For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బర్త్ డే రోజు బాయ్ ఫ్రెండ్ తో బెడ్ రూమ్ లో ఉండగా.. పేరెంట్స్ వచ్చారు... తర్వాత ఏం జరిగిందంటే...

డిగ్రీలో బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన నేను ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ లో చేరాను. అయితే అక్కడైనా ఎవరైనా దొరుకుతారని ఊహిస్తే.. అదేమో షార్ట్ ఫిల్మ్ కు సంబంధించినది

|

ఆమెకు చిన్నతనం నుండి సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ రంగాలలో ఉద్యోగాలు చేసే వ్యక్తులంటే ఎంతో ఇష్టం మరియు గౌరవం ఉండేది. ఆమె సినిమాలు చూస్తున్నప్పుడు వారి పాత్రలలో నటించే వారిని చూసి ఎంతో ప్రేరణను పొందేది..

I Tried Role Play for 30 Days to Save My Marriage & Heres What Happened

భవిష్యత్తులో ఎలాగైనా సరే.. సాఫ్ట్ వేర్ రంగాలలో పని చేసే వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని అప్పుడే డిసైడ్ అయ్యింది. అయితే ఆమె పెద్దయ్యాక ఆశలన్నీ ఆవిరయ్యాయి. కానీ అనుకోకుండా ఓ రోజు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. దాని వల్ల తన కలను నెరవేర్చుకుంది. ఇంతకీ ఆమెకు వచ్చిన అవకాశమేంటి? ఇంతకీ తన ఆశ నెరవేరిందా అనే విషయం తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

ఇలాంటి మెసెజ్ లు పంపిస్తే మీ భాగస్వామి మీకు ఫిదా అయిపోవాల్సిందే...!ఇలాంటి మెసెజ్ లు పంపిస్తే మీ భాగస్వామి మీకు ఫిదా అయిపోవాల్సిందే...!

ఉమెన్స్ కాలేజీలో..

ఉమెన్స్ కాలేజీలో..

నేను చిన్నప్పుడు కో ఎడ్యుకేషన్ లో చదువుకున్నప్పటికీ.. కాలేజీకి వచ్చేసరికి నేను ఉమెన్స్ కాలేజీలో చేరాల్సి వచ్చింది. అయితే నా చిన్ననాటి స్నేహితులలో ఏ ఒక్కరు కూడా సాఫ్ట్ వేర్ రంగాలకు చెందిన వారు లేకపోవడంతో నాకు చాలా కష్టంగా అనిపించింది. చాలా మంది కేవలం బ్యాంకింగ్ మరియు గ్రూప్స్ లలో అవకాశాలను పొందారు.

ఆశల్ని వదులుకున్నా..

ఆశల్ని వదులుకున్నా..

డిగ్రీలో బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన నేను ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ లో చేరాను. అయితే అక్కడైనా ఎవరైనా దొరుకుతారని ఊహిస్తే.. అదేమో షార్ట్ ఫిల్మ్ కు సంబంధించినది. అందుకే నా ఆశల్ని వదులుకున్నాను.

బాయ్ ఫ్రెండ్ గా..

బాయ్ ఫ్రెండ్ గా..

అయితే నేను పని చేసే ప్రైవేట్ కంపెనీలోనే ఓ ఆర్టిస్ట్ నాకు బాయ్ ఫ్రెండ్ గా ఏర్పడ్డాడు. పరిచయమైన కొద్ది రోజులలోనే అతను నాకు ఎంతగానో నచ్చాడు. అందరిలో తను చాలా ప్రత్యేకంగా కనిపించేవాడు. అంతే అతనికి నేను ఫ్లాటైపోయా.

షాక్! ఆ మోజులో పడి కట్టుకున్న వారినే మోసం చేస్తున్నారట! వీరిలోనూ భార్యా బాధితులే ఎక్కువగా ఉన్నారట.షాక్! ఆ మోజులో పడి కట్టుకున్న వారినే మోసం చేస్తున్నారట! వీరిలోనూ భార్యా బాధితులే ఎక్కువగా ఉన్నారట.

ఓ రోజు రాత్రి..

ఓ రోజు రాత్రి..

ఒకరోజు రాత్రి మేం ఇద్దరం కలిసి వైన్ తాగుతున్నప్పుడు నా చిన్ననాటి కోరిక గురించి తనతో చెప్పాను. దాని గురించి చెప్పగానే అతను వింతగా చూశాడు. అయితే ‘నీకు సాఫ్ట్ వేర్ బాయ్ ఫ్రెండ్ దొరకకపోయినా.. ఒక్కసారైనా నీ కోసం నేను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లా నటించి ఆ అందమైన అనుభవాన్ని కలిగిస్తానని‘ చెప్పాడు.

నా బర్త్ డే రోజున..

నా బర్త్ డే రోజున..

