For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త ఏడాదిలో ఈ రొమాంటిక్ రిజల్యూషన్స్ మీ లైఫ్ ను మార్చేయొచ్చు...

|

కరోనా వంటి కష్టకాలంలో మనం రెండేళ్లు పూర్తి చేసుకున్నాం.. ఇప్పుడు కరోనాకు టీకా విరుగుడు ఉందనుకునేలోపే అది కొత్తగా ఓమిక్రాన్ రూపంలో మనల్ని మరింత ఇబ్బంది పెడుతోంది.

ఈ నేపథ్యంలోనే కొత్త ఏడాదిలోకి మనమంతా కోటి ఆశలతో.. కొత్త ఉత్సాహంతో అడుగుపెట్టేశాం. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ లైఫ్ లో కొత్త కొత్త మార్పులు కావాలని.. కొత్త కొత్త అలవాట్లు చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

అందుకోసం కొన్ని కొత్త రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు. దీంతో తాము మరింత ఉత్తమంగా మారిపోయేందుకు ఉపయోగపడుతుందని భావిస్తారు. ఇదిలా ఉండగా.. ఈ కొత్త ఏడాదిలో కొంచెం కొత్తగా ఉండే..రిజల్యూషన్స్ ను ప్రయత్నించి చూడండి.. ఇది మిమ్మల్ని మీ పార్ట్నర్ కు మరింత దగ్గర చేసేస్తాయి. కేవలం మానసికంగానే కాదు.. శారీరకంగా కూడా మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిపోతుంది. ఈ సందర్భంగా ఆ రొమాంటిక్ రిజల్యూషన్స్ ఏంటి.. ఈ కొత్త ఏడాదిలో మరింత కొత్తగా మారిపోయేందుకు ఎంతగా తోడ్పడతాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

చలికాలంలో ఈ భంగిమలు ట్రై చేస్తే.. రెట్టింపు మజాను పొందుతారట...!

కొత్త భంగిమలు..

కొత్త భంగిమలు..

మీకు ఏదైనా భంగిమ నచ్చితే అదే యాంగిల్లో ఎక్కువగా ఆ కార్యంలో పాల్గొంటున్నారా? అది మీ కాపురానికి మంచిదే. కానీ కొత్త ఏడాదిలో మరికొన్ని కొత్త భంగిమలు ట్రై చేయడం వల్ల మీ పార్ట్నర్ ఎంతో హ్యాపీగా ఫీలయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు రెట్టింపు సంతోషాన్ని పొందేందుకు ప్రతిసారీ కొన్ని కొత్త భంగిమలను ప్రయత్నించండి.

కిస్ చేయండి..

కిస్ చేయండి..

ఆలుమగలు అన్నాక రొమాన్స్ చేసుకోవడం సర్వసాధారణం. భార్యభర్తలు రెగ్యులర్ గా కిస్ చేసుకోవడం వల్ల బ్రెయిన్ రిలాక్స్ అవుతుందట. దీంతో మీ ఇద్దరి మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది. మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి.. మీ మూడ్ మారిపోవడమే కాదు.. మీరు ఎక్కువ హ్యాపీగా ఉండేలా చేస్తుంది.

ప్రయోగాలు చేయండి..

ప్రయోగాలు చేయండి..

మీకు ఆ కార్యంలో పాల్గొనే ఇష్టం లేనప్పుడు.. మీ భాగస్వామికి గనుక మూడ్ ఉంటే.. వారికి ఇష్టమని ఓకే చెప్పడం వంటివి చేయకండి. ఈ ఏడాది ఇతరుల గురించి ఇతరుల గురించి ఆలోచించే కంటే ముందుగా మీ గురించి ఓ నిర్ణయానికి రండి. అది మీ పార్ట్నర్ అయినా.. ఇంకెవరైనా.. ఇక ఏవైనా ప్రయోగాలు చేయాలనుకుంటే.. అందుకు చాలా మార్గాలున్నాయి. అందుకు మూడ్ వస్తే చాలని గుర్తుంచుకోండి.

