For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రేమ జాతకం ఫిబ్రవరి 2020 : ఈ 2 రాశుల వారు ప్రేమలో మునిగి తేలుతారట! మీ రాశి కూడా ఉందేమో చూడండి...

|

ఎవరికైనా తమ భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంటుంది. అందుకే మన దేశంలో తమ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు జ్యోతిష్యశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటారు. వారి రాశి చక్రాలపై నక్షత్రాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది..

గ్రహాల ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలుసుకుంటూ ఉంటారు. ఫిబ్రవరి నెల అంటే వాలెంటైన్ మాసం కాబట్టి ఈ నెలలో చాలా మంది తమ ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ నెలలో తమ జీవిత భాగస్వామి తమకు దొరుకుతారా? లేదా ఎప్పటిలాగే ఈసారి కూడా దురదృష్టమే మిగులుతుందా? అనే ప్రశ్నలు మీ మనసులో మెదలుతూ ఉంటే అందుకు సమాధానాల కోసం ఫిబ్రవరి నెల ప్రేమ జాతకాన్ని చూడండి...

వాలెంటైన్ వీక్ 2020 : ఏడు రోజులు.. ఏడు వింతలు.. ఏడు పద్ధతులు.. మీ ప్రేమ బంధానికి పునాదులు...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారు మొండి పట్టుదల గలవారు. కానీ ఈ నెలలో మాత్రం తమ సున్నితమైన మనసును తమ భాగస్వామి కోసం చూపుతారు. వీరిలో ఇప్పటికే ప్రేమలో ఉన్న వారు తమ ప్రియురాలు లేదా భాగస్వామితో కలిసి కొత్త ప్రదేశాలను సందర్శించవచ్చు. అయితే ఖర్చుల విషయంలో కొంత నియంత్రణ పాటించాలి. లేకపోతే ఈ నెలలో మీ జేబు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి ఈ నెలలో కొంత వింతగా అనిపించవచ్చు. మీరు ఈ నెల ప్రేమను వ్యక్తపరచడంలో సానుకూలంగా ఉంటారు. మీ ప్రేమ జీవితంలో మీరు ఏమి కావాలనుకుంటున్నారో వాటిని ఓపెన్ గా చెప్పేయాలి. మీరు మీ భాగస్వామిని ఈ నెలలో మరింత ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ వారి మనసును తెలుసుకున్న సమయంలో మాత్రమే.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ నెలలో ప్రేమ విషయంలో ఈ రాశి వారికి చాలా అదృష్టం కలిసి వస్తుంది. మీకు అనేకమైన మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. మీరు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని, మీరు ప్రయోజనం పొందుతారు.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ వాలెంటైన్ మాసం మీ జీవితంలో చాలా ఆశ్చర్యాలను తెస్తుంది. మీ భాగస్వామి మీ విధేయతను పరీక్షించడానికి మీకు అవకాశం లభిస్తుంది. అయితే విడిపోయిన వారు మాత్రం ఎందుకు విడిపోయారనే విషయాలపై ఎక్కువగా ఆలోచిస్తారు. ఇలా చేయకుండా మీరు వర్తమానంలో ప్రారంభించండి.

ఆయనకు ఆరోది.. ఆమెకు ఐదోది.. అయితే ఇద్దరికీ 12 రోజుల్లోనే చెడింది.. అంతే ఆ పెళ్లి పెటాకులయ్యింది...

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు ఈ నెలలో చాలా సంతోషంగా ఉంటారు. ఇందుకు మీ భాగస్వామే కారణమని భావిస్తారు. ఈ నెలలో మీరు ఒకరినొకరు ప్రేమించుకోవటానికి, ప్రతి క్షణం ఆనందంగా కలిసి జీవించడానికి అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉన్న వ్యక్తితో మీరు ఉండటం మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.

కన్య రాశి..

కన్య రాశి..

మీ రాశి చక్రంలోని గ్రహాలలో కదలికల వల్ల మీకు ఈ నెలలో ప్రేమలో రెండో అవకాశం కూడా లభిస్తుంది. ఇది మీకు చాలా అవసరం కూడా. గతంలో మీరు చేసిన తప్పుల వల్ల మీరు బాధపడుతుంటే, ఈ నెల వాటిని మెరుగుపరిచేందుకు కూడా అవకాశం వస్తుంది. మీ సంబంధాన్ని బలోపేతం చేసుకునేందుకు మాట్లాడేందుకు ప్రయత్నించండి. ఇది మీకు కచ్చితంగా సహాయపడుతుంది.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారికి ఈ నెలలో ప్రేమ జీవితం నిండుగా ఉంటుంది. ఈ వాలెంటైన్ మాసంలో మీ కలలు నెరవేరుతాయి. అయితే ఎలాంటి పొరపాటు చేయకండి. ఎందుకంటే ఇది మానసిక స్థితిని పాడు చేసే అవకాశం ఉంది. ఈ నెలలో మీకు పూర్తి అదృష్టం లభిస్తుంది.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ నెలలో ఈ రాశి వారు చాలా ఓపిక, సహనంతో ప్రేమ విషయంలో ఓ మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే తొందరలో తీసుకునే నిర్ణయాల వల్ల మీరు ఎక్కువగా నష్టపోవచ్చు. అందుకే ఈ వాలెంటైన్ మాసం మీకు చాలా నెమ్మదిగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.

న్యాచురల్ స్టార్ నాని ప్రేమ కథ అల భాగ్యనగరంలో మొదలైందట...

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు ఈ వాలెంటైన్ మాసంలో కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే మీరు కోపంగా ఉండే ప్రవర్తన మీ భాగస్వామిని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే మీ శక్తి వల్ల మీరు సంతోషపడే సానుకూల విషయాలు కూడా ఉంటాయని మీరు గ్రహించాలి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు ఫిబ్రవరి నెలలో ప్రేమ కోసం చాలా కష్టపడతారు. ఈ నెల మీకు చాలా అవకాశాలు మీ చెంత వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఆనంద అవకాశాలు మీతో ఎక్కువ కాలం పాటు ఉండవు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు ఫిబ్రవరి నెలలో అదృష్టవంతులు కావాలంటే మీ భావాలను మీరు ధైర్యంగా బయటపెట్టాలి. అయితే మీరు ఎమోషనల్ గా ఉండటానికి ఇష్టపడరు. అయితే మీరు ఒక రిస్క్ తీసుకోవాలి. మీ జీవితంలో మీరు ప్రేమను కోరుకుంటే, అది మీ భాగస్వామికి కూడా చూపించాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు ఈ వాలెంటైన్ నెలలో తమ ప్రేమ జీవితం గురించి ఓ అంచనా వేస్తారు. అయితే మీకు ఈ నెలలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని మీరు గ్రహించాలి. అప్పుడే మీరు మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళతారు. మీరు పాత విషయాలను పక్కన పెట్టేయాలి. వర్తమానంలో జీవించడాన్ని అలవాటు చేసుకోవాలి.

English summary

Love Horoscope February 2020: Who Would Get Lucky In Love This Valentine Month

Valentines week is just a two days ahead and we know you will be excited for celebrating it with your partner/spouse. But how about knowing your love horoscope for this month? Therefore, we have brought the same for you.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more