For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘త్వరలో నా పెళ్లి... కానీ నా ఎక్స్ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ...’

|

ఓ యువతి కాలేజీ చదువుకునే రోజుల్లో తన క్లాస్ మేట్ ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.. దీంతో వారిద్దరూ కాలేజీ ముగిసేంత వరకు బాగా ఎంజాయ్ చేశారు. ప్రేమలో ఉన్నంతసేపు పార్కులు, పబ్బులు, సినిమాలకు తెగ తిరిగేశారు.

అయితే అనుకోని కారణాల వల్ల వారిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది. ఇద్దరూ ఇష్టపూర్వకంగానే విడిపోయారు. అయితే ఆ కుర్రాడు మాత్రం ఆమెను మరచిపోలేకపోయాడు. అంతలోనే ఆమెకు పెద్దలు పెళ్లిని సెట్ చేశారు.

తను కూడా త్వరలో పెళ్లి చేసుకోవడాని ఓకే చెప్పి.. వివాహ ఏర్పాట్లలో నిమగ్నమైంది. కానీ ఆ కుర్రాడు మాత్రం కాలేజీ రోజుల్లో తామిద్దరం కలిసిన వివరాలను, ఫొటోలను అందరికి తెలిసేలా చేస్తానని, తన పెళ్లికి ఆటంకం కలిగించడం ప్రారంభించాడు.

దీంతో ఆ విషయం అందరికీ ఎక్కడ తెలుస్తుందోనని.. తన పెళ్లి ఎక్కడ ఆగిపోతుందని ఆ యువతి ఆందోళన చెందుతోంది. ఇంతకీ ఎవరా యువతి.. వారి మధ్య బ్రేకప్ ఎందుకు జరిగింది.. తన సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

'నన్ను అందరూ వదిలేస్తున్నారు... నాలో ఏదైనా లోపమా...'

రెండేళ్లు డేటింగ్..

రెండేళ్లు డేటింగ్..

నా పేరు రాణి (పేరు మార్చాం). ‘నేను కాలేజీ చదువుకునే రోజుల్లో నా క్లాస్ మేట్ తో తొలుత బాగా ఫ్రెండ్ షిప్ చేశాను. మా ఇద్దరికీ తెలియకుండానే మేమిద్దరం తక్కువ టైమ్ లోనే లవ్ లో పడిపోయాం. అలా తనతో నేను రెండేళ్ల పాటు డేటింగులో ఉన్నాను.

ఇష్టపూర్వకంగా బ్రేకప్..

ఇష్టపూర్వకంగా బ్రేకప్..

అయితే మేమిద్దరం కలిసి ఉన్నప్పుడు చాలా సమయం మేమిద్దరం గొడవ పడే వాళ్లం. దీంతో మా ఇద్దరం ఇలాగే లైఫ్ ను లీడ్ చేయలేమని డిసైడ్ చేసుకున్నాం. మేమిద్దరం ఇక నుండి కలిసి ఉండలేమనే ఉద్దేశ్యంతో ఇద్దరూ ఇష్టపూర్వకంగానే బ్రేకప్ చెప్పుకున్నాం. మేమిద్దరం ఇటీవలే విడిపోయి ఎవరి బతుకు వారు బతుకుతున్నాం.

ఇంతలో నా పెళ్లి..

ఇంతలో నా పెళ్లి..

తనతో బ్రేకప్ చెప్పి, నా బతుకు నేను హాయిగా బతుకుతుంటే.. ఇంట్లో పెద్దలు సడెన్ గా పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. నేను ఓకే అంటే.. వివాహ కార్యక్రమం మొదలుపెడతామన్నారు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో.. వారు పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు.

అమ్మాయిలు ఇలా మెసెజ్ చేస్తే... మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టే...!

నా మాజీ ప్రియుడు..

నా మాజీ ప్రియుడు..