వ్యాక్సింగ్ విషయంలో..

వ్యాక్సింగ్ విషయంలో..

చాలా మంది అబ్బాయిలు లేదా అమ్మాయిలు రొమాన్స్ సమయంలో.. షేవింగ్ లేదా వ్యాక్సింగ్ చేసుకోలేదని.. దీంతో తమకు ఇబ్బంది ఎదురవుతుందని బాధపడుతుంటారు. అయితే రాత్రి సమయంలో మీరు అక్కడ వ్యాక్సింగ్ చేసుకోలేదని.. ఇబ్బంది పడుతుంటే.. అప్పుడు మీరెలా ఉన్నారో మీ పార్ట్నర్ చూపేందుకు ఇబ్బంది పడటం వంటివి చేయకపోవడమే మంచిది.

ఈ భంగిమలతో భావప్రాప్తి త్వరగా పొందుతారట...! మీరూ ట్రై చేసి చూడండి...

అద్భుతమైన అనుభవం కావాలంటే..

అద్భుతమైన అనుభవం కావాలంటే..

మీరు కలయిక సమయంలో మీ భాగస్వామి మీతో ఎలా ఉంటే బాగుంటుంది.. మీకు ఏం చేస్తే నచ్చుతుంది.. అలాగే తనకు ఏమంటే ఇష్టం.. ఎలాంటి విషయాలంటే ఇష్టం అనే విషయాలను మాట్లాడుకోండి. ఇలా ఇద్దరూ ఒకరినొకరు తమ అద్భుతమైన అనుభవాన్ని సొంతం చేసుకునే వీలుంటుంది.

ఇవి తప్పనిసరి..

ఇవి తప్పనిసరి..

మీరు ఎంతో కాలం నుండి మంచి రిలేషన్ షిప్ లో ఉండొచ్చు. అయితే మీరు ప్రతి ఆరు నెలలకు ఒకసారి మంచి టెస్టులు చేయించుకోవడం చాలా మంచిది. మీరు కనీసం ఏడాదికి ఒకసారైనా ఆసుప్రతికి వెళ్లి.. లేదా డాక్టర్ ను కలిసి కొన్ని రకాలైన టెస్టులు చేయించుకోవడం వల్ల మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు.

ఎక్కువ ఆలోచించొద్దు..

ఎక్కువ ఆలోచించొద్దు..

మీరు కలయికలో పాల్గొనే సమయంలో ఎలా ఉన్నారు.. మీ భాగస్వామి ఎలా ఉన్నారనే విషయాలను అస్సలు ఆలోచించొద్దు. ముఖ్యంగా మీ పార్ట్నర్ పర్సనాలిటీ ఎక్కువగా ఉందని లేదా తక్కువగా ఉందనే విషయాల గురించి అస్సలు పట్టించుకోవద్దు. ముందుగా దీపాలన్నీ ఆర్పేయండి.. ఆ కార్యాన్ని ఆసాంతం ఆస్వాదించడం అలవాటు చేసుకోండి.

నిజాయితీగా షేర్ చేసుకోండి..

నిజాయితీగా షేర్ చేసుకోండి..

పడకగదికి చేరుకునే ప్రతి ఒక్క జంట ఎంత ఎక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఆ కార్యంలో పాల్గొనే సమయంలో మీకు ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయో మీ పార్ట్నర్ కు చెప్పడం చాలా కీలకం. లేదంటే మీ ఇద్దరి మధ్య సమస్యలు వస్తాయట. అందుకే మీరిద్దరూ బెడ్రూమ్ లో అన్ని విషయాలను నిజాయితీగా షేర్ చేసుకోండి.

English summary

Love Making Resolutions That You Need To Make For 2022 in Telugu

Here are the love making resolutions that you need to make for 2022 in Telugu. Have a look
Story first published: Saturday, January 15, 2022, 15:40 [IST]
Desktop Bottom Promotion