For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలా చేస్తే... మీ మాజీ లవర్ మిమ్మల్ని వెతుక్కుంటూ మళ్లీ వచ్చేస్తారట...

|

మనలో చాలా మంది ఏదో ఒక సందర్భంలో ప్రేమలో పడుతూ ఉంటారు. తమ ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి దాకా తీసుకెళ్లి జీవితాంతం కలిసి ఉండాలని ఆశిస్తారు. కానీ అందరికీ సాధ్యం కాదు..

ఏవేవో కారణాల వల్ల కొందరు తమ ప్రేమకు మధ్యలోనే బ్రేకప్ చెప్పేస్తారు. తమ ప్రియుడిని లేదా ప్రేయసి నుండి విడిపోయినప్పుడు చాలా బాధపడతారు. ఆ బాధ మాటల్లో వర్ణించలేనిది.

ఆ మధురమైన క్షణాలను మరచిపోలేనివిగా ఉంటాయి. అయితే కొందరు వ్యక్తులు మాత్రం తమ మాజీ ప్రేయసిని లేదా మాజీ ప్రియుడిని తిరిగి తమ జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటారు. అందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తారు. అయితే అదంతా తేలికమైన విషయం కాదు. ఎందుకంటే కొన్ని బ్రేకప్ లు శాశ్వతంగా దూరాన్ని పెంచుతాయి. అయితే మీ మాజీ లవర్ ను కావాలనుకుంటే.. వారితో కలిసి జీవితం పంచుకోవాలనుకుంటే.. కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం రండి...

మీ మాజీ లవర్ నుండి అనుకోకుండా అలాంటి మెసెజ్ వస్తే...!మీ మాజీ లవర్ నుండి అనుకోకుండా అలాంటి మెసెజ్ వస్తే...!

వీటిని ఉపయోగించుకోండి..

వీటిని ఉపయోగించుకోండి..

మీరు మాజీ ప్రియుడు లేదా మాజీ ప్రేయసితో కలిసి మళ్లీ లైఫ్ ను ఎంజాయ్ చేయాలని భావిస్తుంటే.. మీరు ముందుగా చేయాల్సింది సోషల్ మీడియాను సరిగ్గా ఉపయోగించుకోవడం. ముందుగా మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను గుర్తు చేస్తూ.. మీరిద్దరూ కలిసి గడిపిన క్షణాలను నెమరువేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయండి. అలాగే తన నుండి విడిపోయినప్పటి నుండి ఎక్కువ ఆనందంగా ఉన్నట్టు.. మీ స్నేహితులతో సంతోషంగా గడుపుతున్నట్టు.. మీ కుటుంబ సభ్యుల్లతో సరదాగా గడుపుతున్న పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండండి. దీంతో వారికి కాస్త బాధగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వారు మిమ్మల్ని అనవసరంగా దూరం చేసుకున్నామా అనే ఆలోచనలో పడతారు. కాబట్టి మీరు తిరిగి మళ్లీ కలుసుకోవడానికి సోషల్ మీడియాను ఇలా వాడండి. దీని వల్ల మీ రిలేషన్ మళ్లీ స్టార్ట్ కావొచ్చు.

రివర్స్ లో ట్రై చేయండి..

రివర్స్ లో ట్రై చేయండి..

సాధారణంగా మీ మాజీ లవర్ మిమ్మల్ని ఏడిపించేందుకు ఏదో ఒక ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. మీ దగ్గర నుండి ఎలాంటి రిప్లై వస్తుందా అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే మీరు రివర్స్ గేర్ లో వెళ్లాలి. అంటే మీ ఎక్స్ పెట్టిన పోస్టుకు మీరు ఎలాంటి రెస్పాన్స్ మరియు రియాక్షన్ ఇవ్వకండి. వాటిని ఇగ్నోర్ చేస్తున్నట్టు నటించండి.

ఎన్నో ప్రశ్నలు..

ఎన్నో ప్రశ్నలు..

