Latest Updates
-
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది!
పెళ్లికి ముందు అది ఓకేనా? ఎంతమంది ఇందుకు అనుకూలంగా ఓటేశారంటే..?
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 12 శాతం మంది మాత్రం పెళ్లికి ముందు సెక్స్ చేయడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు.Here we talking about 29% Indians from tier-3 cities are open to the idea of premarital sex, sa
శృంగారం అనగానే యవ్వనంలో ఉన్న ప్రతి ఒక్కరికీ చాలా ఆసక్తి ఉంటుంది. అయితే మన దేశంలో అనేక సంప్రదాయాలు, కట్టుబాట్ల కారణంగా శృంగార కోరికలను అణచుకోవడం.. లేదా తమలో తామే దాచుకోవడం వంటివి చేస్తుంటారు యువత. ఈ పవిత్రమైన కార్యాన్ని పెళ్లి తర్వాతే చేయాలని మన సంప్రదాయాలు, కల్చర్ చెబుతున్నాయి.

అయితే వెస్ట్రన్ కల్చర్ లో ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం మన దేశంలోని కొన్ని నగరాల్లో ఇలాంటి కల్చర్ ను అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలోనే పెళ్లికి ముందు శృంగారం సమ్మతమేనా అని ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 66 శాతం మంది తమకు ఇలాంటి వాటికి చాలా అభ్యంతరకరమని తెలిపారు. అయితే 29 శాతం మంది మాత్రం తమకు పెళ్లికి ముందు శృంగారం విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పడం గమనార్హం. మిగిలిన వారు ఈ విషయంలో ఎలాంటి సమాధానాలిచ్చారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. తాజాగా నిర్వహించిన ఈ సర్వేలో ఇంకా అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో తెలుసుకోవడానికి ఈ స్టోరీని పూర్తిగా చూడండి...

సహజీవనం..
ఇప్పుడు భారతదేశం అన్ని రంగాల్లోనూ అత్యంత వేగంగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో వెస్ట్రన్ కల్చర్ ను యువత చాలా వేగంగా ఒంట పట్టించుకుంటున్నారు. దీని ఫలితంగానే లివింగ్ రిలేషన్ షిప్, డేటింగ్ వంటివి మన దేశంలోకి అడుగుపెట్టి మనందరిలో కొత్త కొత్త మార్పులు తీసుకువస్తున్నాయి.

దీని వల్ల పెళ్లికి ముందే చాలా మంది యువతీ, యువకులు విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొంటున్నారు. పెళ్లి తర్వాత జరిగే పవిత్ర కార్యాన్ని.. అంతకుముందే అనుభవిస్తున్నారు.

సాంప్రదాయాలకు విలువ...
మన దేశంలో వెస్ట్రన్ కల్చర్ కు ఎంతో మంది వెల్ కమ్ చెప్పినా.. మన సంప్రదాయాలకు, మన కల్చర్ కు, కట్టుబాట్లకు చాలా విలువ ఇస్తున్నారని తాజా సర్వేలో తేలింది.

పెళ్లికి ముందు సెక్స్ కు నో...
ఈ సర్వేలో పాల్గొన్న చాలా మంది యువతీ, యువకులు పెళ్లికి ముందు సెక్స్ కి తాము చాలా దూరం అంటూ చెప్పేశారు.

సర్వే నిర్వహించిందేవరంటే..
అవుట్ లుక్-కార్వీ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో అనేక ఆసక్తికరమైన వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వే సంస్థ పెళ్లికి ముందు సెక్స్ తో పాటు మరిన్ని ప్రశ్నలకు యువత నుండి సమాధానాలను రాబట్టింది.

అందులో తప్పే లేదట..
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 12 శాతం మంది మాత్రం పెళ్లికి ముందు సెక్స్ చేయడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. అయితే వారు మాత్రం ఆ కార్యం చేయమని చెప్పడం విశేషం.

మాకు సమ్మతమే...
మరో రెండు శాతం మాత్రం పెళ్లికి ముందు సెక్స్ మాకు సమ్మతమేనని చెప్పారట. అయితే ఆ వ్యక్తే తమ భాగస్వామి కావాలని కోరుకుంటున్నారట.

హోమో సెక్సువాలిటీ
ఇక, హోమో సెక్సువాలిటీ అనేది వ్యక్తిగత ఎంపిక అని నలుగురిలో ముగ్గురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

పోర్న్ సైట్లను నిషేధించాలని..
మరోవైపు పోర్న్ వెబ్ సైట్లు అశ్లీల చిత్రాలను చూపిస్తూ యువతను చాలా ఎక్కువగా పాడు చేస్తున్నాయని వాటిని బ్యాన్ చేయాలని 50 శాతం మంది అంగీకరించారు.

కులాంతర వివాహాలకు..
ఇంకో ప్రశ్నకు సమాధానంగా చాలా మంది ఇలా సమాధానం ఇచ్చారు. కులాంతర వివాహాలకు 57 శాతం మంది మద్దతు ఇచ్చారు. అయితే 33 శాతం మంది కులాంతర వివాహం వంటి వాటిని వ్యతిరేకిస్తున్నారు.

డేటింగ్ యాప్స్ గురించి..
డేటింగ్ యాప్ వినియోగించే వారు 23 శాతం మంది ఉన్నారట. మరో 34 శాతం మంది విద్యార్థి జీవితంలో రాజకీయాలు అవసరం లేదని భావిస్తున్నారు.

గుడికి వెళ్లేవారు..
ఈ సర్వేలో గుడికి వెళ్లడం గురించి ప్రశ్నించగా నలుగురిలో ముగ్గురు వారంలో ఒక్కసారి కచ్చితంగా దేవాలయానికి వెళ్తారంట..



Click it and Unblock the Notifications
