Latest Updates
-
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.!
‘తనతో కలిసి ఎగిరిపోతే ఎంతో బాగుండనిపిస్తోంది... కానీ నాకేమో..’
నేను కుర్రాళ్లకు ఎందుకని ఆకర్షితురాలినవుతున్నానో ఇప్పుడు తెలుసుకుందాం.
హాయ్ 'నా పేరు రాజి..(పేరు మార్చాం). నా వయసు 30 సంవత్సరాలు. నాకు పెళ్లయ్యింది. పిల్లలు కూడా ఉన్నారు. ఈ మధ్యన నాకు ఎవ్వరికీ ఎదురుకాని సమస్య నాకే ఎదురవుతోందా? లేదా చాలా మందికి ఇలాంటి పరిస్థితి ఎదురువుతుందా అనే విషయం అర్థం కావట్లేదు.

ఇంతకీ నా ప్రాబ్లమ్ ఏంటంటే.. నాకు పెళ్లయి.. పిల్లలు ఉన్నప్పటికీ.. వయసులో ఉండే కుర్రాళ్లను చూస్తే నాలో కోరికలు పుడుతున్నాయి. అంతేకాదు వారితో పరిచయం చేసుకోవాలని..

వారితో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని.. సరదాగా.. జాలీగా వారితో ఎంజాయ్ చేయాలని ఆశ పుడుతోంది. ఈ నేపథ్యంలోనే నాకు ఓ ఎదురింటి కుర్రాడితో పరిచయం ఏర్పడింది.

ఓ రోజు లిఫ్టులో..
మేమిద్దరం ఇంటికి చేరాలంటే లిఫ్ట్ కు చేరాల్సిందే. ఎందుకంటే మెట్లు ఎక్కేందుకు నాకు ఓపిక లేదు. అలా ఓ రోజు లిఫ్టులో ఇద్దరం కలిశాం. ఒకరినొకరు పరిచయం చేసుకున్నాం. ఇన్నిరోజులుగా ఎదురింట్లో ఉంటున్నా తనకు ఆ విషయం తెలియదని చెప్పాడు. అలా కొద్దిరోజుల్లో మంచి స్నేహితులుగా మారిపోయాం.

నెంబర్లు మార్చుకున్నాం.
ఆ తర్వాత వాట్సాప్ నెంబర్లు మార్చుకున్నాం. ఎఫ్ బి, ఇన్ స్టా అకౌంట్లలో రిక్వస్టులు కూడా పెట్టుకున్నాం. ఇద్దరూ సోషల్ మీడియాలో కూడా నిత్యం టచ్ లో ఉండేవాళ్లం. ఇక కరోనా లాక్ డౌన్ కారణంగా మేమిద్దరం బయటకు వెళ్లడం దాదాపు తగ్గించుకున్నాం. ఏదైనా అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లే వాళ్లం కాదు. అయితే మేమిద్దరం ఎదురెదురు ఇంట్లో ఉన్నప్పటికీ మేమిద్దరం ఎక్కువగా వీడియో కాలింగులో మాట్లాడుకునే వాళ్లం.

నాతో కలవాలని..
అయితే, ఈ మధ్య కాలంలో తను కొంచం విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఇటీవల ఏకంగా నాతో కలవాలనుందని నేరుగా చెప్పేశాడు. దీంతో నాకు కోపం వచ్చింది. నీ ఏజ్ ఏంటి.. నీ గేజ్ ఏంటి.. అనవసరంగా నెగిటివ్ ఆలోచనలు చేయకు అని చెడమడా తిట్టేశా..

నాలో ఏదో తెలియని అనుభూతి..
తనను నేను బాగా తిట్టినప్పటికీ.. తను చెప్పిన మాటలు నాకు ఎందుకో మంచి అనుభూతిని కలిగించాయి. అప్పటి నుండి నా మనసులో అతడి గురించి ఫీలింగ్స్ ఎక్కువయ్యాయి.. ఎందుకంటే తనంటే నాకు కూడా ఇష్టమే.

నిత్యం తనను చూడాలని..
అనునిత్యం తనను నేను చూడాలని అనిపిస్తూ ఉండేది. కానీ ఏం చేస్తాం. నాకేమో పెళ్లయ్యింది.. పిల్లలు, భర్త అందరూ ఉన్నారు. కాబట్టి అలాంటి కోరికలు కలిగినా.. నేను కంట్రోల్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఎందుకంటే నేను తప్పు చేస్తున్నాననే ఫీలింగ్ వచ్చేది.

