For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన దేశంలోని ఆ ప్రాంతంలో పెళ్లికి ముందే రొమాన్స్... అంతేకాదు ఎవరితోనైనా ఎన్నిరోజులైనా గడపొచ్చు...!

మన దేశంలోని ఆ ప్రాంతంలో పెళ్లికి ముందు రిలేషన్ షిప్ అక్కడ చాలా కామన్ అంట.

|

India's Unique Place Where People Make Relationships Before Marriage!:మన దేశంలో పెళ్లి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకం. అయితే పెళ్లికి ముందు సెక్స్ అంటేనే అది మన సంప్రదాయం కాదని.. పెళ్లి తర్వాతే ఆ కార్యంలో పాల్గొనాలని పెద్దలు చెబుతుంటారు.

India’s Unique Place Where People Make Relationships Before Marriage!

కానీ విదేశాల్లో పెళ్లికి ముందే రొమాన్స్ చేయడం.. సహజీవనం చేయడం చాలా కామన్. పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం.. పిల్లల్ని కనడం వంటివి చకచకా జరిగిపోతుంటాయి. అంతేకాదు కొందరు ప్రెగ్నెన్సీ సమయంలోనే పెళ్లి చేసుకున్న వారు చాలా మందే ఉన్నాయి. అయితే మన దేశంలో కూడా పెళ్లికి ముందు రొమాన్స్ చేయడం.. సహజీవనం వంటివి మెట్రో నగరాల్లో విపరీతంగా పెరిగిపోతున్నాయి.

India’s Unique Place Where People Make Relationships Before Marriage!

దీన్ని కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. మెట్రో నగరాల్లో మాత్రమే ఈ కల్చర్ మన దేశంలోని కొన్ని మారుమూల గ్రామాల్లో కూడా ఉన్నాయని మీకు తెలుసా. ఆ ప్రాంతాల్లో ఎవరైనా పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొనొచ్చు. అంతేకాదు ఎంతమందితో కావాలంటే అంతమందితో ఆ కార్యాన్ని ఆస్వాదించొచ్చు. వింతగా ఉండే ఈ సంప్రదాయం ఎక్కడ ఉందని ఆశ్చర్యపోతున్నారా? ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

కొత్తగా పెళ్లయిన ఈ విషయాలపై కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి...కొత్తగా పెళ్లయిన ఈ విషయాలపై కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి...

వింత ఆచారాలు..

వింత ఆచారాలు..

మన దేశంలోని తెలుగు రాష్ట్రాలకు ఆనుకుని ఉన్న ఛత్తీస్ గడ్ జిల్లాలోని నక్సలైట్లు ప్రభావం ఎక్కువగా ఉండే బస్తర్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ వింత ఆచారాలు ఉన్నాయట. ఇక్కడ నివసించే గోండు, మురియా తెగకు చెందిన గిరిజనులు చాలా విలక్షణమైన సంప్రదాయాలను పాటిస్తారట. మిగిలిన ప్రాంతాల్లో ఉండే సంప్రదాయాలు, పద్ధతులు ఇక్కడి వారికి భిన్నంగా అనిపిస్తాయి. ఇప్పటికీ మనలో చాలా మంది శృంగారం గురించి ఓపెన్ గా మాట్లాడేందుకు సంకోచిస్తూ ఉంటారు. అలా మాట్లాడితే తప్పుగా భావిస్తారు. అయితే గిరిజన తెగల్లో మాత్రం సెక్స్ ను చాలా కామన్ గా పరిగణిస్తారు. ఇక్కడ ప్రేమించుకున్న జంటలు కలిసి తిరగడం.. పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొనడం వంటివి అందరికీ తెలిసే జరుగుతాయట.

సరదాగా గడిపేందుకు..

సరదాగా గడిపేందుకు..

ఈ ప్రాంతంలో నివసించే గిరిజనులు ఘోతుల్ అనే ఆచారాన్ని పాటిస్తారు. ఘోతుల్ అంటే పెద్ద పెద్ద వెదురు కర్రలతో ఇళ్లను నిర్మించుకోవడం. మన నగరాల్లో ఉండే నైట్ క్లబ్ లా మాదిరిగా ఉంటాయట. ఇక్కడ మగవారైనా, ఆడవారైనా కలిసి సరదాగా గడిపేందుకు వస్తారట. మరీ విచిత్రం ఏంటంటే.. 10 సంవత్సరాలు పూర్తయిన పిల్లలు కూడా ఘోతుల్ కు వెళ్లొచ్చట. అలా ఘోతుల్ లోకి వెళ్లి ఏ పని అయినా చేసే పూర్తి ఫ్రీడమ్ వారికి ఉంటుందట. అంతేకాదు స్త్రీపురుషులిద్దరూ పెళ్లికి ముందే సెక్స్ చేసుకోవచ్చు. ఎంతమందితో కావాలంటే అంతమందితో అఫైర్స్ పెట్టుకోవచ్చు. ఇక తమ పార్ట్నర్ ను ఎంపిక చేసుకునే విషయంలో ఎలాంటి ఒత్తిడి ఉండదట.