ఆ తర్వాత కొన్ని రోజులకు నా బర్త్ డే వచ్చింది. అయితే నేను బర్త్ డే పార్టీ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అప్పుడు ఆఫీసులో నాకు చాలా ఎక్కువ పని ఉండేది. నేను చేసిన పనిలో చాలా తప్పులు ఉన్నాయని, నాకు రావాల్సిన ప్రమోషన్ ను ఆపేయడంతో నిరాశ చెందాను. ఆరోజు ఆదివారం కావడంతో ఇంట్లోనే ఉండిపోవాలనుకున్నా. అయితే నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి, కనీసం తినడానికి అయినా బయటకు రమ్మని రిక్వస్ట్ చేశారు. అయినా వాళ్లకు కుదరదు అని కోపంగా చెప్పి ఇంట్లోనే ఉండిపోయాను.

సినిమాలు చూస్తు కూర్చున్నా...

సినిమాలు చూస్తు కూర్చున్నా...

నా బాయ్ ఫ్రెండ్ మాత్రం ఏదో షూటింగ్ పని మీద వేరే ఊరికి వెళ్లాడు. నేనేమో చాలా డిప్రెషన్ లో పడిపోయానా అనిపించింది. పగలంతా చికెన్ బర్గర్లు ఆర్డర్ చేసుకుని తింటూ.. సినిమాలు చూస్తూ కూర్చున్నా.. ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటలకు లేచి స్నానం చేయడానికి వెళ్లాను.

అప్పుడే కాలింగ్ బెల్..

అప్పుడే కాలింగ్ బెల్..

నేను స్నానం చేసి బయటకు వచ్చానో లేదో అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. అసలే చిరాకు ఉన్న ఈ సమయంలో ఎవరొచ్చారా? అని తిట్టుకుంటూ తలుపు తీశాను. ఎదురుగా నా బాయ్ ఫ్రెండ్. అంతే ఒక్కక్షణం అలాగే ఉండిపోయాను. అప్పుడు చాలా ఆనందపడ్డాను.

గట్టిగా కౌగిలించుకున్నాడు..

గట్టిగా కౌగిలించుకున్నాడు..

పుట్టినరోజుకు సర్ ప్రైజ్ ఇస్తే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. నేను కూడా చాలా సంతోషపడ్డాను. ఏంటి ఈ సడన్ ఎంట్రెన్స్ అని అడుగుతుండగానే తన నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. ముద్దు కూడా పెట్టుకున్నాడు.

షాకింగ్ సర్వే! శృంగారంలో అసంతృప్తి వల్లే.. అశ్లీల వెబ్ సైట్లు అన్వేషిస్తున్నారట...! తమ భార్యలను కూడాషాకింగ్ సర్వే! శృంగారంలో అసంతృప్తి వల్లే.. అశ్లీల వెబ్ సైట్లు అన్వేషిస్తున్నారట...! తమ భార్యలను కూడా

నా కళ్లను నమ్మలేకపోయాను..

నా కళ్లను నమ్మలేకపోయాను..

అచ్చం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లాగా రెడీ అయి వచ్చాడు. బ్లూ కలర్ షర్ట్.. బ్లాక్ ప్యాంట్..ఫార్మల్ షూస్ తో పాటు అచ్చం సాఫ్ట్ వేర్ లా తయారై వచ్చాడు. తర్వాత హ్యాపీ బర్త్ డే అంటూ గట్టిగా అరిచి నన్ను హత్తుకున్నాడు. నాకు నచ్చినట్టు తను రెడీ అయ్యాడన్న ఆనందంలో తన మీద పడిపోయాను.

తన షర్ట్ విప్పుతూ..

తన షర్ట్ విప్పుతూ..

తన షర్ట్ ను విప్పుతూ తనకి ముద్దులు పెడుతూ.. కాస్త రొమాంటిక్ గా కొరుకుతూ.. నవ్వుతూ ఉన్న ఆ సమయంలో తను కూడా నా డ్రెస్ విప్పుతూ తన చేతులతో నన్ను సుకుమారంగా తాకాడు. ఆ సమయంలో ఇలాంటి బాయ్ ఫ్రెండ్ నా భర్త అయితే చాలు.. సాఫ్ట్ వేర్ తో పనిలేదు అని నాకు అనిపించుకుంది.

మళ్లీ బెల్ మోగింది...

మళ్లీ బెల్ మోగింది...

మేమిద్దరం అలా రొమాన్స్ లో మునిగిపోయిన సమయంలో మరోసార్ డోర్ బెల్ మోగింది. ఆ సమయంలో తనని వదిలి ఒక్క నిమిషం కూడా వదిలి వెళ్లాలనిపించలేదు. తను కూడా నన్ను మరింత గట్టిగా హత్తుకున్నాడు. కానీ ఆ బెల్ రింగ్ ఆగడం లేదు. దీంతో ‘నువ్వు బెడ్ రూమ్ లోకి వెళ్లు.. నేను ఎవరొచ్చారో చూసి వాళ్లను పంపించేసి వస్తా‘ అని చెప్పి డోర్ దగ్గరికి వెళ్లాను. టెన్షన్ లో ఎవరో చూడకుండానే డోర్ తీసేశాను. ఎదరుగా అమ్మానాన్న. అప్పుడు నాకేం చేయాలో తోచలేదు. నేను బాత్ రోబ్ లో ఉండటం చూసి అమ్మా, నాన్న ‘అయ్యో స్నానం చేస్తున్నావా? అందుకే ఆలస్యమైందా? అంటూ లోపలికొచ్చేశారు.

