For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Online Dating: ఆన్ లైన్ డేటింగ్ కల్చర్ మంచిదేనా? సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయట...

భారతదేశంలో ఆన్ లైన్ డేటింగ్ పెరిగిపోతుందని తాజా సర్వేలో తేలిందట. దీని వల్ల భవిష్యత్తులో మంచిదా కాదా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఒకప్పుడు ప్రేమ అంటే.. కంటి చూపులతో మొదలయ్యేవి.. అలా చూపులు కలిసి.. పరిచయం తర్వాత.. ఇద్దరి అభిరుచులు.. ఆలోచనలు ఇతర విషయాలన్నీ కలిస్తే.. వారి ప్రేమ ప్రయాణం సాఫీగా ముందుకెళ్లేది.. అలాంటి ప్రేమలో మనకు ఎల్లప్పుడూ మన చుట్టుపక్కల కనిపించేవాళ్లే ఉండేవారు. అయితే ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ చేతిలోకొచ్చాక.. అరచేతిలో ప్రపంచం మన ముందుకొచ్చేసింది.

Latest Survey : The Growing Culture of Online Dating in India, Is It Better For Future

దీని వాడకం కూడా మన దేశంలో చాలా వేగంగా పెరిగిపోయింది. దీంతో అమలాపురంలో ఉండే అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉండే అమ్మాయితో చాటింగ్ చేసేందుకు.. వీడియో కాల్ చేసేందుకు కూడా అవకాశం వచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సోషల్ మీడియా కారణంగా ఎన్నో అనుకూలతలు వచ్చాయి.. కొన్ని ప్రతికూలతలు ఉన్నాయనుకోండి..

Latest Survey : The Growing Culture of Online Dating in India, Is It Better For Future

అది వేరే విషయం. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ఇప్పుడు లవ్ చేసుకోవడానికి.. డేటింగు కోసం అని ప్రత్యేకమైన యాప్స్ వచ్చేశాయి. వీటిలో మీ వివరాలు అప్ లోడ్ చేస్తే చాలు.. మీరంటే ఇష్టముండే మీకు లైక్ చేయొచ్చు.. మీకు కూడా వారు నచ్చితే అందులోనే లవ్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు.

Latest Survey : The Growing Culture of Online Dating in India, Is It Better For Future

ఈ నేపథ్యంలోనే మన దేశంలో ఆన్ లైన్ డేటింగ్ విపరీతంగా పెరిగిపోయిందట. ఇదే విషయాన్ని తాజాగా సర్వే చేసిన ఓ సంస్థ వెల్లడించింది. ఈ సర్వేలో ఆన్ లైన్ డేటింగ్ కల్చర్ కు సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయట. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

అమ్మాయిల వివాహ వయసు 18 నుండి 21 ఏళ్లకు ఎందుకు పెంచారో తెలుసా...అమ్మాయిల వివాహ వయసు 18 నుండి 21 ఏళ్లకు ఎందుకు పెంచారో తెలుసా...

ఆన్ లైన్ డేటింగ్..

ఆన్ లైన్ డేటింగ్..

ఏ సమయాన స్మార్ట్ ఫోన్ మన చేతుల్లోకి వచ్చి పడిందో.. ఇంటర్నెట్ చౌకగా లభించడం ఎప్పుడు స్టార్టయ్యిందో అప్పటి నుండి ఆన్ లైన్ డేటింగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది. డేటింగ్ కోసం ప్రత్యేకంగా రోజుకో కొత్త యాప్ వస్తుండటం.. అవి ప్రతి ఒక్కరినీ టెంప్ట్ చేయడం వల్ల ఈ కల్చర్ రోజరోజుకు చాలా వేగంగా విస్తరిస్తోంది.

డేటింగ్ కల్చర్..

డేటింగ్ కల్చర్..

ఒకప్పుడు మన దేశంలో డేటింగ్ అనే మాట వింటేనే బూతుగా భావించేవారు. అదేదో తప్పుడు పనిగా భావించేవారు. నలుగురిలో ఆ పదాన్ని వాడేందుకు ఇష్టపడేవారు కాదు. దాన్ని బ్యాడ్ కల్చర్ గా భావించేవారు. అయితే ప్రస్తుత కాలంలో మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడే డేటింగ్ అనేది కూడా ఒక కల్చర్ లా మారిపోయింది. ముఖ్యంగా యువతకు ఇది ఒక వరంలా మారిపోయింది.

హైదరబాదే ఫస్ట్..

హైదరబాదే ఫస్ట్..

