For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ కార్యం గురించి అబ్బాయిలకు ఉండే అపొహలేంటో తెలుసా...

|

ప్రస్తుత సమాజంలో సెక్స్ గురించి ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా స్కూల్ లైఫ్ నుండే సెక్స్ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల.. చాలా మందిలో శృంగారంపై అవగాహన ఏర్పడుతోందనుకుంటే మనం తప్పులో కాలేసినట్టే.

ఎందుకంటే చాలా మందికి శృంగారం విషయంలో వాస్తవాల కంటే అవాస్తవాలే ఎక్కువగా చెబుతున్నారు కొందరు. ఇలాంటి కారణాల వల్లే శృంగారం విషయానికొచ్చేసరికి మగాళ్లు.. మహిళల ఇష్టాలు, అభిరుచులు.. ఆసక్తులు మారిపోతూ వస్తున్నాయి.

సాధారణంగా యవ్వనంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క మగాడికి.. అమ్మాయికి ఆ కార్యం గురించి తెలుసుకోవాలనే ఆరాటం కొంత ఎక్కువగానే ఉంటుంది. అయితే మహిళల విషయానికొచ్చేసరికి వారి కన్నె పొరకు లింకు పెట్టి.. పెళ్లికి ముందు సెక్స్ లేదా.. ఆ కార్యంలో పాల్గొనడం వల్ల వర్జిన్ కాదనే ఫీలింగ్ లోకి నెట్టేస్తున్నారు. అదే సమయంలో కొందరు మహిళలు శృంగార విషయాలు అస్సలు మాట్లాడకూడదనే భావనలో ఉన్నారు.

అయితే మగవారు మాత్రం రెగ్యులర్ శృంగారం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటూ.. వారు పెళ్లికి ముందు ఆ కార్యంలో పాల్గొనడాన్ని మగతనంగా భావిస్తుంటారు. ఇందులో ఎలాంటి తప్పు లేదనే ఫీలింగులో ఉంటారు. ఎందుకంటే మగాళ్లకు శీలం విషయంలో కొన్ని వెసులుబాట్లు ఉంటాయని.. ఇవన్నీ యుక్త వయసుల్లోనే వారి బ్రెయిన్లో నాటుకుపోతున్నాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక అప్పటి నుండి వారిలో కొన్ని సందేహాలు, అనుమానాలు, అపొహల వల్ల వారి వైవాహిక జీవితంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో కొందరు మగవారికి సెక్స్ విషయంలో కొన్ని అవాస్తవాలు చెబుతుంటారు కొందరు. ఈ కారణంగా వారి భాగస్వామిని అర్థం చేసుకోకపోవడం.. భాగస్వామిపై అనుమానపడటం.. లేదా సినిమాల్లో చూపించినట్టు అపరిమితంగా.. అదే పనిగా ఆ కార్యంలో పాల్గొనే ప్రయత్నాలు చేస్తుంటారు.. ఇంతకీ అబ్బాయిలకు శృంగారానికి సంబంధించి ఎక్కువగా ఎలాంటి అబద్ధాలు చెబుతారో ఇప్పుడు తెలుసుకుందాం రండి...

అలాంటి భర్తలతో జర భద్రం.. లేదంటే జీవితాంతం బాధపడాల్సిందే...!అలాంటి భర్తలతో జర భద్రం.. లేదంటే జీవితాంతం బాధపడాల్సిందే...!

శృంగారం అంటే..

శృంగారం అంటే..

సాధారణంగా శృంగారం విషయానికొస్తే కన్యత్వం.. కన్నెపొర అనేవి అత్యంత సహజమైన విషయాలు. అయితే ఇవి పరిమితంగా ఉంటాయి. ఇక శృంగారం అంటే.. యోనిలోకి పురుషాంగం ప్రవేశించడమే అనేది మగాళ్ల మెదళ్లలో తరతరాలుగా నాటుకుపోయింది. కాకపోతే ఇందులో ఓరల్ సెక్స్, ఆనల్ సెక్స్ కు కొంత వెసులుబాటు ఇచ్చారు. అంతేకాదు ఈ అవగాహనల్లో LGBTQ వ్యక్తుల గురించి వారి లైంగిక ఆసక్తి గురించి అస్సలు మాట్లాడరు. అయితే శృంగారం అంటే కేవలం యోనిలోకి అంగ ప్రవేశం మాత్రమే కాదు.. వ్యక్తులను బట్టి అది మారుతుందని.. ఎదుటి వ్యక్తి పూర్తిగా మానసిక, శారీరక స్థాయిలో కలిస్తేనే అసలైన శృంగారం అని మగాళ్లను తెలియజేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

మగాళ్లపై రేప్..

