Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
‘పెళ్లైన వ్యక్తిని ప్రేమిస్తే తప్పా? తనతో కలిసి జీవితాన్ని పంచుకోలేనా’
తను పెళ్లై పిల్లలున్న వ్యక్తిని ప్రేమించింది. తను లేకుండా బతకలేదట.
సాధారణంగా పెళ్లి చేసుకున్న వారు తమ జీవితం ఒక్కరికే అంకితమని ఫిక్సయిపోతారు. మన భారతీయ సమజాంలో కూడా ఎప్పటినుండో ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మనషులు మారిపోతున్నారు.

పెళ్లైన తర్వాత కూడా పక్కచూపులు చూస్తున్నారు. కొందరైతే పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత కూడా మరొకరితో రిలేషన్ మెయింటెన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఓ మహిళ తనే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తిని ప్రేమించింది.. అంతేకాదు తనకు పెళ్లైనా కూడా తనే కావాలంటోంది.. తను లేకుండా గడపలేనంటోంది. మరి ఆమె సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

హాయ్ 'నా పేరు కుందన(పేరు మార్చాం). మాది గుంటూరు జిల్లా. నేను ఎంఏ వరకు చదువుకున్నాను. నేను పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడ్డాను. తను లేకుండా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను. ఇది తెలిసిన నా స్నేహితులు, కుటుంబ సభ్యులు నన్ను వ్యతిరేకిస్తున్నారు. తనతో ప్రేమ విషయం గురించి తెలిసిన వెంటనే నన్ను చాలా తప్పుగా చూస్తున్నారు.

ఏడాది కాలంగా..
తను.. నేను ఓ రోజు అనుకోకుండా కాలేజీ దగ్గర కలుసుకున్నాం. సినిమాల్లో చూపినట్టుగానే ముందుగా కళ్లు కళ్లు కలిశాయి.. తర్వాత మాటలతో పరిచయం పెరిగింది.. అప్పటి నుండి ఫోన్ నెంబర్లు మార్చుకున్నాం.. రెగ్యులర్ గా టచ్ లో ఉండే వాళ్లం. అలా ఏడాది వరకు ఆనందంగా గడిపాం.

పెళ్లి గురించి తెలీదు..
అలా నేను తనతో ప్రేమలో పడిపోయాను. కానీ తనకు పెళ్లయ్యిందన్న విషయం నాకు తెలియదు. అయితే ఏడాది తర్వాత తనకు పెళ్లై, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. అప్పుడే నాకు ఆశ్చర్యమేసింది. అయితే నేను ఆగిపోవాలని అనుకోలేదు. ఎందుకంటే నేను తనతో గాఢమైన ప్రేమలో పడిపోయాను. భవిష్యత్తులో నేను కూడా విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది.

భార్యతో సమస్యలు..
తను వాళ్ల భార్యతో ఏదో సమస్యతో ఇబ్బంది పడుతున్నాడని మాత్రం తెలుసు. అలాగే వాళ్ల ఫ్యామిలీలో కూడా కొన్ని గొడవలు జరుగుతున్నాయని స్పష్టంతా తెలుసు. ఆ ఇంట్లో సంతోషం దొరకడం లేదు కాబట్టే.. తను పక్క చూపులు చూస్తున్నాడని నేను అనుకున్నాను. అందుకే తను కూడా నన్ను ప్రేమించడం మొదలుపెట్టాడు.

నా కంటే ఎక్కువగా..
నేను తనను ఎంతలా ప్రేమిస్తున్నానో.. తను నా కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే తన భార్య కన్నా నేను తనని ఎక్కువగా అర్థం చేసుకున్నాను. అయితే నా ప్రియుడు మాత్రం ఫ్యామిలీకి ప్రియారిటీ ఇచ్చేవాడు. వారిని వదిలిపెట్టి నాతో తిరిగేందుకు రమ్మంటే వచ్చేవాడు కాదు. తను బంధాలకు మంచి ప్రియారిటీ ఇస్తాడు.

ఫ్యామిలీకే ప్రాధాన్యత..
తను ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యత వారి కుటుంబానికే ఇచ్చేవాడు. వాళ్లతోనే ఎక్కువ సమయం గడిపేవాడు. వారి పిల్లలను, భార్యను బయటకు తీసుకెళ్లేవాడు. అందులో నాకేం తప్పు కనిపించలేదు. నేను తన బాధ్యతలను అర్థం చేసుకున్నాను.

తన ప్రేమను పొందుతున్నా..
అంత మంచి వ్యక్తిని ప్రేమించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే తన భార్య మాత్రం అది కోల్పోతుంది. తను సరిగ్గా చూసుకోకపోవడం వల్లే కదా.. తను నా వైపు చూపులు కలిపాడు. నాతో కలిశాడు. తిరిగాడు. అంతేకాదు తనకు విడాకులిచ్చేందుకు కూడా సిద్ధమయ్యాడు.

అందరూ వ్యతిరేకిస్తున్నారు..
ప్రస్తుతం నేను చాలా ఫ్రస్టేషన్లో ఉన్నాను. ఈ సమస్య నుండి నేను ఎలా బయటపడాలి.. నేను నా ప్రియుడితో కలిసి ఆనందంగా జీవించేందుకు ఏం చేయాలి' అని ఓ మహిళ నిపుణులను సంప్రదించింది.. అందుకు వారు ఏం సమాధానం చెప్పారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఇంకో దారి లేదా?
ఇది విన్న నిపుణులు ముందుగా తనకే ఒక ప్రశ్న వేశారు? మంచి పరిష్కారం అంటే మీరు ఏమి అనుకుంటున్నారు? సమాజానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా ఉన్న పని చేయాలనుకుంటున్నారు మీరు. తనే ఎందుకు కావాలనుకుంటున్నారు? ఇంకో మార్గం లేదనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

విసుగొచ్చిందట..
ఇందుకు తను చెప్పిన సమాధానం విని వారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తను ఇలాంటి ప్రశ్నలని ఇది వరకే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో విని విని విసుగొచ్చిందని చెప్పింది. ఆ తర్వాత తన ప్రియుడి ఏమనుకుంటున్నారని ప్రశ్నలడిగారు. అప్పుడు తను ఇలా చెప్పింది.

విడాకులకు సిద్ధం..
తన ప్రియుడు కూడా భార్యకు విడాకులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. దీంతో వారు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల గురించి చెప్పారు. ఒకవేళ మీరు తనని పెళ్లి చేసుకుంటే.. అందరి నుండి దూరంగా వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరూ మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. దీనికి మీరు రెడీగా ఉన్నారని మానసికంగా సిద్ధం కావాల్సి ఉంటుంది. అన్నింటికంటే ముందుగా తను భార్యకు విడాకులిచ్చి, ధైర్యంగా ముందుకొచ్చేలా చేస్తే.. మీకు ఎలాంటి బాధ ఉండదు. ఇలా చేయడం వల్ల తన భార్యకు కొంత బాధ కలిగినా.. మీరు హ్యాపీగా ఉండొచ్చని నిపుణులు సమాధానం ఇచ్చారు.



Click it and Unblock the Notifications