నాకు చాలా పెద్ద షాక్..

నాకు చాలా పెద్ద షాక్..

నా బర్త్ డే కాబట్టి వారు కూడా నాకు ‘సర్ ప్రైజ్‘ ఇచ్చేందుకు వచ్చారట. కానీ నాకే పెద్ద షాక్ తగిలినట్టయ్యింది. బెడ్ రూమ్ లో ఉన్న నా బాయ్ ఫ్రెండ్ ని ఏం చేయాలో అర్థం కాలేదు. డ్రస్ మార్చుకునే నెపంతో బెడ్ రూమ్ లోకి వెళ్లి కిటికీ నుంచి బయటకు వెళ్లిపొమ్మని చెప్పాలనుకున్నా.

ఏడడుగుల బంధాన్ని ఏడేళ్లలో ముగించింది.. అయితే కొడుకు ఎదుటే రెండోపెళ్లి చేసుకుందీ స్టార్ హీరో కూతురు..ఏడడుగుల బంధాన్ని ఏడేళ్లలో ముగించింది.. అయితే కొడుకు ఎదుటే రెండోపెళ్లి చేసుకుందీ స్టార్ హీరో కూతురు..

తన వస్తువులన్నీ హాల్లో..

తన వస్తువులన్నీ హాల్లో..

కానీ తన బ్యాగ్, ల్యాప్ టాప్ లను హాల్లోని సోఫాలో వదిలేశాడు. వాటిని చూసి మా అమ్మ ‘ఇవి ఎవరవి‘ అని అడిగింది. అయితే అప్పటికే వారిద్దరికీ నా బాయ్ ఫ్రెండ్ గురించి తెలుసు. కానీ మా రిలేషన్ పెళ్లి చేసుకునేంత సీరియస్ అని వారికి తెలియదు. టెన్షన్ లో నేను నిజం చెప్పేశా.

పరిచయం చేశా...

పరిచయం చేశా...

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లా టిప్ టాప్ గా ఫార్మల్ డ్రస్ లో ఉన్న తనని బెడ్ రూమ్ నుండి బయటకు తీసుకొచ్చా. తనను మా నాన్నకు పరిచయం చేశాను. మా నాన్న తన స్టైల్ చూసి సాఫ్ట్ వేర్ అనుకున్నాడు. నేనేమో సైగలు చేస్తున్నా నిజం చెప్పొద్దు అని. కానీ తను మాత్రం మా నాన్నకు ఆర్టిస్ట్ అని నిజం చెప్పేశాడు. అంతే తనంటే నాకు మరింత ప్రేమ పెరిగిపోయింది.

అమ్మానాన్న ఓకే చెప్పేశారు..

అమ్మానాన్న ఓకే చెప్పేశారు..

ఆ తర్వాత మా బంధం గురించి.. తను అమ్మానాన్నకు చెప్పడంతో వారు మీ ఇష్టం అంటూ నవ్వేశారు. ఆ సంతోషంలో నేను కూడా నవ్వాను. అదే సమయంలో వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా.. నేను నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఫ్యాన్సీ కాస్ట్యూమ్ వేసుకుని బిర్యానీ, వైన్ పట్టుకుని మా ఇంటికి రమ్మని చెప్పాను. పార్టీ వాళ్లు ఏర్పాట్లు చేసినట్లే ఉండాలని.. కారణాలు తర్వాత చెబుతానని చెప్పాను.

మా ఇంటికొచ్చారు.

మా ఇంటికొచ్చారు.

కొద్ది క్షణాల్లోనే మా స్నేహితులంతా మా ఇంటికొచ్చారు. ఆరోజు అలా గడిచిపోయింది. మా అమ్మా, నాన్న ఆ తర్వాత నాలుగురోజులకు వెళ్లిపోయారు. ఆ తర్వాత మా రోల్ ప్లే గురించి జరిగిన కథంతా మా స్నేహితులకు చెప్పాను. వారేమో కొన్ని రోజుల వరకు టీచ్ చేస్తూనే ఉన్నారు. అమ్మకు, నాన్నకు తను చాలా బాగా నచ్చడంతో.. కొన్ని వారాల్లోనే వాళ్ల పెద్దవారితోనూ మాట్లాడారు. ఆ తర్వాత మా ఇద్దరి పెళ్లి ఘనంగా జరిగిపోయింది.

English summary

I Tried Role Play for 30 Days to Save My Marriage & Here's What Happened

Here we talking about i tried role play for 30 days to save my marriage & here's what happened. Read on
Desktop Bottom Promotion