మీరు ఇలా చేయడం వల్ల మీరు తను పెట్టిన పోస్టుకు ఎందుకని రిప్లై లేదా రియాక్షన్ ఇవ్వలేదు.. ఎందుకని మీరు పెట్టిన ఫొటో, వీడియోలను పట్టించుకోవడం లేదు.. ఒకవేళ చూసినా ఇగ్నోర్ చేస్తున్నారా అన్న ప్రశ్నలో వారి మదిలో మెదలుతాయి. దీంతో వారు మీ గురించి ఎక్కువగా ఆలోచించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి. దీని వల్ల మీరు తిరిగి కలుసుకునేందుకు.. మళ్లీ ప్రేమలో పడేందుకు ఛాన్స్ రావొచ్చు.

మీ శ్రీవారు మీరు చెప్పిన మాట వినాలంటే....!మీ శ్రీవారు మీరు చెప్పిన మాట వినాలంటే....!

మీ రూపాన్ని మెరుగుపరచుకోండి..

మీ రూపాన్ని మెరుగుపరచుకోండి..

ఇదే కాలంలో మీరు మీ రూపంపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. మీరు మీ అందాన్ని మరింత పెంచుకుంటే.. వారు చాలా జలసీగా ఫీలవుతారు. ఇందుకోసం మీరు జిమ్ కు వెళ్లి ఫిట్ గా మారాలి. అదే సమయంలో మీ మేకప్ పై మరింత ఫోకస్ పెట్టాలి. ఇలా చేయడం వల్ల వారు మిమ్మల్ని మరోసారి కలవాలని.. తిరిగి మీతో ట్రావెల్ చేయాలని భావించే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారిని ఎందుకు మిస్ చేసుకున్నామా అని ఫీలవుతారు. కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి.

అవి మానేయండి..

అవి మానేయండి..

కొన్ని సందర్భాల్లో బ్రేకప్ తర్వాత మాజీ ప్రియుడిని లేదా మాజీ ప్రియురాలి గురించి పట్టించుకోవడం మానేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సమయంలో మీరు కూడా వారికి, మీకు కామన్ ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లడం వంటివి తగ్గించండి. ముఖ్యంగా వారు ఏదైనా పార్టీలకు, ఫంక్షన్లకు పిలిస్తే దూరం తగ్గించుకోండి. మీరు వారికి ఎక్కువగా కనిపించకుండా ఉండండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే దూరం పెరిగేకొద్దీ.. ఆకర్షణ అనేది కచ్చితంగా పెరుగుతుంది. దీంతో మీరు మళ్లీ ప్రేమలో పడే అవకాశం వస్తుంది.

అటెన్షన్ చూపిస్తారు..

అటెన్షన్ చూపిస్తారు..

మీరు వారి నుండి దూరమైనందుకు ఏ మాత్రం బాధలేనట్టు కనిపించండి. వారిని మిస్ అవుతున్నట్టు మీ ఫేసులో ఎలాంటి ఫీలింగ్ కనిపించొద్దు. మీరు చాలా హ్యాపీగా ఉన్నట్లు వారికి తెలిసేలా చేయండి. అలా చేయడం వల్ల మీరు చాలా స్ట్రాంగ్ అని.. మీరు సింగిల్ గా ఉన్నా కూడా వారు మీపై ఎక్కువగా అటెన్షన్ చూపిస్తారు. ఇలా చేయడం వల్ల తిరిగి మీరు మీ మాజీ ప్రియుడు లేదా ప్రేయసితో మళ్లీ ప్రేమను కంటిన్యూ చేయొచ్చు.

కలిసి ఉండొచ్చు..

కలిసి ఉండొచ్చు..

పైన చెప్పిన చిట్కాలు పాటిస్తే.. మీరు మీ మాజీ ప్రియుడు లేదా ప్రియురాలితో తిరిగి మళ్లీ ప్రేమను కంటిన్యూ చేయొచ్చు. చాలా మంది తమ బ్రేకప్ తర్వాత తిరిగి కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అవి కొన్నిసార్లు ఫలిస్తాయి.. మరికొన్ని సార్లు వికటిస్తాయి. నిజంగా మీరు వారితో కలిసి పోవాలని.. వారి ప్రేమ నిజంగా కావాలనుకుంటే.. ఈ చిన్న చిట్కాలను ఫాలో అవ్వండి. మీకు కచ్చితంగా ఫలితం వస్తుంది. మీ లైఫ్ హ్యాపీగా సాగుతుంది.

English summary

How You Can Get Your Ex Back in Telugu

Here we are talking about the how you can get your ex back in Telugu. Take a look