For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాలెంటైన్స్ డే స్పెషల్ : వీరి ప్రేమ కథలు వింటే... ప్రేమకు హద్దులే లేవనిపిస్తుంది...

నేను ఒలా క్యాబ్ లో ఒక జంటను కలిశాను. అందులో ఓ అమ్మాయిని గమనిస్తే దాదాపు సగ భాగం కాలిన గాయాలతో కనిపించింది. అయితే ఆమె ఓ ఉన్మాది చేతిలో యాసిడ్ దాడికి గురైందట.

|

మన తెలుగు హీరోలు క్యాబ్ డ్రైవర్లుగా నటించిన ప్రేమ సినిమాలను మీరు ఇది వరకే చూసి ఉంటారు. వీరిలో ముఖ్యంగా విజయ్ దేవరకొండ టాక్సీవాలాగా... ప్రిన్స్ మహేష్ బాబు ఖలేజా సినిమాలో క్యాబ్ డ్రైవర్ గా తమ ప్రేమ ప్రయాణం ఎలా మొదలెడతారో కూడా మీకు గుర్తుండే ఉంటుంది.

Love stories shared by cab drivers

అయితే అంతకన్నా అద్భుతమైన ప్రేమ సంఘటనలు మన నిజ జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్రేమ కథలు వింటే కచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. అలాంటి ప్రేమ కథల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం...

ఈ ప్రత్యేకతలుంటే మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని లవ్ చేస్తున్నట్టే...!ఈ ప్రత్యేకతలుంటే మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని లవ్ చేస్తున్నట్టే...!

అందమైన రూపం కోల్పోయినా..

అందమైన రూపం కోల్పోయినా..

నేను ఒలా క్యాబ్ లో ఒక జంటను కలిశాను. అందులో ఓ అమ్మాయిని గమనిస్తే దాదాపు సగ భాగం కాలిన గాయాలతో కనిపించింది. అయితే ఆమె ఓ ఉన్మాది చేతిలో యాసిడ్ దాడికి గురైందట. అయితే తన అందమైన రూపాన్ని కోల్పోయినప్పటికీ ఆ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి తననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

మనసుకు ప్రాధాన్యం..

మనసుకు ప్రాధాన్యం..

ప్రేమించిన అమ్మాయి రూపానికి కాకుండా తన మనసుకు ప్రాధాన్యం ఇచ్చాడు. అతను తీసుకున్న నిర్ణయం నాకు చాలా గొప్పగా అనిపించింది. ఈరోజుల్లో అలాంటి వారు ఉండటం చాలా గొప్ప విషయం. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారనే చెప్పాలి. ఆ జంటను చూసి నేను చాలా ఆనందపడ్డాను. వారిద్దరూ జీవితాంతం అదే ప్రేమతో కలిసి ఉండాలని మనసులో కోరుకున్నాను.

కళ్లను మాయ చేసే ప్రేమ...

కళ్లను మాయ చేసే ప్రేమ...

మరోసారి నేను పంజాబ్ వద్ద ఉన్న రైల్వేస్టేషన్ కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నాకు మనసుని హత్తుకునే ఓ అందమై ప్రేమ కథ గురించి తెలిసింది. అప్పటివరకు అలాంటి వాటిని నేను సినిమాల్లో మాత్రమే చూశాను. కానీ ఆరోజు నేను అక్కడ నిజమైన ప్రేమ కథను కళ్లారా చూశాను.

తొలిసారి లాహోర్ లో...

తొలిసారి లాహోర్ లో...

నేను అక్కడ కాస్త దూరం ప్రయాణం చేయాల్సి ఉండేది. అప్పుడే అక్కడ ఓ టాక్సీని బుక్ చేసుకున్నాను. అదే కారులో నాకు ఓ వయసు పైబడిన జంట కలిసింది. వారిద్దరూ నాతో ఎంతో ప్రేమగా మాట్లాడారు. వారి మాటల్లో నాకు అర్థమయ్యింది ఏమిటంటే.. ఇండియా-పాకిస్థాన్ విడిపోక ముందు వారిద్దరూ లాహోర్ లో నివసించేవారట! వారిద్దరూ మొట్టమొదటిసారి అక్కడే కలుసుకున్నారట.

కర్ఫూ సమయంలో..

కర్ఫూ సమయంలో..

ఆ సమయంలో అక్కడ కొంత అల్లర్లు ఎక్కువగా జరుగుతుండేవట. అయితే ఆ సమయంలో ఆయన ఆమెను సురక్షితంగా తన ఇంటికి చేర్చేశారట. అలా వారిద్దరిలో ప్రేమ మొదలైందట. ఆ తర్వాత మన దేశానికి వచ్చేశారట. కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్నారట.