మగాళ్లపై రేప్..

చాలా మందికి మగాళ్లపై రేప్ అనేది జరగదని.. కేవలం ఇది ఆడవారిపైనే జరుగుతుందనే అపొహ ఉంది. మన సమాజంలో రేప్ అనేది అత్యంత దారుణమైన నేరం. అయితే అమ్మాయిల విషయంలో వచ్చింత అత్యాచారాల వివరాలు.. అబ్బాయిల మీద జరిగిన అత్యాచారాల వివరాలు వెలుగులోకి రావడం లేదు. వీరి మీద జరిగే అత్యాచారాలు, హింస గురించి తక్కువగా నివేదికలు వెల్లడవుతున్నాయి. దీంతో మగాళ్లను రేప్ చేయలేరనే భావన కలుగుతోంది. అయితే ఇది సరైంది కాదు.. చిన్నవయసు నుండి లైంగిక దాడికి గురయ్యే మగవారు కూడా ఉంటారు. ఈ విషయాలనే ఈ తరం అబ్బాయిలకు తెలియజేయాలి. అత్యాచారం అనేది ఆడవారు, మగవారికి ఇద్దరికి సమాన స్థాయిలోనే ఉంటుందని.. మగవారు కూడా రేప్ కు గురయ్యే సందర్భాలు ఉంటాయని తెలియజెప్పాలి.

అవి చూస్తే..

అవి చూస్తే..

మనలో చాలా మంది పోర్న్ చూడటం అంటే అశ్లీలంగా భావిస్తారు. అదొక అపవిత్రమైన అనే ఫీలింగులో ఉంటారు. కానీ అది శృంగారం కాదని.. మనం మగాళ్లకు తెలియజేయాలి. శృంగార విద్యకు పోర్న్ పరిచయం అనేది తప్పనిసరి కాదనే విషయాన్ని చాలా మంది మగాళ్లు తెలుసుకోవాలి. అలాంటి వీడియోలను, సినిమాలను ఎక్కువగా చూడటం వల్ల అందుకు సంబంధించిన సున్నితత్వం పోయి.. మొరటుగా మారే ప్రమాదమూ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అలాంటి విషయాల్లో అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలి.

నూతన వధూవరులు ఎదుర్కొంటున్న దారుణమైన లైంగిక సమస్యలు ఏమిటో మీకు తెలుసా?నూతన వధూవరులు ఎదుర్కొంటున్న దారుణమైన లైంగిక సమస్యలు ఏమిటో మీకు తెలుసా?

భావప్రాప్తి విషయంలో..

భావప్రాప్తి విషయంలో..

చాలా మంది కపుల్స్ కు ఇలాంటి విషయంలోనే గొడవలు ప్రారంభమవుతుంటాయి. ముఖ్యంగా చాలా మంది మగాళ్లు ఆ కార్యంలో పాల్గొన్నప్పుడు.. తమకు భావప్రాప్తి కాగానే.. శృంగారం చేయడాన్ని ఆపేసి.. తమకేమీ సంబంధం లేదన్నట్టు నిద్రలోకి జారుకుంటారు. తమ పార్ట్ నర్ సంతోషపడ్డారా లేదా సుఖపడ్డారా అనే విషయాలను అస్సలు పట్టించుకోరు. అలా వారు స్వార్థపూరితంగా ఆలోచించడం వల్ల ఇద్దరికీ ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఇలాంటి విషయాలను అబ్బాయిలకు చిన్న విషయంలోనే అవగాహన కల్పించాలి. అప్పుడే వారు పెద్దయ్యాక వైవాహిక జీవితాన్ని సాఫీగా సాగిస్తారు.

ఎక్కువ సమయం..

ఎక్కువ సమయం..

చాలా మంది అబ్బాయిలు పోర్న్ సినిమాల్లో చూసినట్టు.. తాము కూడా ఆ కార్యంలో పాల్గొన్నప్పుడు ఎక్కువ సమయం పాటు ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ వాస్తవ జీవితంలో అలా అస్సలు ఉండదు. ఒకవేళ పోర్న్ సినిమాల్లో చూపించినట్టు గంటల తరబడి అదే పనిగా ఆ కార్యంలో పాల్గొంటే ఏ మాత్రం సంతోషంగా అనిపించదు. అంతేకాదు ఇద్దరికీ తీవ్రమైన అసౌకర్యం ఏర్పడుతుంది. లేనిపోని కొత్త సమస్యలు వచ్చి పడతాయి.

English summary

Lies We Need To Stop Teaching Boys About sex

Here we are talking about the lies we need to stop teaching boys about sex. Have a look
Story first published: Monday, August 2, 2021, 18:59 [IST]