ఈ విషయం తెలుసుకున్న నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మాత్రం మాట తప్పాడు. ఇప్పుడు నేనే కావాలని మంకు పట్టు పడుతున్నాడు. త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. తననే పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఈ పెళ్లి ఎలా జరుగుతుందో అని బెదిరిస్తున్నాడు.

భయంతో ఇంట్లో చెప్పేశా..

భయంతో ఇంట్లో చెప్పేశా..

ఈ విషయం గురించి నేను మా ఇంట్లో చెప్పేశాను. దీంతో వారు వారి ఇంట్లో వెళ్లి మాట్లాడి వచ్చారు. అనంతరం తన వల్ల నాకు ఎలాంటి సమస్య ఉండదని ప్రామీస్ చేశారు. ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యిందని ఆనందించే లోపే.. నా ఊపిరి ఆగిపోయినంత పనైపోయింది.

సడెన్ గా సోషల్ మీడియాలో..

సడెన్ గా సోషల్ మీడియాలో..

నేను సోషల్ మీడియాలో పోస్టులను చూస్తుంటే.. నాకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఎందుకంటే తను నన్ను మిస్ అవుతున్నానని.. నన్ను లవ్ చేస్తున్నట్టు స్టేటస్లు పెట్టాడు. అక్కడితో ఆగకుండా తనతో క్లోజ్ గా మూవ్ అయిన ఫొటోలను కూడా పోస్ట్ చేశాడు.

కపుల్స్ కలయికలో హ్యాపీగా ఉండేందుకు ఇదొక కారణమని తెలుసా...

కాబోయే భర్తకు..

కాబోయే భర్తకు..

మరోవైపు నేను పెళ్లి చేసుకునే అబ్బాయికి ముందే ఈ విషయం గురించి వివరంగా చెప్పాను. దీనికి అతను కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అయితే తన వల్ల నా పెళ్లి సమయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయోమనని భయంగా ఉంది.. నా మ్యారేజ్ లోపే నా సమస్యకు పరిష్కారం లభించాలంటే.. ఏం చేయాలి.. నాకు విలువైన సలహాలు ఇవ్వగలరు''అని ఓ యువతి నిపుణులను సంప్రదించింది.

మద్దతు మంచిదే..

మద్దతు మంచిదే..

మీ మాజీ ప్రియుడి గురించి.. మీ ఇంట్లో వారికి, మీకు కాబోయే భర్తకు ముందే తెలియజేయడం మంచి పరిణామం. వారు మీకు మద్దతుగా ఉండటం కూడా మీకు సానుకూలమైన అంశం. అయితే రెండేళ్ల పాటు మీతో రిలేషన్ లో ఉన్న తను మిమ్మల్ని పూర్తిగా మరువలేకపోతున్నాడు. కాబట్టి తనకు చివరగా ఒక అవకాశం ఇవ్వాల్సింది.

మీతో చెప్పుకోలేక..

మీతో చెప్పుకోలేక..

ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీ మాజీ ప్రియుడు తనలోని ఫీలింగ్స్ ను మీతో చెప్పుకోలేక.. మీపై కోపంలో అలా చేస్తున్నాడు. పగ పెంచుకునే ఆలోచనలో ఉన్నాడు. అయితే మీరు ఒకసారి తనను కలిసి మాట్లాడితే కొంతవరకు కూల్ అయ్యే ఛాన్స్ ఉంది.

మార్పు రాకపోతే..

మార్పు రాకపోతే..

అప్పటికీ తనలో ఎలాంటి మార్పు రాకపోతే.. మీరు చివరగా సైబర్ టీమ్ ను సంప్రదించాలి. అయితే మీ గురించి అంతదూరం వెళ్లకూడదనుకుంటే.. ఒకసారి తనను కలిసి మాట్లాడితే.. మీ సమస్య సాల్వ్ అవ్వొచ్చు.

English summary

I Am Having Arranged Marriage, but My Ex-Boyfriend Is Try to Stalling My Marriage

Here we are talking about the, iam having arranged marriage, but my ex-boyfriend is try to stalling in marriage. Have a look