కౌగిలింతల్లో ఎన్ని రకాలున్నాయి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా...కౌగిలింతల్లో ఎన్ని రకాలున్నాయి? వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా...

ప్రత్యేక బహుమతులు..

ప్రత్యేక బహుమతులు..

ఘోతుల్ లో పాల్గొనే మగవారు, ఆడవారు తమ కిష్టమైన వారి కోసం పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తుంటారట. ఇక తమ మనసుకు నచ్చిన వారి కోసం ప్రత్యేక వెదురు కర్రతో తయారు చేసి దువ్వెనలను బహుమతులుగా ఇస్తుంటారట. ఆ దువ్వెనలను తమ ప్రియురాలి తలలో పెట్టేస్తారట. తను ఆ దువ్వెనను అలాగే తలలో ఉంచుకుంటే వారిని ఇష్టపడినట్టేనని అర్థమట. వారిద్దరూ కలిసి జీవించొచ్చట. పెళ్లికి ముందే శృంగారంలో కూడా పాల్గొనొచ్చు.

సహ జీవనం..

సహ జీవనం..

పెళ్లికి ముందే సహజీవనం చేస్తూ.. గర్భం దాల్చాక కూడా వారిద్దరూ ఒకరినొకరు అలాగే ఇష్టపడితే.. వారిద్దరి కుటుంబాలు వారి ఇష్టప్రకారం పెళ్లి చేస్తారట. ప్రెగ్నెన్సీ సమయంలోనే పెళ్లిళ్లు చేసిన సంఘటనలు ఎనో ఉన్నాయట. అంతేకాదు ఘోతుల్ లో సెక్స్ సంబంధించిన విషయాలపై అవగాహన కల్పిస్తారట. శృంగారంలో పాల్గొనడానికి ముందు సందేహాలన్నింటికీ సమాధానం చెబుతారట. ఈ కారణంగానే ఆ ప్రాంతంలో లైంగిక వేధింపులు, రేప్స్ అనేవే ఉండవట. అందుకే అక్కడ ఇప్పటివరకు ఒక్క అత్యాచారం కేసు కూడా నమోదు కాలేదని స్థానికులు చెబుతుంటారు.

FAQ's
  • ఆ ప్రాంతంలో పెళ్లికి ముందు ఇష్టపడిన వారికి ఎలాంటి గిఫ్టులిస్తారు?

    ఘోతుల్ లో పాల్గొనే మగవారు, ఆడవారు తమ కిష్టమైన వారి కోసం పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తుంటారట. ఇక తమ మనసుకు నచ్చిన వారి కోసం ప్రత్యేక వెదురు కర్రతో తయారు చేసి దువ్వెనలను బహుమతులుగా ఇస్తుంటారట. ఆ దువ్వెనలను తమ ప్రియురాలి తలలో పెట్టేస్తారట. తను ఆ దువ్వెనను అలాగే తలలో ఉంచుకుంటే వారిని ఇష్టపడినట్టేనని అర్థమట. వారిద్దరూ కలిసి జీవించొచ్చట. పెళ్లికి ముందే శృంగారంలో కూడా పాల్గొనొచ్చు.

  • భారతదేశంలోని ఏ ప్రాంతంలో పెళ్లికి ముందే సంబంధం పెట్టుకుంటారు?

    మన దేశంలోని తెలుగు రాష్ట్రాలకు ఆనుకుని ఉన్న ఛత్తీస్ గడ్ జిల్లాలోని నక్సలైట్లు ప్రభావం ఎక్కువగా ఉండే బస్తర్ జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ వింత ఆచారాలు ఉన్నాయట. ఇక్కడ నివసించే గోండు, మురియా తెగకు చెందిన గిరిజనులు చాలా విలక్షణమైన సంప్రదాయాలను పాటిస్తారట. మిగిలిన ప్రాంతాల్లో ఉండే సంప్రదాయాలు, పద్ధతులు ఇక్కడి వారికి భిన్నంగా అనిపిస్తాయి. ఇప్పటికీ మనలో చాలా మంది శృంగారం గురించి ఓపెన్ గా మాట్లాడేందుకు సంకోచిస్తూ ఉంటారు. అలా మాట్లాడితే తప్పుగా భావిస్తారు. అయితే గిరిజన తెగల్లో మాత్రం సెక్స్ ను చాలా కామన్ గా పరిగణిస్తారు. ఇక్కడ ప్రేమించుకున్న జంటలు కలిసి తిరగడం.. పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొనడం వంటివి అందరికీ తెలిసే జరుగుతాయట.

English summary

India’s Unique Place Where People Make Relationships Before Marriage!

Here we are talking about the India's unique place where people make relationship before marriage. Have a look
Story first published:Tuesday, February 15, 2022, 19:50 [IST]
Desktop Bottom Promotion