For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రేమలో పడిన కొత్తలో అవి కోల్పోవాల్సిందేనా? మీకూ ఇలా జరిగిందా?

|

స్త్రీ, పురుషుల మధ్య బంధానికి గట్టి పునాదిలా పనిచేసేది ప్రేమ. ఆడ, మగవారిలో ఎవ్వరైనా ప్రేమలో పడితే చాలు ఈ లోకాన్నే మరచిపోతారు. వారిద్దరి కోసం కొత్త ప్రపంచాన్ని కోరుకుంటారు.

తమ ప్రియుడు/ప్రియురాలి కోసం అద్భుతమైన కవితలు రాస్తూ ఉంటారు. ఎవ్వరికైనా ప్రేమ పుడితే చాలు.. వారి జీవితమంతా ఆనందమయంగా అనిపిస్తుంది. వారికి ఎప్పుడూ నచ్చిన వ్యక్తులతో కలిసి జీవితాంతం జర్నీ చేయాలనిపిస్తుంది.

అయితే ఇదంతా స్వచ్ఛమైన, సహజమైన ప్రేమలోనే అని చాలా మంది చెబుతుంటారు. అయితే వీటిలో ఏ మేరకు నిజముంది.. ఎంత వరకు అవాస్తవాలనే విషయాలను కనుగొనే ప్రయత్నం చేశారు శాస్త్రవేత్తలు ఈ నేపథ్యంలోనే ప్రముఖ జీవ మానవ శాస్త్రవేత్త హెలెన్ ఫిషర్ ప్రేమ విషయంలో చేసిన పరిశోధనల్లో మూడు ముఖ్యమైన విషయాలను గుర్తించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Zodiac signs: రాశిచక్రాన్ని బట్టి తమ లైఫ్ లో ఇలాంటి భాగస్వామి కావాలని కోరుకుంటారట...!

మూడు లక్షణాలు..

మూడు లక్షణాలు..

ప్రముఖ జీవ మానవ శాస్త్రవేత్త హెలెన్ ఫిషర్ ప్రేమ విషయంలో చేసిన పరిశోధనల్లో మూడు ముఖ్యమైన విషయాలను గుర్తించారు. ప్రేమలో పడిన వారిలో వారికి తెలీకుండానే ఈ మూడు ఎమోషన్స్ కనబడతాయట. అందులో మొదటిది కామం (lust), రెండోది. అట్రాక్షన్, మూడో విషయం అటాచ్ మెంట్.

హార్మోన్ల విడుదల..

హార్మోన్ల విడుదల..

ప్రేమలో పడిన వారు ఈ మూడు హార్మోన్లపై ఆధారపడి ఉంటారట. ఈ హార్మోన్లు బ్రెయిన్ పనితీరు ఆధారంగా రిలీజ్ అవుతాయట. అట్రాక్షన్, అటాచ్ మెంట్ కు భిన్నమైనది కామం. స్త్రీ, పురుషుల్లో ఈస్ట్రోజన్, టెస్టోసెరాన్లు విడులైనప్పుడు వారికి రతి క్రీడలో కోరికలు పుడతాయట.

ఆకర్షణకు కారణం..

ఆకర్షణకు కారణం..

స్త్రీ, పురుషులిద్దరిలో డోపామైన్, నోర్ పైన్ హార్మోన్లు ఆకర్షణకు కారణమవుతాయట. రొమాంటిక్ రిలేషన్ షిప్ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రారంభమైతే.. మొదట్లో ఈ హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయట.

రతి క్రీడ బ్రేకుల్లేకుండా.. సాఫీగా సాగిపోవాలంటే...!

ప్రేమ పుట్టడానికి..

ప్రేమ పుట్టడానికి..

ఇవన్నీ జరిగిన తర్వాతే ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య స్టార్టవుతుందట. ఆక్సీటోసిన్, వాసోప్రెస్సిన్ వంటి హార్మోన్లు ప్రేమను ఎక్కువ కాలం నిలుపుకోవడానికి సహాయం చేస్తాయట. వీటి కారణంగా ప్రేమ పుట్టేందుకు ఎక్కువ అవకాశం ఉంటుదట. ఒక వ్యక్తికి ప్రేమ పుట్టడానికి కేవలం సెకన్లో ఐదో వంతు సమయం సరిపోతుందట. ఇది సైన్స్ ప్రకారం నిరూపించబడింది.

ప్రేమలో పడిన కొత్తలో..

ప్రేమలో పడిన కొత్తలో..

ఇదిలా ఉండగా.. ప్రేమలో పడిన కొత్తలో చాలా మందికి ఆకలి అనేది తెలియదట. అంతే కాదు నిద్ర పట్టే అవకాశం కూడా తక్కువని చెబుతుంటారు. ఇదంతా నిజమేనని తాజా అధ్యయనంలో తేలింది. ప్రేమలో ఉన్న సమయంలో డోపమైన్, నోర్ పైన్ ఫ్రైన్ హార్మోన్లు విడుదల అవ్వడం వల్ల ఓ వ్యక్తికి ఎక్కువ సంతోషం, ఉత్సాహం పెరుగుతాయట. దీంతో ఆకలి, నిద్ర పోవాలని ఆశ తగ్గిపోతాయట.

‘ఆ కార్యంలో' గాయాలు.. మీ భాగస్వామికి తియ్యని గుర్తులు...! కానీ దానితో కొన్ని సమస్యలు... అవేంటంటే...

అలవాట్లలో మార్పులు..

అలవాట్లలో మార్పులు..

ప్రేమలో పడిన వారిలో వారికి తెలియకుండానే చాలా మార్పులు వస్తుంటాయట. ముఖ్యంగా వారి చూపులు.. డ్రస్సులు.. ప్రవర్తన మారిపోతుందట. ఈ ప్రేమ ఆ వ్యక్తి జీవితంలోని భావోద్వేగాలకు మంచి ఉపశమనంగా మారుతుందట.

అవే ఎక్కువగా..

అవే ఎక్కువగా..

ప్రేమలో ఉండే వారు తమ భాగస్వామి నుండి ఎక్కువ కేరింగ్ కోరుకుంటారు. అంతేకాదు పొగడ్తలను, గిఫ్టుల వంటిని కోరుకుంటారు. ప్రతి చిన్న విషయానికీ థ్యాంక్స్ చెబుతుంటారు. ప్రేమలో పడిన వారిలో గ్రాటిట్యూడ్ కూడా బాగా పెరుగుతుందట.

మంచి విషయమేమిటంటే..

మంచి విషయమేమిటంటే..

శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలిన మరో మంచి విశేషమేమిటంటే.. ప్రేమలో ఉన్న వారు తమ భాగస్వామిని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటారట.

English summary

Is It Possible to Lose Appetite After Falling in Love?

Read on to know the details is possible to lose appetite after falling in love.
Story first published: Friday, April 30, 2021, 15:23 [IST]