గొడవతో ప్రయాణం..

గొడవతో ప్రయాణం..

మరో క్యాబ్ డ్రైవర్ ప్రేమ గురించి ఇలా వివరించాడు. ఓ రోజు బెంగళూరులో తన క్యాబ్ లో ఓ జంట వాదులాడుకుంటూ ఎక్కారట. వారిద్దరు కొన్ని రోజుల క్రితం విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారట. గమ్యం చేరే వరక విరామం లేకుండా గొడవ పడుతూనే ఉన్నారంట.

నాకో మేసేజ్..

నాకో మేసేజ్..

ఆ సమయంలో ఆ డ్రైవర్ వారిద్దరికీ చిన్న చిన్న సలహాలు ఇచ్చాడట. ఇది జరిగిన కొన్నిరోజులకే వారిద్దరి నుండి ధన్యవాదాలు తెలుపుతూ తనకు మెసెజ్ వచ్చిందట. ఆ క్షణాన్ని తానెప్పుడు మరువలేను.. తన వల్ల ఇద్దరు కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు.

అంతా ఫోన్ లోనే..

అంతా ఫోన్ లోనే..

ఒకసారి ఒక అమ్మాయి రైల్వేస్టేషన్ కు వెళ్లేందుకు నా క్యాబ్ బుక్ చేసుకుంది. తనని పికప్ చేసుకున్న తనతో మాట్లాడటం ప్రారంభించాను. ఆ క్రమంలోనే తను ప్రేమించిన అబ్బాయిని రిసీవ్ చేసుకునేందుకు రైల్వేస్టేషన్ కు వెళ్తున్నట్లు నాతో చెప్పించింది. అయితే అతనిని ఇంతవరకు చూడలేదని చెప్పింది. ఇప్పటివరకు కేవలం ఫోన్ లోనే మాట్లాడుకున్నాం అని చెప్పింది.

ప్రేమలో నిజాయితీ..

ప్రేమలో నిజాయితీ..

అయితే వారిద్దరి ప్రేమలో ఎంతో నిజాయితీ ఉంది. ఆమెతో కలిసి ప్రయాణించిన నేను ఆరోజు ఒక విషయాన్ని గ్రహించాను. ప్రేమించుకోవడం కళ్లెదుట ఉండే వారినే కాదు.. కళ్లతో మనం చూడకపోయినా ప్రేమించుకోవచ్చు. అది ఒక మధురమైన అనుభూతిగా భావించాను.

లవ్ గిఫ్ట్..

లవ్ గిఫ్ట్..

ఒకసారి నా క్యాబ్ లో ఓ యువ జంట క్యాబ్ ను బుక్ చేసుకున్నారు. వారు దిగాల్సిన చోటకు చేర్చి.. నేను వెళ్లిపోయిన గంట తర్వాత నాకు ఫోన్ వచ్చింది. ఆ యువకుడు తన గిఫ్ట్ ఒకటి నా కారులో ఉండిపోయిందన్నాడు. నేను వెంటనే అక్కడ చెక్ చేస్తే అది కారులో కింద పడిపోయింది. ఆ విషయం నేను కూడా గమనించలేదు.

తన ప్రేమను..

తన ప్రేమను..

వెంటనే నేను వారు ఎక్కడున్నారో తెలుసుకుని ఆ గిఫ్ట్ వారికి అందించా. తను నా ముందే ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఉంగరాన్ని తీసి అమ్మాయి చేతి వేలికి తొడుతూ తన మనసులో ఉన్న ప్రేమను తెలిపాడు. అయితే తను నన్ను అక్కడి నుండి వెళ్లనివ్వలేదు. ఓ ఐదు నిమిషాల తర్వాత తన చేతిలో కేక్ నా ముందు ప్రత్యక్షమయ్యాడు. అది నాకు ఎంతో అభిమానంగా ఇచ్చి తినమని కోరాడు. ఇప్పటివరకు నేను చూసిన ప్రేమ ప్రతిపాదనల్లో ఇదే బెస్ట్ అని చెప్పగలను.!

ఈ కథలన్నీ విన్నాక.. చూశాక.. నాకు ప్రేమతో చూస్తే ప్రతిదీ ఈ ప్రపంచంలో ప్రేమతో ముడిపడినదే.. అనిపిస్తోంది. కాకపోతే అది చూసే కళ్లను బట్టి అది కనిపిస్తుంది అంతే.. కరెక్టే కదా...

English summary

Love stories shared by cab drivers

Here we talking about love stories shared by cab drivers. Read on
Desktop Bottom Promotion