి కార్యక్రమానికి హాజరు అవడం కారణంగా, ఉండే లాభనష్టాల జాబితాను రూపొందించండి. ఉదాహరణకు కొందరు సాంప్రదాయక కార్యక్రమాలలో కూడా తాగి, గోల చేస్తుంటారు. అవి ఒక్కోసారి తీవ్రతరంగా, దీర్ఘకాలిక గొడవలుగా కూడా మారుతుంటాయి. ఇదివరకు ఆ వ్యక్తి ఇటువంటి చర్యలకు పాల్పడి ఉంటే, వీలైనంత వరకు అతన్ని దూరంగా ఉంచడమే మంచిది. ఇక్కడ మీదగ్గర ప్రత్యేకమైన కారణం ఉండాలని మర్చిపోకండి. అంతేకాకుండా, పాత గొడవలను పాయింట్ చేయడం, చిల్లర దొంగతనాలు చేయడం వంటి చర్యలు కూడా కార్యక్రమాన్ని పక్కదారి పట్టిస్తుంటాయి. అటువంటి వ్యక్తులను కార్యక్రమాలకు వీలైనంతవరకు రానివ్వకపోవడమే మంచిది. కానీ ఇచ్చిన ఆహ్వానాన్ని తిరిగి తీసుకోలేరని మాత్రం గుర్తుంచుకోండి. కొన్ని సందర్భాల్లో, ఆహ్వానాన్ని తిరిగి తీసుకోకపోవడమే ఉత్తమమైన చర్యగా ఉంటుంది.

సలహా అడగడం:

సలహా అడగడం:

బంధువుల ఆహ్వానాలను ఎంచుకోవడమనేది, కొద్దిగా కష్టమైన పనే అని చెప్పవచ్చు. ఈ ఆహ్వానాలను తేలికగా తీసుకోకూడదు. మీరు విశ్వసించగల సన్నిహితుడు, బంధువుతో ఈ ఆహ్వానాల గురించి చర్చించడం మంచిది. క్రమంగా ఆ వ్యక్తిని మీ కార్యక్రమంలో చేర్చుకోవడం గురించి వారి అభిప్రాయాన్ని తీసుకోండి.

మీరు ఇలా కూడా చెప్పవచ్చు, "వారిని కార్యక్రమానికి ఆహ్వానించడం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాను. గత వారం, లేదా కార్యక్రమంలో వారు చేసిన చర్యల గురించి నేను విన్నాను, అటువంటి చర్యలను నా ఫంక్షన్లో పునరావృతం అవడం నేను కోరుకోవడం లేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? అని.

నిజానికి, కొందరి చర్యలు ఊహాతీతంగా ఉంటాయి. పుట్టినరోజు కార్యక్రమాన్ని సంతోషంగా జరుపుకోవాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి, చివరికి ఆ వ్యక్తే భాదపడేలా ప్రవర్తించడం, దాడి చేయడం వంటివి చేస్తుంటారు. క్రమంగా తర్వాతికాలంలో పుట్టిన రోజు అంటేనే ఆ వ్యక్తి భయపడేలా చేస్తుంటారు. దేనికైనా ఒక పరిమితి అంటూ ఉంటుంది. అంతేకాకుండా, కొందరు కార్యక్రమాలను అడ్డం పెట్టి, వీళ్ళ మనోభావాలకు వ్యతిరేకంగా గొడవలు పడడం, మందు పార్టీలు ఏర్పాటు చేయడం వంటివి చేస్తుంటారు. అవి సంబంధాల పరంగా కూడా తీవ్ర ప్రభావాలను చూపిస్తుంది. ఇటువంటి వ్యక్తులను మరొక ఫంక్షన్ కు పిలవడానికి ఎవరు మాత్రం సాహసించగలరు.

ప్రత్యామ్నాయ ఆలోచనలు..

ప్రత్యామ్నాయ ఆలోచనలు..

గతంలో కన్నా వారి ప్రవర్తనలో ఏదైనా సానుకూల మార్పులు ఉన్నాయేమో పరిశీలించడం., ఆరోజు అలా ప్రవర్తించడానికి గల కారణాలు తెలుసుకుని, వాటికి అనుగుణంగా మీ కార్యక్రమంలో జాగ్రత్తలు తీసుకోవడం., ఒకవేళ వారు అతిగా మద్యపానం చేస్తున్నట్లు గమనిస్తే, దానిని నివారించడం. లేదా కార్యక్రమ విశిష్టత విధానాలను వివరించి, అర్ధమయ్యేలా చెప్పడం. వేరొక సంబంధంలేని వ్యక్తులను ఉదాహరణగా తీసుకుని, వీరికి అలా ఉండకూడదు అన్నట్లు వివరించి చెప్పడం., వంటివాటి ద్వారా మీరు పరిస్థితిని చక్కదిద్దగలరు.

ఉదాహరణకు, మీరు వారికి ఇలా చెప్పవచ్చు, "మీ మాటలు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయని చెప్తున్నారు. వీలయితే, అటువంటి మాటలను మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీరంటే నాకు గౌరవం, నామీద మీకు అటువంటి గౌరవం ఉంటే, ఫంక్షన్ సక్సెస్ అయ్యేందుకు మీ సహాయాన్ని ఇవ్వండి ప్లీజ్", అని. కొన్ని సందర్భాలలో తగ్గి వ్యవహరించడంలో ఎటువంటి తప్పులేదు.