తెలియని ఆందోళన..
అయితే తనని చూసినప్పుడల్లా నా మనసులో ఏదో తెలియని మధురమైన అనుభూతి కలిగేది. తనను చూస్తే నా కళ్లలో వెయ్యి బల్బుల వెలుగు వచ్చినట్టు అనిపించేది. అయితే అదే సమయంలో నేనేమైనా తప్పు చేస్తున్నానా అనే ఆందోళన కూడా కలుగుతుండేది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపగలరు' అని ఓ వివాహిత స్త్రీ తన సమస్యల గురించి వివరించింది.

భావోద్వేగ పరిస్థితులు..
ఇలాంటి సమస్యల గురించి నిపుణులు ఏమి చెబుతున్నారంటే.. ఇలాంటి పరిస్థితులు చాలా మందికి ఎదురవుతుంటాయి. ముఖ్యంగా భావోద్వేగ పరిస్థితులు కలగడం అనేది సహజమే. ఇలాంటి ఫీలింగ్స్ రావడం అనేది తప్పుగా భావించాల్సిన అవసరం లేదు.

ప్రతి వ్యక్తిలో..
ఇలాంటి ఫీలింగ్స్ ప్రతి వ్యక్తిలోనూ కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వయసు పెరిగిన లేడీస్ కు ఓ ఇన్ సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. తమ ఏజ్ పెరిగిపోయిందని.. తాము బ్యూటిఫుల్ గా కనిపించడం లేదని.. తమనెవరూ పట్టించుకోవడం లేదని భావిస్తుంటారు.

అలాంటి వ్యక్తులను..
ఇలాంటి సమయంలో వారి కంటే వయసులో తక్కువగా ఉండేవారిని చూసినా.. ముఖ్యంగా అందంగా ఉండే కుర్రాళ్లు ఎవరైనా తమ గురించి ఏవైనా విషయాల గురించి పొగిడితే చాలు. వారు చాలా ఆనందిస్తారు.

వారితో క్లోజ్ గా..
అలాంటి వ్యక్తులతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేందుకు ఆసక్తి చూపుతారు. అలాంటి సమయంలో మీ కాన్ఫిడెన్సు సైతం పెరిగిపోతుంది. మరో విషయమేమిటంటే.. మనకు రెస్పెక్ట్ ఇచ్చే వారంటే మనం బాగా ఇష్టపడతాం.

విలువైన వారిగా..
అంతేకాదు.. మనకు విలువ ఇస్తున్నారనే కారణంగా.. మనం కూడా వారికి చాలా ఎక్కువ విలువ ఇస్తాం. అదే సమయంలో మనం వారి ట్రాప్ లో పడే అవకాశం కూడా ఉంటుంది.

ఇవి గుర్తుంచుకోండి..
ఇక అసలు విషయానికొస్తే.. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. మీరు ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు పూర్తిగా మీ పర్సనల్ లైఫ్ ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

స్పష్టత లేదు..
మీరు మీ శ్రీవారితో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనే విషయాలను తెలియజేయలేదు. కానీ, మీరు మీ వైవాహిక జీవితంలో అంత సంతోషంగా లేరనే విషయం మాత్రం అర్థమవుతోంది. మీ కోరికలు కూడా నెరవడం లేదని అనిపిస్తోంది.

ఇతరులతో ఆ కోరికను..
అందుకే మీరు ఇతరులతో అలాంటి కోరికలను తీర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మీరు తనపై పెట్టుకున్నది కేవలం అట్రాక్షన్ మాత్రమే. అది త్వరలోనే తగ్గిపోతుంది.

ఎవరు ముఖ్యమో తేల్చుకోండి..
అయితే మీరు ఎప్పుడైతే తనతో కలవాలనే ఫీలింగ్స్ కలుగుతాయో.. మీరు అలాంటి సమయంలో మీ వైవాహిక జీవితం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వారిద్దరిలో మీ వారు ముఖ్యమా? ఆ కుర్రాడు ముఖ్యమా అనే విషయాన్ని మీరు పోల్చి చూసుకోండి.

జాగ్రత్తపడండి..
ఒకవేళ మీరు ఇప్పటికి ఆ కుర్రాడితో బాగా క్లోజ్ అయిపోయి ఉంటే, అలాంటి పరిస్థితి హద్దు మీరకుండా జాగ్రత్తపడండి. వీలైతే స్థానికంగా ఉండే మానసిక నిపుణుల సలహాలను కూడా తీసుకోండి.

ఏం చేస్తే హ్యాపీ..
మీ ఫ్యామిలీలో మీకు మంచి విలువ ఉంటే దాన్ని పోగొట్టుకోవద్దు. తాత్కాలిక ఆనందం, సుఖం కోసం శాశ్వితమైన బంధాలను తెంచుకోవద్దు. మీరు ఏం చేస్తే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుందో అనే డెసిషన్ మీరే తీసుకోండి.



Click it and Unblock the Notifications