Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
Relationship Tips: మీ సంబంధంలో సాన్నిహిత్యం ఎంత ఉంది, ఇలా తెలుసుకోండి
సాన్నిహిత్యం పెరగడానికి అనేక స్థాయిలు ఉంటాయి. అయితే చాలా మందికి ఇవి ఏమిటో తెలియకుండానే సాన్నిహిత్యం పెరిగిపోతుంది. మీకు మీ భాగస్వామికి మధ్య సాన్నిహిత్యం ఉందా.. ఉంటే అది ఏ స్థాయిలో ఉందో ఇలా తెలుసుకోండి.
సాన్నిహిత్యం.. ఈ మాట వినగానే మనకు మదిలో చాలా మెదులుతుంటాయి. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల మధ్య బంధాన్ని సాన్నిహిత్యంగా వర్ణిస్తాం. అది శారీరకంగా అయినా, మానసికంగా అయినా. ఒకరు ఎవరితోనైనా కనెక్ట్ అయ్యారంటే.. వారి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, వారి గురించే ఎక్కువగా అలోచించడం, వారితో కలిసి ఉన్నంత సేపు చాలా సంతోషంగా ఉండడం వల్ల సాన్నిహిత్యం రోజురోజుకూ అభివృద్ధి చెందుతుంది.

ఇద్దరి మధ్య ఏర్పడే స్నేహం కాలక్రమేణా సాన్నిహిత్యంగా మారుతుంది. ఈ సాన్నిహిత్యం పెరగడానికి అనేక స్థాయిలు ఉంటాయి. అయితే చాలా మందికి ఇవి ఏమిటో తెలియకుండానే సాన్నిహిత్యం పెరిగిపోతుంది. మీకు మీ భాగస్వామికి మధ్య సాన్నిహిత్యం ఉందా.. ఉంటే అది ఏ స్థాయిలో ఉందో ఇలా తెలుసుకోండి.

నార్మల్ కమ్యూనికేషన్:
ఈ నార్మల్ కమ్యూనికేషన్ అనేది ప్రతీ ఒక్కరి మధ్య ఉంటుంది. ఇందులో ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే వంటి ప్రశ్నలు ఉంటాయి. అయితే ఈ కమ్యూనికేషన్ లో ఇంతకు మించిన ప్రశ్నలు ఉండవు. ఇదా చాలా సర్వసాధారణమైన విషయం.

వాస్తవాల కమ్యూనికేషన్:
ఈ స్థాయిలో పలు అంశాల గురించి వాస్తవాల కమ్యూనికేషన్ ఉంటుంది. మూడో స్థాయి సాన్నిహిత్యం కారణంగా చాలా సంబంధాలు ఈ రెండు ప్రారంభ స్థాయిల మధ్య తిరుగుతుంటాయి. ఇందులో పెద్ద పెద్ద అంశాల గురించి ప్రస్తావనం ఏం ఉండదు.

అభిప్రాయాలు:
ఇద్దరి వ్యక్తుల మధ్య అభిప్రాయాలు చాలా ప్రాధన్యతను ఇస్తాయి. మీరు ఒకరితో ఒకరు దగ్గరవుతున్నప్పుడు ఒకరికొకరు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. అయితే ఇలా అభిప్రాయాలు పంచుకోవడానికి నమ్మకం అవసరం. అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న తేడాలను మనం అర్థం చేసుకోవాలని అంగీకరించాలి.

ఆశలు, కలలు:
ఈ స్థాయిలో మన ఆశలు మరియు కలలను పరస్పరం పంచుకుంటారు. జీవితంలో ఎలాంటి స్థితిలో మిమ్మల్ని మీరు చూడాలనుకుంటున్నారు, ఎలాంటి లక్ష్యాల కోసం కృషి చేస్తున్నారు, ఈ స్థాయిలోనే మనం మన కలలను పంచుకోవడం మరియు వాటిని కలిసి నిర్మించడం ప్రారంభిస్తాము.

భావాలు:
ఇలాంటప్పుడు మనం మన భావాలను పరస్పరం పంచుకుంటాం. అవతలి వ్యక్తికి వారి అనుభూతిని పంచుకోవడానికి స్థలం ఇస్తున్నప్పుడు మీ స్వంత అనుభూతిని గుర్తించగలగడం ఇక్కడ ముఖ్యం.

ఆలోచనలు, భయాలు, వైఫల్యాలు:
ఈ స్థాయిలో, మన వ్యక్తిత్వంలోని కొన్ని చీకటి భాగాలను పంచుకుంటారు. మనలో చాలా మందికి అనేక ఆలోచనలు ఉంటాయి. వాటిని ఎవరితోనూ పంచుకోకూడదనుకుంటాం. ఈ స్థాయికి లోతైన నమ్మకం అవసరం.

అవసరాలు:
అత్యున్నత స్థాయి సాన్నిహిత్యం, శారీరక, మానసిక, భావోద్వేగ అవసరాలు ఈ స్థాయిలో ఉంటాయి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కూర్చుని తమ అవసరాలను ఒకరికొకరు పంచుకుంటారు.



Click it and Unblock the Notifications