Latest Updates
-
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి!
Hug Day 2023 Wishes : చెలితో ఓ కౌగిలి.. ఎన్నటికీ మరచిపోని సుఖాన్నందించే జాబిలి..!
హగ్ డే సందర్భంగా మీ ప్రియమైన వారిని మాటలతో కౌగిలిలోకి లాగేయండి.
''తనతో తొలి కౌగిలి.. కమ్ముకొచ్చే మబ్బుల లోగిలి.. కొంటె కోరికలను స్వాగతించే వాకిలి..ఎంత ఆరగించినా తీరని ఆకలి.. ఎన్నటికీ మరచిపోని సుఖాన్నందించే జాబిలి.. చెలితో ఓ కౌగిలి.. కుర్రాళ్ల మనసులో ఏదో గిలి గిలి.. మీ అందరికీ మీ ప్రియుడు/ప్రియురాలితో రిలేషన్ పెరగాలి''.. అని కోరుకుంటూ అందరికీ 'Hug Day' శుభాకాంక్షలు.

వాలెంటైన్ వీక్ లో భాగంగా ఫిబ్రవరి 12వ తేదీన ప్రతి ఏటా హగ్ డే జరుపుకుంటారు. వాలెంటైన్ వీక్ లో ఈ హగ్ డేకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈరోజున ప్రేమలో ఉండేవారు ఒకరినొకరు మనస్ఫూర్తిగా కౌగిలించుకుంటారు.

ఇలా కౌగిలించుకునే కౌగిలింత ప్రేమను ప్రేమగా వ్యక్తం చేస్తుంది. మనకు సంతోషం వచ్చినా.. బాధ కలిగినా.. మనసుకు నచ్చిన వ్యక్తితో షేర్ చేసుకోవడం కంటే అద్భుతమైన మార్గం మరొకటి లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆ సమయంలో మనకిష్టమైన వారిని కౌగిలించుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. అయితే కరోనా లేదా ఇతర కారణాలతో మీ భాగస్వామికి ఈ ఏడాది దూరంగా ఉంటే, ఈ సందేశాలు, కోట్స్, ఇమెజెస్, వాల్ పేపర్లతో వారిని మైమరిపించండి...

తొలి కౌగిలి..
‘తనను తొలిసారి హత్తుకున్న క్షణం..
నాకు తొలి కౌగిలితో వచ్చిన అనుభూతిని..
నేను మాటల్లో చెప్పలేను..
అది నిజంగా ఓ అద్భుతం..
హ్యాపీ హగ్ డే

హగ్ తర్వాత..
‘హగ్ చేసుకున్న తర్వాత..
నా కళ్లలోకి చూడకు..
నాకు చాలా సిగ్గేస్తుంది'
హ్యాపీ హగ్ డే..

మధురమైన భావన..
‘తనను ప్రేమగా హత్తుకున్నప్పుడు..
నా పట్ల తనకున్న ప్రేమను అనుభవించా..
అదొక అద్భుతమైన భావన..
హ్యాపీ హగ్ డే

కౌగిలిలో కరిగిపోయేలా..
‘ప్రేమించిన ప్రేయసి కౌగిలిలో
కరిగిపోవడాన్ని మించిన ఆనందం
ఇంకేముంటుంది చెప్పండి'
హ్యాపీ హగ్ డే

భావోద్వేగం నిండుగా..
‘నేను నా ప్రియురాలిని తొలిసారి..
కౌగిలించుకున్నప్పుడు నా మనసులో..
ఎలాంటి ఆలోచనలు రాలేదు..
నా మనసు పూర్తిగా భావోద్వేగంతో
నిండిపోయింది.. నాకు చాలా
హాయిగా అనిపించింది..
హ్యాపీ హగ్ డే

తనపై ప్రేమ..
‘నేను నా ప్రియురాలిని హత్తుకున్నప్పుడు..
తనపై నాకెంత ప్రేమ ఉందో తెలపాలనుకుంటా'
హ్యాపీ హగ్ డే

ఎంత కేర్..
‘నా కౌగిలింత ద్వారా తనపై ఎంత
శ్రద్ధ ఉందో ఆమెకు తెలపాలనుకుంటా'
హ్యాపీ హగ్ డే

ఎన్నో భావాలు..
‘తన కౌగిలిలో ఉన్నప్పుడు ఎన్నో భావాలు..
అవి మరచిపోలేని మధుర క్షణాలు..
మాటల్లో వర్ణించలేని విషయాలు..
ప్రేమను అనుభవించే భావనలు'
హ్యాపీ హగ్ డే

గట్టిగా హత్తుకుంటే..
‘తనను వెనుక నుండి
గట్టిగా హత్తుకోవాలని.. తన పట్టులాంటి కురులు..
పూల సుగంధాల మధ్య తనను అలాగే హత్తుకుని
ఉండాలపించేది'
హ్యాపీ హగ్ డే

జీవితాంతం..
‘నీ చేతిలో నా చేయి వేసి..
గట్టిగా హత్తుకుంటే.. ఆ కౌగిలిలో
జీవితాంతం హాయిగా గడిచిపోయినా పర్వాలేదు'
హ్యాపీ హగ్ డే



Click it and Unblock the Notifications