ఈ ఆన్ లైన్ డేటింగుకు సంబంధించి ఇటీవల ఓ సంస్థ సర్వే నిర్వహించగా అందులో మన హైదరాబాద్ తొలి స్థానంలో రావడం అందరినీ షాకయ్యేలా చేసింది. ప్రముఖ టిండర్స్ ఇయర్ ఇన్ స్వైప్ 2021 పేరుతో నిర్వహించిన సర్వేలో చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పూణె నగరాలు ఉన్నాయి.

వీటిపై ఆసక్తి చూపారట.

వీటిపై ఆసక్తి చూపారట.

2021 సంవత్సరంలో జనవరి 1 నుండి నవంబర్ 30 వరకు టిండర్ సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో ఎక్కువగా 18 నుండి 25 సంవత్సరాల వయసు ఉన్న వారి నుండి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. వీరిలో ఎక్కువగా పిక్ నిక్ ఇన్ ఎ పార్క్, వర్చువల్ మూవీ నైట్, సైక్లింగ్, పొట్టెరీ అంశాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపించారట.

వీడియో కాల్స్..

వీడియో కాల్స్..

పైన చెప్పిన విషయాలన్నీ వీడియో కాల్ లోనే చేశారట. అందుకే వీడియో కాల్ వ్రుద్ధిలో 52 శాతం సాధించినట్లు ఆ సంస్థ వివరించింది. మరోవైపు కరోనా కూడా డేటింగ్ విపరీతంగా పెరిగేందుకు ఓ కారణంగా చెబుతోంది ఆ సంస్థ. గత రెండు సంవత్సరాలు ఒకరినొకరు నేరుగా కలవలేని పరిస్థితి ఏర్పడటంతో ఈ కల్చర్ కు చాలా మంది అలవాటు పడిపోయారు.

ఫేక్ డేటింగ్ సంస్థలు..

ఫేక్ డేటింగ్ సంస్థలు..

మరోవైపు ఫేక్ డేటింగ్ కంపెనీలు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఎవరైతే అమాయకంగా ఉంటారో.. వారిని సులభంగా మోసం చేస్తున్నారు. డేటింగ్ యాప్ ల ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న మోసాల్లో 33 శాతం క్యాట్ ఫిషింగ్, 38 శాతం తెలియని లింకులు, లేదా అటాచ్ మెంట్లు, 36 శాతం మంది ఫోన్లలో డేటా చోరీ జరిగినట్లు కాస్పర్ స్కీ గ్లోబర్ సర్వేలో వెల్లడైంది.

డేటింగ్ యాప్ మాయ..

డేటింగ్ యాప్ మాయ..

పేరు తెలియదు.. ఊరు తెలియదు.. కనీసం ఎలా ఉంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. కేవలం అందమైన ప్రొఫైల్ పిక్స్ చూసి ఫాలో అయిపోవడం, ఆన్ లైనులో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం.. వారు చెప్పిందల్లా చేయడం.. గుడ్డిగా నమ్మేయడం వల్ల చాలా మంది మోసపోతున్నారు. ఇటీవలి కాలంలో మన భాగ్యనగరంలో ఇలాంటి మోసాలు బాగా పెరిగిపోయాయి. డేటింగ్ అంటూ ఆఫర్ వస్తే.. బలహీనతను ఆసరాగా తీసుకుని కొందరు తమ అకౌంట్లలో డబ్బులు ఖాళీ చేసుకుంటున్నారు. ఇలాంటి వారిలో యువకులే కాదు.. యువతులు కూడా ఉండటం గమనార్హం.

దీర్ఘకాలంలో సమస్యలు..

దీర్ఘకాలంలో సమస్యలు..

ఈ డేటింగ్ యాప్ ల గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ఈ ఆన్ లైన్ డేటింగ్ యాప్ ల వల్ల దీర్ఘకాలంలో చాలా సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. ఎందుకంటే చాలా మంది ఫేక్ డిటైల్స్ ను గుర్తించలేకపోతున్నారు. కొన్ని డేటింగ్ యాప్స్ బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేయడం లేదు. విదేశాల్లో ఈ డేటింగ్ కల్చర్ గురించి పెద్దగా పట్టించుకోరు. అక్కడ ఇద్దరు వ్యక్తుల ఆలోచనలు, ప్రవర్తన, అభిరులు కలిస్తే చాలు. అయితే మన దేశంలో అలా ఉండటం లేదు. మనలో చాలా మంది కొత్త పరిచయాలు.. కొత్త వారితో కాస్త కాలక్షేపం చేయొచ్చని ఈ రూట్ ను ఎంచుకుంటున్నారు. ఇదంతా తొలిరోజుల్లో బాగానే ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదురవుతాయని టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

English summary

Latest Survey : The Growing Culture of Online Dating in India, Is It Better For Future

Here we are talking about the latest survey:the growing culture of online dating in India, is it better for future. Have a look
Story first published:Tuesday, December 21, 2021, 14:17 [IST]
Desktop Bottom Promotion