Latest Updates
-
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు -
జూన్ 24 నుంచి తులా రాశిలో చంద్ర సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, ధన లాభం ఖాయం! -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.!
ఫుల్ మీల్స్ తిన్నాక.. ఫుల్ రొమాన్స్ చేయొచ్చా?
ఇలా వెంటనే కలయికలో పాల్గొంటే, తమలో ఎక్కువ శక్తి ఉండి ఆ ఘట్టాన్ని బాగా ఆస్వాదిస్తామని చాలా మంది భావిస్తారని, కానీ ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని చెబుతున్నారు నిపుణులు.
ఈ విశ్వంలో ప్రతి ఒక్క పనికి ఒక సమయం అనేది ఉంటుంది. ముఖ్యంగా కలయికకు సంబంధించి మన దేశంలో ప్రత్యేక సమయం ఉన్నట్లు చాలా మంది హిందువులు నమ్ముతారు.

అందుకే అలాంటి సమయంలోనే అలాంటి కార్యాలను చేయాలని భావిస్తుంటారు. అయితే చాలా మంది మన దేశంలో చీకటి వేళలో ఈ కార్యంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఆ సమయంలో అందరూ నిద్రపోతుంటారు కాబట్టి. అంతేకాదు చాలా ప్రశాంతంగా ఉండే సమయం కావున ఆ సమయానికే అత్యధిక మంది ప్రాధాన్యత ఇస్తున్నారు.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో రాత్రి, పగలు అనే తేడా లేకుండా చాలా మంది ఆ ఘట్టంలో పాల్గొంటున్నారు. ఈ సమయాన్ని చాలా మంది జంటలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కండోమ్స్ అమ్మకాలు బాగా పెరిగాయని ఇటీవలో ఓ సర్వేలో తేలింది. అయితే అందరూ ఈ కలయికను ఆస్వాదించలేకపోతున్నారట.

కేవలం కొంతమంది జంటలు మాత్రమే ఈ కార్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారట. కొన్ని జంటలు నామమాత్రంగా కలయికలో పాల్గొని సర్దుకుపోతున్నారంట. వీటన్నింటి సంగతి పక్కన పెడితే, కలయికలో ఏ సమయంలో పాల్గొన్నా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే భోజనం చేసిన వెంటనే మాత్రం కలయికలో పాల్గొనకపోవడం మంచిదని సూచిస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రాత్రి, పగలు తేడా లేకుండా..
చాలా మంది జంటలు ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరమితమవ్వడంతో ఆ కార్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారట. ఇది వరకు ఎక్కువగా రాత్రి సమయంలోనే ఆసక్తి చూపే జంటలు ప్రస్తుతం రాత్రి, పగలు అనే తేడా లేకుండా రెచ్చిపోతున్నారట.

భోజనం తిన్న వెంటనే..
అయితే చాలా మంది జంటలు భోజనం తిన్న వెంటనే కలయికలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారట. అయితే ఇలా వెంటనే కలయికలో పాల్గొంటే, తమలో ఎక్కువ శక్తి ఉండి ఆ ఘట్టాన్ని బాగా ఆస్వాదిస్తామని చాలా మంది భావిస్తారని, కానీ ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని చెబుతున్నారు నిపుణులు. భోజనం చేశాక ఎక్కువగా కలయికలో పాల్గొంటే కడుపులో మంట, అసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

ఆయుర్వేదంలోనూ..
ఇదే కలయిక గురించి ఆయుర్వేద నిపుణులు కూడా ఆసక్తికరమైన విషయాలను చెబుతున్నారు. అర్థరాత్రికి ముందు కలయికలో పాల్గొంటే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే అప్పుడు నిద్ర పోవడానికి మంచి సమయం ఉంటుందని సూచిస్తున్నారు. అదే విధంగా పౌర్ణమి వంటి సమయంలో కలయికలో పాల్గొంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆలుమగలిద్దరూ కూడా ఆ కార్యాన్ని బాగా ఆస్వాదించగలరని చెబుతున్నారు.

ఉదయం సమయంలో..
అయితే సైన్స్ ప్రకారం ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్య పురుషులకు కలయికలో పాల్గొనాలనే కోరికలు ఎక్కువగా ఉంటాయట. ఈ సమయంలో వారి శక్తి కూడా బాగా ఎక్కువగా ఉంటుదట. అయితే మహిళల్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటుందట. కాబట్టి ఈ సమయంలో కలయికలో మెరుగైన ఫలితాలు రాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

స్త్రీలకు ఆ సమయంలో..
అయితే అమ్మాయిలకు ఉదయం 8 నుండి 10 గంటల మధ్య ఎండార్ఫిన్లు అనే హార్మోన్లు విడుదలవుతాయి. కాబట్టి ఈ సమయంలో మహిళలకు కోరికలు ఎక్కువగా పెరుగుతాయట. కానీ అబ్బాయిలకు ఈ సమయంలో కోరికలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఇద్దరికీ ఇష్టమైతే ఆ సమయంలో కూడా కలయికలో పాల్గొనవచ్చని చెబుతున్నారు నిపుణులు.

మధ్యాహ్న వేళలో..
అదేవిధంగా మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల మధ్య స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పని చేస్తుందట. అంతేకాదు, ఈ సమయంలో పురుషుల నుండి విడుదలయ్యే వీర్యంలో కూడా నాణ్యత ఎక్కువగా ఉంటుందట.. కాబట్టి ఈ సమయంలో కలయికలో పాల్గొంటే గర్భం దాల్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే రాత్రి 8 నుండి 10 గంటల వరకు భార్యభర్తలిద్దరిలోనూ శక్తి బాగా పెరుగుతుందట. ఇలా పెరగడం వల్ల కలయికకు చాలా అనువుగా ఉంటుదట.

అప్పుడే మెరుగైన ఫలితాలు..
కలయిక విషయంలో సమయాన్ని చూసినట్టుగానే కాలాన్ని కూడా చూడాలంటున్నారు నిపుణులు. సాధారణంగా చాలా మందికి అన్ని కాలాల్లోనూ విభిన్నంగా ఉంటుదట. కాబట్టి కలయికలను కాలాలను బట్టి చేయడం మంచిదని చెబుతున్నారు. అన్ని కాలాలతో పోలిస్తే, శీతాకాలంలో కలయికల వల్లే అనేక లాభాలు ఉంటాయని చెబుతున్నారు. గర్భం కోసం ఎదురుచూసే వారు ఈ సమయంలోనే కలవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.



Click it and Unblock the Notifications