Latest Updates
-
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు!
అలాంటి మగాళ్లంటే అమ్మాయిలు పడి చస్తారంట...!
చాలా మంది మగవారు అమ్మాయిల మనసులో ఏముందో ముందుగానే గుర్తించాలట.
పెళ్లి అయిన ప్రతి జంట లేదా ప్రేమలో ఉన్న ప్రతి జంట తమ భాగస్వాముల మనసులో ఏముందో ఒకరినొకరు ముందుగానే తెలుసుకోగలిగితే... మీ వివాహ బంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉండే వారికి పెళ్లి వరకు తీసుకెళ్తుంది.

అప్పుడే వారి బంధం చాలా సంతోషంగా ఉంటుంది.. అయితే అబ్బాయిలు చెప్పినంత సులభంగా విషయాలను అమ్మాయిలు ఓపెన్ గా చెప్పలేరు. అందుకే చాలా మంది మగవారు అమ్మాయిల మనసులో ఏముందో ముందుగానే గుర్తించాలట. అలా తమ మనసు తెలుసుకునే వారిపైనే అమ్మాయిలు వాళ్ల మనసును పారేసుకుంటారట.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే అసలు విషయానికొస్తే, కలయిక సమయంలో మహిళలు పురుషుడి నుండి చాలా ఎక్కువ స్పందనను కోరుకుంటారట. తమ భాగస్వామి తమను చూడగానే మత్తెక్కిపోవాలని.. తనపై చాలా ప్రేమతో మరియు తీవ్రమైన కోరికలతో దగ్గరగా రావాలని ఆశిస్తారట.

తనంటే క్రేజ్...
చాలా మంది మహిళలు తామంటే చాలా ఎక్కువగా ఇష్టపడే వారే తమ భాగస్వామి కావాలని కోరుకుంటారట. అంతేకాదు ఆమె అంటే అతడికి చాలా క్రేజ్ కూడా ఉండాలనుకుంటుందట.

తనను సుఖపెట్టాలని..
కలయికకు ముందు తమను ప్రేమగా దగ్గరగా తీసుకుని ముద్దులతో ముంచేయాలని ప్రతి మహిళ కోరుకుంటుందట. అంతేకాదు కలయికలోని ప్రతి చర్యనూ తమ భాగస్వామి ముందుగానే అర్థం చేసుకుని తమను సుఖపెట్టాలని భావిస్తారట. అలాగే తమ మనసులో ఏదైతే కోరుకుంటామో అలాంటి వాటిని అర్థం చేసుకునే మగాడంటే మహిళలు పడి చస్తారటం.

అమ్మాయిల సైకాలజీ ప్రకారం..
మహిళల సైకాలజీ ప్రకారం వారు శారీరక ఆనందం కంటే మానసిక సంతోషాన్నే ఎక్కువగా కోరుకుంటారట. అందుకే తనను అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే చాలు అని భావిస్తారట. అంతేకాదు అలాంటి వారు దొరికితే వారు ఎప్పటికీ అతడిని విడిచి ఉండలేరట.

నిపుణులు ఏం చెబుతున్నారంటే..
రొమాన్స్ గురించి నిపుణులు ఏమి చెబుతున్నారంటే.. చాలా మంది పురుషులు రొమాన్స్ అంటే సినిమాల్లో చూపించినట్టు భావిస్తున్నారని, అది వాస్తవం కాదని, రొమాన్స్ అంటే కేవలం ముద్దుల్లో ముంచెత్తడమే కాదని అంటున్నారు. నిజ జీవితంలో అసలైన రొమాన్స్ రుచి చూపించిన వాళ్లకే అమ్మాయిలు ఫిదా అయిపోతారట.

కేరింగ్..
చాలా మంది అమ్మాయిలు తమపై ప్రేమ, కేరింగ్ చూపించడాన్ని కూడా రొమాన్స్ గానే భావిస్తారట. ఉదాహరణకు రోడ్డు దాటేటప్పుడు వారి చేయి పట్టుకుని, వారికి సహాయం చేసినప్పుడు, ఏదైనా విషయంలో భయపడినప్పుడు వారిని దగ్గరికి తీసుకుని ఓదారిస్తే.. ఎంతమందిలో ఉన్నా కూడా వారిని దగ్గరకు తీసుకుని ప్రేమగా మాట్లాడితే.. అలాంటి వాటి గురించి ఎక్కువగా ఆస్వాదిస్తారట.

ముఖ్యమైన తేదీలను..
వీటితో పాటు ఆమె స్నేహితులకు ప్రాధాన్యత ఇవ్వడం.. పుట్టినరోజులు, ముఖ్యమైన తేదీలు మర్చిపోకుండా ఉండటమనే చాలా ముఖ్యం. వాటిని గుర్తు పెట్టుకుని వారికి ప్రతిసారి విషెస్ చెబుతూ ఉండాలట. అంతేకాదు అవసరమైతే వాళ్ల ఇంట్లో వారి పుట్టినరోజులు, పెళ్లిరోజులను కూడా గుర్తుంచుకోవాలట..

ఇలా చేస్తే ఇంప్రెస్...
అమ్మాయిలను ఎక్కువగా ఆశ్చర్యపరిస్తే, వారు ఎక్కువగా ఇష్టపడతారట. తమకు నచ్చినవి వారికి బహుమతులుగా ఇవ్వడం.. ఏదైనా అవుటింగ్ కి ప్లాన్ చేయడం వంటివి చేస్తే, అమ్మాయిలు ఈజీగా ఇంప్రెస్ అయిపోతారట.

వారికే ప్రాముఖ్యత..
అన్నింటికంటే ముఖ్యమైన విషయేమిటంటే.. వారు మీకు ఎంత ముఖ్యమో తెలియజేయాలంట. మీరు ఎవరితోనూ షేర్ చేసుకోలేని విషయాలను తనతో షేర్ చేసుకోవాలి. అప్పుడే మీరు తనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఆమె గుర్తిస్తుందట.

తమను గుర్తుంచుకునేవారిని..
ఇక ప్రతి నిమిషం తనను గుర్తుంచుకుని మెసెజ్ లు మరియు వాట్సాప్ చేసే వారిని.. అమ్మాయి అందాలను ఎక్కువగా పొగిడేవాళ్లను అమ్మాయిలు త్వరగా ఇష్టపడతారట. ‘నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతా‘ ‘నీవు లేని క్షణాన్ని ఊహించుకోలేకపోతున్నా‘ అన్న మాటలకు లేదా మేసేజ్ లకు అమ్మాయిలు చాలా బాగా ఆకర్షితులవుతారని నిపుణులు చెబుతున్నారు.

ఏ విషయానికైనా..
అమ్మాయిలకు ఏ విషయమైన మీతో చెప్పుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో చాలా మందికి పాత ప్రేమ కథలు ఉంటాయి. వాటిని ఇతరులతో చెప్పుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ మనసులో ఆ కథలను తలచుకుని బాధపడుతూ ఉంటారు. అలా వారు బాధపడకూడదంటే.. అలాంటి విషయాలను చెప్పుకునేంత స్వేచ్ఛను ఇవ్వాలి.

ఫీలింగ్స్ కు రెస్పెక్ట్..
మీరు ఎప్పుడూ మీ వైపు కాకుండా ఆలోచించకుండా.. మీ భాగస్వామి గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి. వారు ఏదైనా విషయంలో నో చెబితే.. ఎందుకు నో చెబుతున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ల ఫీలింగ్సుని గౌరవించే వాళ్లని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట.



Click it and Unblock the Notifications