క్షమాపణలు చెప్పవద్దు:

క్షమాపణలు చెప్పవద్దు:

"నన్ను క్షమించండి" అని చెప్పడమనేది, మీరు తప్పు చేశారు అన్న సందేశాన్ని పంపుతుంది. అంతేకాకుండా, వారి చెడు ప్రవర్తనకు మీరు యాజమాన్యాన్ని తీసుకున్నట్లుగా ఉంటుంది. ఒకవేళ ఈ వ్యక్తి, మిగిలిన అందరి ఆలోచనలకు భిన్నంగా ఉన్నప్పుడు, వారిని ఆహ్వానిస్తే, ఫంక్షన్ కి వచ్చిన ఇతర అతిథుల అసంతృప్తికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి, తప్పనిసరిగా ఈ విషయంలో నిర్ణయం తీసుకోకతప్పదు.

"నన్ను క్షమించండి" అని చెప్పడానికి బదులుగా "నేను మీ భావాలను బాధపెట్టకూడదనుకుంటున్నాను" అని చెప్పండి. మీ నిర్ణయం మీద మీరు నిలబడి ఉన్నారని చూపిస్తూనే మీ ఉద్దేశం మంచిగా ఉందని చూపండి.

వారి ప్రతిచర్యలు ప్రతికూలంగా ఉంటే, మీరు ప్రశాంతతను కోల్పోకండి. ఆహ్వానించబడకపోవడం వారికి కొంత అవమానకరంగా ఉంటుంది, కాబట్టి అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఆ కోపంలో వారు కొంచం ప్రతికూలంగా అసహనాన్ని ప్రదర్శించవచ్చు. కాబట్టి వారి మాటల్ని వ్యక్తిగతంగా తీసుకోకండి. మీ మద్దతును అందించండి.

"మీరు కలత చెందడం నాకిష్టం లేదు, మిమ్మల్ని బాధపెట్టాలని అనుకోలేదు, కానీ పరిస్థితుల ప్రకారం తప్పడం లేదు" అని కూడా అనవచ్చు.

మీ అతిధుల జాబితా పరిమితమని వివరించండి:

మీ అతిధుల జాబితా పరిమితమని వివరించండి:

కొన్ని సందర్భాల్లో, బంధువులను అనుకోకుండా ఆహ్వానించి ఉండవచ్చు. ఫేస్‌బుక్‌లో ఈవెంట్‌ను సెటప్ చేసేటప్పుడు కూడా, అనుకోకుండా వారి పేరును ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. లేదా, మీరు వారి సమక్షంలోనే పంక్షన్ గురించి మాట్లాడి ఉన్న కారణంగా, వారు ఆహ్వానించబడినట్లుగా భావించి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ, మీరు వారి రాకను ఇష్టపడకపోతే, ఫంక్షన్ సజావుగా సాగేందుకు నిర్ణయాలు తీసుకోక తప్పదు.

"ఈవెంట్ కోసం పేజీని సెటప్ చేసేటప్పుడు, మీ పేరును అనుకోకుండా క్లిక్ చేశాను. మీరు రావడం నిజంగా మాకు ముఖ్యమే, కాని అతిథుల జాబితాను 15 మంది లోపే ఉంచాలి. ఇలా జరిగినందుకు నన్ను క్షమించండి." అని కూడా చెప్పవచ్చు.

మీ తరపున మాట్లాడిన వారి కోసం క్షమాపణ చెప్పండి:

మీ తరపున మాట్లాడిన వారి కోసం క్షమాపణ చెప్పండి:

మీ అనుమతి లేకుండా ఆహ్వానాలను పొడిగిస్తే, ఆ అజాగ్రత్తకు క్షమాపణ చెప్పండి. మీరు ఇలా కూడా చెప్పవచ్చు, "గత వారం మీతో పార్టీ గురించి ప్రస్తావించానని వారు నాతో చెప్పారు, అతను అలా చేసుండకూడదు. మా అతిథుల జాబితా కొంత ప్రత్యేకమైనది. అందుకు నన్ను క్షమించండి."

అదేవిధంగా, మరో రెండు పొరపాట్లు జరిగినట్లుగా, వారు అదే అపోహలో ఉన్నట్లుగా కూడా ఉదాహరణలను క్రియేట్ చేయడం మంచిది.

కొంతమంది కుటుంబ సభ్యుల సంబంధించిన ఫంక్షన్ అని, తమను పిలవకపోయినా వెళ్లాలని భావిస్తుంటారు. అది వారి అభిమానం కూడా కావొచ్చు. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వారిని తప్పించాల్సిన అవసరం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అటువంటి సందర్భాలలో ఆలస్యం చేయకుండా వారితో ముందస్తుగా వ్యవహరించడం మంచిది.

ఇతర అతిధుల రాక మీద ప్రభావం:

ఇతర అతిధుల రాక మీద ప్రభావం:

ఒక్కోసారి ఒక్కోరి రాక, కొందరి అసహనానికి కారణంగా ఉంటుంది. అటువంటి సందర్భాలలో, ఫంక్షన్ సజావుగా సాగేందుకు కొన్ని నిర్బయాలు తప్పనిసరిగా ఉంటాయి. పొరపాటున వారు, ఫంక్షన్ హాజరైతే, వారంటే గిట్టని వారు వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి పరిస్థితి గురించి వారికి పూర్తిగా వివరించడం మంచిది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

How to Uninvite Annoying Relatives

Weddings, birthday parties, retirements, graduations, holidays and other special occasions should bring you joy, not dread. An annoying guest can threaten the enjoyment of an event by acting inappropriately or starting drama. If you are concerned about the behavior of annoying relatives, you may choose to disinvite them. Before you take back an invitation, carefully consider the ramifications of doing so. Then, have a sincere conversation with your relative. In addition, it may help to know how to manage common scenarios that may arise with annoying relatives.
Desktop Bottom Promotion