Latest Updates
-
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది
మీ భర్త ‘ఇలా’ ప్రవర్తిస్తే.. ఫేక్ రిలేషన్ షిప్ లో ఉన్నట్టే..!
మోసం చేయాలనుకునే ప్రతిసారీ మగాళ్లు చెప్పే కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం మనసారా ప్రేమించిన వ్యక్తులపై లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి ద్వారా ఒక్కటైన భాగస్వామిపై మనం ఎంతగానో నమ్మకం పెట్టుకుంటాం. వారితోనే మనం జీవితాంతం హాయిగా కలిసి ఉంటామని ఆశిస్తాం.

అందరి లైఫ్ లోనూ ఇలాగే జరిగితే ఎంతో అద్భుంగా ఉంటుంది. కానీ కొందరు మగాళ్లు మాత్రం తమ భాగస్వామిని మోసం చేస్తూ ఉంటారు. తనే ప్రపంచం అని జీవిస్తున్న మహిళలను మోసం చేసేస్తుంటారు. ఇతరులతో రహస్య రిలేషన్ షిప్ చేస్తూ.. అనునిత్యం అబద్ధాలను చెబుతూ ఉంటారు.

తమ ఫేక్ రిలేషన్ షిప్ గురించి భాగస్వామికి తెలియకుండా ఏవేవో డ్రామాలు ఆడుతుంటారు. ఒకవేళ మీకు రెడ్ హ్యాండెడ్ గా దొరికినా.. ఆ రిలేషన్ నుండి తప్పించుకోవడానికి కుంటి సాకులు చెబుతుంటారు. సాధారణంగా ఇలాంటి రిలేషన్ ను చాలా మంది గుర్తించలేరు.

అయితే కొన్ని విషయాలను పరిశీలించడం ద్వారా వారి టాక్సిక్ రిలేషన్ గురించి తెలుసుకోవచ్చు.. మీతో వారి ప్రవర్తన ఏ విధంగా ఉందో పరిగణనలోకి తీసుకుని తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

మాటలు తగ్గిస్తారు..
తను ఎంత బిజీగా ఉన్నా.. వీలు చేసుకుని మరీ ఎప్పుడూ మీతో ఆప్యాయంగా మాట్లాడే మీ భాగస్వామి అకస్మాత్తుగా మీతో మాటలు తగ్గించడం.. సోషల్ మీడియాలో మీ ఫొటోలకు, వీడియోలకు కామెంట్ చేయకపోవడం.. కనీసం లైక్ కొట్టకపోవడం వంటివి చేస్తే మీరు కాస్త ఆలోచించాల్సిందే.

ఇతర స్త్రీ ఫొటోలకు లైక్ కొట్టడం..
మనలో చాలా మంది సోషల్ మీడియాలో ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోలకు లైక్స్, కామెంట్స్ పెట్టడం చాలా కామన్. అయితే మీ భాగస్వామి మీ ఫొటోకు తప్ప ఇతర స్త్రీల ఫొటోలకు లైక్ కొట్టి, క్యూట్ అని.. ఏంజిల్ అని, అద్భుతంగా ఉందని కామెంట్లు పెడుతుంటే మాత్రం వారిని కాస్త అనుమానించాల్సిందే. అక్కడితో ఆగకుండా.. వారితో చాటింగ్ చేసేందుకు తహ తహలాడుతున్నా.. తరచూ వారితో మెసేజ్ చేయడానికి ట్రై చేస్తే మీరు తీవ్రంగా పరిగణించాలి.

ఇతరులను ఆకట్టుకునేందుకు..
సాధారణంగా పెళ్లైన మగవారు తమ బాడీ ఫిట్ నెస్ పై అంతగా శ్రద్ధ చూపరు. అయితే వారు తమ శరీరాక్రుతిపై ఉన్నట్టుండి ఫోకస్ పెడితే.. అప్పటివరకు అందం గురించి అస్సలు పట్టించుకోని మీ శ్రీవారు అందంగా ముస్తాబవ్వడం.. జిమ్ కి వెళ్లడం వంటివి చేస్తుంటే మాత్రం కొంచెం అనుమానించాల్సిందే. ఎవరినో ఇంప్రెస్ చేయడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానించొచ్చు.

భోజనం చేసే వేళ..
మీరిద్దరూ ఎప్పుడూ కలిసే భోజనం చేసే అలవాటు ఉండి.. ఇటీవలి కాలంలో మీ భాగస్వామి మీతో కలిసి తినేటప్పుడు మధ్యలో ఫోన్ వస్తే.. సడెన్ గా వారు లేచిపోవడం వంటి పనులు చేస్తే వారిని అనుమానించొచ్చు. లేదంటే.. ఆ ఫోన్ తర్వాత టెన్షన్ పడుతూ బయటికి వెళ్తుంటే, వారు మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే.

ఎలా ఎస్కేప్ అవ్వాలా?
ఇతరులతో రిలేషన్ షిప్ లో ఉండే మగాళ్లు, తమ భాగస్వామి నుండి తప్పించుకుని.. ఇతరులను కలిసేందుకు ఏవేవో నాటకాలాడుతుంటారు. అంతేకాదు.. పక్కవారి వైపు చూపులు మొదలైనప్పుడు మీతో ఊరికే గొడవ పడుతూ ఉంటారు. వారిపై ఉండే ఇష్టం.. మీపై ఏ మాత్రం చూపరు. పైగా మీపై కోపంగా ఉంటారు. ఇలా చేస్తుంటే మీరు అనుమానించాల్సిందేనట.

ట్రైనింగ్ లేదా క్యాంపుకు..
మోసం చేసే విషయంలో మగాళ్లు అత్యంత సాధారణ కారణాల్లో ఇదొకటి. నాకు ఆఫీసులో అర్జెంట్ గా పని ఉందని.. నాలుగైదు రోజులు ట్రైనింగ్ కి వెళ్లాలని లేదా క్యాంపు ఉందని చెబుతుంటారు. అలా చెబుతుంటే వారిపై మీరు ఓ కన్నేయాలి. వారు వెళ్లే ప్రదేశాన్ని, లాడ్జి లేదా హోటల్, బుకింగ్ వివరాల గురించి తెలుసుకోవాలి. లేదంటే వాళ్లు మిమ్మల్ని మోసం చేస్తూ.. తమ ప్రియురాలితో ఎంచక్కా ఎంజాయ్ చేస్తారు.



Click it and Unblock the Notifications