Latest Updates
-
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే! -
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం! -
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే.. -
2026 జూన్ 7: రవి యోగంతో అదృష్టం మీ సొంతం.. ఉదయం 8 గంటల లోపే ఈ పని చేయండి! -
భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే భార్యలు చేయకూడని పనులు!..తలస్నానం చేస్తే.. -
మీ జన్మ నక్షత్రానికి ఏ దేవత అధిపతి తెలుసా? ఏ దేవతను పూజించాలి మీ స్టార్ ఏది?
ఫస్ట్ బ్రేకప్.. ఫస్ట్ ఎంగేజ్ మెంట్.. మరెన్నో సంగతులు షేర్ చేసుకున్న కాజల్...!
కాజల్ అగర్వాల్ బ్రేకప్ స్టోరీ గురించి మీకు తెలుసా...
మన దేశంలో హీరోలు.. హీరోయిన్లు.. స్పోర్ట్స్ స్టార్లు, ఇతర సెలబ్రెటీల పర్సనల్ మ్యాటర్ తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ఎంతో కుతుహాలంతో ఎదురుచూస్తూ ఉంటారు. అందులోనూ వారి లవ్, బ్రేకప్, మ్యారేజ్, డైవర్స్ వంటి వాటికి సంబంధించిన విషయాలైతే మరీ ఆసక్తి చూపుతారు.

అయితే ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఏ సెలబ్రెటీలు స్పందించడానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపరు. ఎందుకంటే వారికి కూడా మనలాగే మనసు, మనోవేదనలు, మానసిక సంఘర్షణలు, ఒత్తిళ్లు ఉంటాయి.

అయితే ఇటీవలి కాలంలో ఇలాంటి వాటి వల్లే కలిగే బాధ, ఇబ్బందుల నుండి కొందరు హీరో, హీరోయిన్లలు చాలా వేగంగానే కోలుకుంటున్నారు. అంతేకాదు తమ కెరీర్ పై తిరిగి ఫోకస్ పెడుతున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ఇటీవలే తనకు ఎంగేజ్ మెంట్ అయ్యిందని.. త్వరలో వివాహం చేసుకోబోతున్నానని ప్రకటించిన టాలీవుడ్ బ్యూటీ క్వీన్ కాజల్ కు ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో ఓ వ్యక్తితో లవ్ లో పడిందట. ఈ విషయాన్నే తనే స్వయంగా షేర్ చేసుకున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

కాజల్ ఫస్ట్ లవ్..
కాజల్ అగర్వాల్ ఇప్పటికీ విజయవంతమైన హీరోయిన్ గా రాణిస్తోంది. అలాంటి అందాల భామకు కూడా ఫస్ట్ లవ్, ఫస్ట్ బ్రేకప్ స్టోరీ ఉందట. ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో తాను ఓ అబ్బాయితో ప్రేమలో పడిందట.

ఫస్ట్ బ్రేకప్..
అయితే కొన్ని కారణాల వల్ల తనకు బ్రేకప్ చెప్పిందట. అంతేకాదు ఆ అబ్బాయి కొన్ని నియమ నిబంధనలు పెట్టాడట. అవి తనకు నచ్చకపోవడంతో ఆ ప్రేమను వదులుకుందట.

సినీ రంగంపై చెడు అభిప్రాయం..
తను ప్రేమించిన వ్యక్తికి సినిమా రంగంపై కూడా మంచి అభిప్రాయమనేదే లేదట. అంతేకాదు తనను కూడా ఈ సినీ రంగం నుండి తప్పుకోమని ఒత్తిడి చేసేవాడట. అదే సమయంలో తాను హీరోయిన్ బిజీ కావడంతో.. అతనితో గడిపేందుకు సమయం దొరకకపోవడంతో తనకు దూరమైనట్లు చెప్పుకొచ్చింది.

ఓ రియాల్టీ షోలో..
ఇటీవల ఓ రియాల్టీ షోలో పాల్గొన్న కాజల్ బ్రేకప్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ‘మంచో.. చెడో.. లవ్ లో ఫెయిల్ అయితే లైఫ్ ఎండ్ అయినట్లు కాదు. నెమ్మదిగా ఆ బాధ నుండి బయటకు వచ్చేయాలి. బ్రేకప్ తర్వాత కొత్త జీవితం ప్రారంభించాలి..' అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడింది.

తనకు కాబోయే భర్త గురించి..
మరోవైపు అదే సమయంలో తనకు కాబోయే శ్రీవారికి ఎలాంటి లక్షణాలు ఉండాలో కూడా అప్పుడే డిసైడ్ చేసుకుందట. ముఖ్యంగా అతను సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాకూడదని.. అతనికి ఎక్కువగా దైవ భక్తి ఉండాలని చెప్పుకొచ్చింది కాజల్.

పెళ్లి కళ వచ్చేసింది..
ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు సినిమాల్లో బిజీగా ఉన్న కాజల్.. తన జీవితంలో ఇంతవరకు పెళ్లి అనే టాపిక్ రాలేదని చెప్పింది. కానీ కరోనా వంటి మహమ్మారి సమయంలో తనకు ఆ సమయం వచ్చినట్టు కనిపించిందని చెప్పుకొచ్చింది.

తాజాగా ముంబై బిజినెస్ మెన్ ని..
అందరూ ఊహించినట్టుగానే కాజల్ అగర్వాల్ తన పెళ్లి గురించి స్వయంగా ప్రకటించింది. సోషల్ మీడియా ద్వారా తాను ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ గౌతం కిచ్లును త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 30వ తేదీన అతి కొద్ది మంది ఆత్మీయుల మధ్య తన పెళ్లి జరగనున్నట్టు వివరించింది. పెళ్లి తర్వాత తాను సినిమాలను చేస్తానని, ఇప్పటివరకు తనను ఆదరించిన అభిమానులందరికీ ధన్యవాదాలు చెబుతూ.. తన కొత్త జీవితానికి కూడా మీ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నట్టు విజ్ణప్తి చేసింది.

ఎందరో హీరోయిన్లు..
ప్రేమలో పడటం.. వివిధ కారణాల వల్ల బ్రేకప్ చెప్పడం వంటి విషయాల్లో కాజల్ లాంటి బాధితులు సినీ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. నయనతార, హన్సిక, దీపికా పదుకొనే, సమంత, అమలాపాల్, శ్రుతి హాసన్ వంటి హీరోయిన్ల అందరూ ఈ బ్రేకప్ బాధను అనుభవించి బయటపడ్డవారే. మానసిక స్థైర్యం విషయంలో వారిని మనం ఆదర్శంగా తీసుకుంటే.. మనం కూడా వారిలాగే విజయవంతంగా జీవితాన్ని రన్ చేయొచ్చు. ఇది కేవలం సినిమా రంగం వారికే కాదు.. అన్ని రంగాల్లో రాణించే వారికి వీరి జీవితాలు ఆదర్శంగా నిలబడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Image courtesy : Twitter



Click it and Unblock the Notifications